S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/14/2017 - 02:59

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముస్లింలకు రిజర్వేషన్లు పెంచి తీరుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నట్టే తెలంగాణలోనూ రిజర్వేషన్లు పెంచుకుంటామన్నారు.

04/14/2017 - 02:57

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టానికి రూపకల్పన జరిగింది. ఈ చట్టం అమలుకు అవసరమైన నియమనిబంధనలను రూపొందించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సచివాలయంలో సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష సమావేశం జరిగింది.

04/14/2017 - 03:30

హైదరాబాద్, ఏప్రిల్ 13: మరో అరుదైన అంతర్జాతీయ సదస్సుకు భాగ్యనగర్ వేదిక కానుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రెండు నుంచి అయిదేళ్లు మొదలుకుని యాభై ఏళ్లకు ఒక్కసారి జరిగే సివోపి-11, బయోడైవర్శిటీ వంటి ప్రపంచ స్థాయి సదస్సులకు నగరం వేదికైన సంగతి తెలిసిందే! ఇపుడు 2019లో గానీ 2020 ప్రథమార్థంలో గానీ ప్రారంభం కానున్న ‘లంగ్ హెల్త్’ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌కు నగరం వేదిక కానుంది.

04/14/2017 - 02:52

వరంగల్, ఏప్రిల్ 13: గిట్టుబాటు ధరలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలోని మిర్చి రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాదిరిగా రాష్ట్రంలోని మిర్చి రైతులకు పంటపై లభిస్తున్న ధరకు బోనస్‌గా మరికొంత మొత్తాన్ని చెల్లించే విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉందని అన్నారు.

04/14/2017 - 02:50

హైదరాబాద్, ఏప్రిల్ 13:తెలంగాణలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై అత్యధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్న 324 ప్రదేశాలను (బ్లాక్‌స్పాట్స్) ను అధికారులు గుర్తించారు. రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారంనాడు డిజిపి (రోడ్డు భద్రత) టి కృష్ణప్రసాద్, రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఇంజనీరింగ్ చీఫ్ రవీందర్‌ల నేతృత్వంలో సమావేశం జరిగింది.

04/14/2017 - 02:43

హైదరాబాద్, ఏప్రిల్ 13: పతంగులు ఎగురవేస్తూ విద్యుత్ ప్రమాదంలో రెండు కాళ్లు, చేతిని కోల్పోయిన చింతల్‌కు చెందిన షేక్ అవుతుల్లాను మంత్రి కెటిఆర్ ఉదారంగా ఆదుకున్నారు. కేవలం కుర్చీకే పరిమితమైన షేక్ అవుతుల్లా గురించి మంత్రి తెలుసుకుని చలించిపోయా రు. కదల్లేని అవుతుల్లాకు ముందు మొబిలిటీని ఇవ్వాలని భావించారు.

04/14/2017 - 02:37

హైదరాబాద్, ఏప్రిల్ 13: మతాలను, కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలనే ఆలోచన టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర పశసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. ముస్లింలలో వెనుకబడ్డ వృత్తులు, వర్గాల వారికి రిజర్వేషన్లు పెంచడం అంశంపై బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి విమర్శించడం పట్ల తలసాని మండిపడ్డారు.

04/14/2017 - 02:37

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణలో పాఠశాలలకు సంబంధించి వేసవి సెలవులపై తీవ్ర గందరగోళం నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో ఈ నెల 15వ తేదీ నుండి సెలవులు ఇస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టడంతో విద్యార్ధుల్లో తల్లిదండ్రుల్లో అయోమయం ఏర్పడింది. ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారం 22 వరకూ తరగతులు నిర్వహించి, 23 నుండి సెలవులు ఇవ్వాల్సి ఉంది.

04/14/2017 - 02:36

హైదరాబాద్, ఏప్రిల్ 13: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. తెలంగాణలో 2017-18 ఆర్ధిక సంవత్సరానికి విద్యుత్ చార్జీల పెంపులేదు. ఈ మేరకు డిస్కాంలు విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు అందజేశాయి.

04/14/2017 - 02:36

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం తదితర జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండకు తోడు, గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోత ఎక్కువగా ఉంది. దాంతో ప్రజలు ఎండలకు, వేడిగాడ్పులకు తట్టుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం వేళ తప్పనిసరిగా ఐతే తప్ప ఇళ్లువదిలి బయటకు రావడం లేదు.

Pages