S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/17/2017 - 04:22

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఆదివారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ముస్లింల రిజర్వేషన్ల పెంపుదల కోసం శాసనసభ, మండలి ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందగానే శాసనసభను స్పీకర్ మధుసూధనాచారి, మండలిని చైర్మన్ స్వామిగౌడ్ నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు.

04/17/2017 - 04:22

హైదరాబాద్, ఏప్రిల్ 16: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని బిజెపి శాసన సభాపక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం శాసన సభలో ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుపై కిషన్‌రెడ్డి మాట్లాడారు.

04/17/2017 - 03:13

హైదరాబాద్, ఏప్రిల్ 16: గిరిజనుల రిజర్వేషన్లకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఇస్తున్న ముస్లింల రిజర్వేషన్లను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని బిజెపి శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, పార్టీ ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి వేర్వేరుగా మాట్లాడుతూ చెప్పారు.

04/17/2017 - 03:12

హైదరాబాద్, ఏప్రిల్ 16: జాతీయ రహదారుల అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలో రూ.4,470 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి కేంద్రం అనుమతి కోసం పంపించామని రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు సాధించుటకు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించామన్నారు. శాసనసభ ఆవరణలోని తన చాంబర్‌లో ఆదివారం రోడ్లు, భవనాలశాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

04/17/2017 - 03:17

హైదరాబాద్, ఏప్రిల్ 16: జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, బిసిల రిజర్వేషన్ల కోటా పెంచే విషయంలో సిఎం కెసిఆర్ ద్రోహం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మండిపడ్డారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు పెంచిన సిఎం కెసిఆర్ అదే పద్దతిలో ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు పెంచరని ప్రశ్నించారు.

04/17/2017 - 03:15

హైదరాబాద్, ఏప్రిల్ 16: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 15వ తేదీ నుండి నిర్వహించనున్నారు. ఉదయం ఫస్టియర్, సాయంత్రం సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉదయం 9 నుండి 12 వరకూ ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకూ సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 23 నాటికి పరీక్షలు పూర్తవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 24 నుండి 28 వరకూ నిర్వహిస్తారు.

04/17/2017 - 03:18

సెకండియర్
పేరు మార్కులు జిల్లా
కొండా నిఖిత 993 ఖమ్మం
మహమద్ నూమన్ రజ్వీ 993 నిజామాబాద్
వంగల సాయి చరణ్ 992 ఖమ్మం
సిహెచ్ భానుప్రకాష్ 991 భద్రాద్రి
మవురం రాజ్ వెంకట రెడ్డి 991 మేడ్చల్
అనుగు శివ మారుతి రెడ్డి 991 మేడ్చల్
చల్లా కావ్యశ్రీ 991 రంగారెడ్డి
బైపిసి
పోతరాజు దీపిక 991 రంగారెడ్డి

04/16/2017 - 08:01

సదాశివనగర్, ఏప్రిల్ 15: త్వరలోనే ప్రభుత్వం ఇంటింటికి సోలార్ విద్యుత్‌ను అందిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డి అన్నా రు. శనివారం మండలంలోని ధర్మారావుపేట్ గ్రామం వద్ద రెన్యూపవర్ వా రు ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ క్షేత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించకుం డా, సోలార్ ద్వారా విద్యుత్‌ను తయా రు చేయటం అభినందనీయం అన్నా రు.

04/16/2017 - 08:00

హైదరాబాద్, ఏప్రిల్ 15: హైదరాబాద్‌లో 300 పడకల ఇఎస్‌ఐ ఆస్పత్రి, విశాఖలో 500 పడకల ఆస్పత్రులను నిర్మిస్తామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలొ 31 జిల్లాల్లో ఇఎస్‌ఐ సేవలను విస్తరింపచేస్తామని ఆయన వెల్లడించారు.

04/16/2017 - 07:45

దేవీ ఆలయాన్నీ దర్శించుకున్న ప్రధాని మోదీ భార్య

Pages