S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/15/2017 - 00:45

హైదరాబాద్, ఏప్రిల్ 14: తాము బిజెపిలోకి వెళ్ళబోమని కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బిజెపిలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

04/15/2017 - 00:45

హైదరాబాద్, ఏప్రిల్ 14: రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, ఒక్క క్షణం కూడా కరెంటు కోతలు లేవని, 11వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా తట్టుకునేందుకు వీలైన ఏర్పాట్లు చేశామని తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు.

04/15/2017 - 00:14

హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-2 ఫలితాలను నేడో రేపో విడుదల చేసేందుకు పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాట్లు చేసింది. గతంలో విడుదల చేసిన తాత్కాలిక కీపై అభ్యర్ధుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుది కీ రూపొందించిన కమిషన్ ఆ కీ ప్రాతిపదికగా గ్రూప్-2 ఫలితాలను సిద్ధం చేసింది. ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ చక్రపాణి తెలిపారు.

04/15/2017 - 00:13

హైదరాబాద్, ఏప్రిల్ 14: మైనారిటీల రిజర్వేషన్ల కోసం రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఈ నెల 16న ప్రత్యేకంగా సమావేశం కానున్న నేపథ్యంలో శనివారం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఎసి)లు భేటీ కానున్నాయి. తొలుత సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనా చారి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం కానున్నది. ఆ తర్వాత 5.30 గంటలకు కౌన్సిల్ చైర్మన్ కె.

04/15/2017 - 00:13

హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ ముసాయిదా సిద్ధం అయింది. ఇందుకు సంబంధించి ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టి తిరుపతిరావు అధ్యక్షతన ఏర్పాటయిన ఉన్నతస్థాయి కమిటీ తన నివేదికను నేడో రేపో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు అందించనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలిసింది.

04/15/2017 - 00:12

హైదరాబాద్, ఏప్రిల్ 14: వెనుకబడిన వర్గాల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 21న నగరంలోని బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తెలిపారు. చట్ట సభల ఎన్నికల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

04/15/2017 - 00:12

హైదరాబాద్, ఏప్రిల్ 14: ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు రైతులపై ప్రేమ పుట్టుకొచ్చి సబ్సిడీ రూపేణా ఎరువులను ఉచితంగా సరఫరా చేస్తానని చెప్పడం కిందిస్థాయిలో ఈ ప్రభుత్వం మీద రైతు వ్యతిరేకత స్పష్టంగా కనిపించడం వల్లనే రైతులకు అనుకూలమని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా ఎరువులు సరఫరా చేస్తామని ప్రకటించినట్టు తెలుస్తోందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు.

04/15/2017 - 00:10

హైదరాబాద్, ఏప్రిల్ 14: ఎండలు రోజు రోజుకు పెరుగుతాయని, ఈ వారం మరింత ఎక్కువ ఎండలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఎండలు నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కుమరంభీమ్- ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్- భూపాలపల్లి, భద్రాద్రి- కొత్తగూడెం ప్రాంతాల్లో అత్యధికంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉంది.

04/14/2017 - 03:09

హైదరాబాద్, ఏప్రిల్ 13: భారతదేశానికే హైదరాబాద్ తలమానిక నగరమని 21వ శతాబ్దంలో తనకంటూ ఒక చోటును తన నైపుణ్యాలతో చెక్కుకుందని ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ అన్నారు. వౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ నిర్వహించిన కులీ కుతుబ్‌షా స్మారక కార్యక్రమంలో ప్రధాన ఉపన్యాసం చేసిన అన్సారీ సహనం, సహజీవనం, సాంస్కృతిక సొబగు, సంక్రమిత సంప్రదాయం మేళవించిన హైదరాబాద్ తరతరాలుగా తన ప్రత్యేకతను చాటుకుంటూనే వస్తోందన్నారు.

04/14/2017 - 03:00

హైదరాబాద్, ఏప్రిల్ 13: టిఆర్‌ఎస్ ప్లీనరీ తీర్మానాల కమిటీ తుది సమావేశం గురువారం జరిగింది. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు నివాసంలో జరిగిన సమావేశంలో ఎంపి వినోద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎస్ నిరంజన్‌రెడ్డి, పర్యాద కృష్ణమూర్తి పాల్గొన్నారు. మొత్తం పనె్నండు తీర్మానాలు ఉంటాయి. వీటిలో సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు.

Pages