S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/26/2017 - 07:11

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణలో ఈసారి అధికారం తమదేనని, వచ్చే సార్వత్రిక ఎన్నికల సంర్భంగా రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలకు తమ బ్రహ్మాస్త్రం ప్రధాని నరేంద్రమోదీయేనని ఆయన చెప్పారు.

03/26/2017 - 06:44

నిజామాబాద్, మార్చి 25: ఉత్తర తెలంగాణ జిల్లాల అభివృద్ధికి ఆయు వుపట్టులా నిలుస్తుందని ఆశిస్తున్న పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్ ప నులు పాతికేళ్లుగా కొన‘సాగు’తూ ఎట్టకేలకు పూర్తి కావడంతో ఈ మా ర్గంలో రైళ్ల రాకపోకలకు శ్రీకారం చుట్టారు.

03/26/2017 - 06:44

హైదరాబాద్, మార్చి 25: రానున్న రోజుల్లో రాష్ట్రంలోని వాహన కాలుష్య ధృవీకరణ మధ్యవర్తులతో పనిలేకుండా నేరుగా ఆన్‌లైన్ ద్వారా అం దించే ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో గువ్వల బాలరాజు, అజయ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, చిన్నయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జాఫర్ హుస్సేన్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

03/26/2017 - 06:25

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేస్తామని, ఎక్కువ నిధులిచ్చి రాష్ట్భ్రావృద్ధికి తోడ్పడతామని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు రూ.1729 కోట్లు ఇచ్చామన్నారు. కొత్త లైన్లకు రూ.1375 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు.

03/26/2017 - 06:23

హైదరాబాద్, మార్చి 25: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వచ్చే నెల 21న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ నిర్వహించనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించుకుందామని ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలతో శనివారం సమావేశమైన సిఎం కెసిఆర్, ప్లీనరీ ఎప్పుడు నిర్వహించేదీ ఖరారు చేశారు.

03/26/2017 - 06:20

హైదరాబాద్, మార్చి 25: డ్రైవర్ నాగరాజు హత్య కేసులో నిందితుడైన ఐఏఎస్ అధికారి ధరావత్ వెంకటేశ్వరరావు సస్పెండయ్యారు. ఈనెల 17న డ్రైవర్ నాగరాజును ఐఏఎస్ కొడుకు వెంకట్ సుక్రునాయక్ ఇటుకతో తలపై బాదగా అతను మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా నాగరాజు మృతదేహం మాయం చేసేందుకు యత్నించిన ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావుపై కేసు నమోదైంది.

03/26/2017 - 06:09

హైదరాబాద్/ వరంగల్, మార్చి 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ వివరణ కోరారు. ఏటూరునాగారంలో చేసిన ప్రసంగానికి సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలపై వివరణ కోరినట్టు సిఎస్ ఎస్‌పి సింగ్ మీడియాకు వెల్లడించారు.

03/26/2017 - 06:07

హైదరాబాద్, మార్చి 15: రాష్ట్రంలోని 15 పార్లమెంటు నియోజక వర్గాల్లో తెరాస విజయం సాధిస్తుందని సర్వేల్లో తేలినట్టు సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఎమ్మెల్యేలతో శనివారం భేటీ అయన సందర్భంలో ఎంపీల పనితీరుపైనా సమీక్ష జరిపారు. నియోజకవర్గాల్లో విజయావకాశాలపై సర్వే నిర్వహించినట్టు చెబుతూ, ర్యాంకులు ప్రకటించారు. 15 పార్లమెంట్ సెగ్మెంట్లలో తెరాస విజయం సాధించబోతుందని సర్వేలో తేలినట్టు చెప్పారు.

03/25/2017 - 05:11

న్యూఢిల్లీ, మార్చి 24: తెలంగాణలో బిజెపి తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం పోలీసులతో అణచివేయడాన్ని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన బిజెపి కేంద్ర కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రజాకార్ల రాజ్యం వైపు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకెళ్తున్నారని ఆయన ఆరోపించారు.

03/25/2017 - 05:10

హైదరాబాద్, మార్చి 24: పశ్చిమబెంగాల్‌లో నిరంతరం పెరుగుతున్న జిహాదీ హింస, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతి వ్యతిరేక శక్తులకు రాష్ట్రప్రభుత్వమే ప్రోత్సాహం ఇవ్వడం, రాష్ట్రంలో హిందూ జనాభా తగ్గిపోవడం పట్ల అఖిల భారత ప్రతినిధి సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత కార్యవాహ్ ఎక్కా చంద్రశేఖర్, సంఘ్ చాలక్ పి వెంకటేశ్వరరావు చెప్పారు.

Pages