S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/24/2017 - 04:33

హైదరాబాద్, మార్చి 23: జిహెచ్‌ఎంసి (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) పరిధితో పాటు చుట్టుపక్కల నివసిస్తున్న బ్రాహ్మణ నిరుద్యోగులకోసం ఈ నెల 26 న ‘జాబ్‌మేళా-2017’ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నేతృత్వంలో ‘పైలట్ ప్రాజెక్టు’గా ఈ కార్యక్రమం చేపడుతున్నామని పరిషత్ చైర్మన్ డాక్టర్ కెవి రమణాచారి తెలిపారు.

03/24/2017 - 04:31

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణలో కార్మిక శాఖ అన్ని సేవలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తోందని హోంశాఖ మంత్రి నాయిని నార్సింహరెడ్డి తెలిపారు. పరిశ్రమల్లో తనిఖీల పేరుతో అధికారులు ఇబ్బందులు పెట్టకుండా ఉండేందుకు గానూ సెల్ఫ్ సర్ట్ఫికేషన్ విధానం పద్దతిని పెట్టనున్నామన్నారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్‌పోర్ట్, నాన్‌ట్రాన్స్‌పోర్టు, హోంగార్డుల కోసం రూ.

03/24/2017 - 04:30

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై కోర్టు ఉల్లంఘన కేసును హైకోర్టులో దాఖలు చేయనున్నట్లు టిటిఎల్‌పి నేత ఎ.రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై 90 రోజుల్లోపుగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని శాసనసభ స్పీకర్‌పై కేసు వేస్తున్నట్లు తెలిపారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

03/24/2017 - 03:29

హైదరాబాద్, మార్చి 23: రాష్టవ్య్రాప్తంగా ఈ ఏడాది 2 వేల గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మించనున్నట్టు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శాసనసభలో గురువారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో బిజెపి సభ్యులు జి కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నలకు జూపల్లి సమాధానం చెబుతూ, కొత్తగా నిర్మించబోయే గ్రామ పంచాయతీ భవనాలకు రూ. 13 లక్షలు కేటాయించామన్నారు.

03/24/2017 - 03:28

హైదరాబాద్, మార్చి 23: రిజిస్ట్రేషన్లశాఖ అవినీతికి నిలయంగా మారిందని, దీంతో రాష్ట్ర ఆదాయానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని శాసనసభలో పాలకపక్ష సభ్యుడు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

03/24/2017 - 03:25

హైదరాబాద్, మార్చి 23: వేసవి వచ్చిందంటే చాలు మహానగర వాసులు తాగునీటి కోసం ఆందోళన చెందుతుంటారు. కానీ ఈసారి అలాంటి ఆందోళనేమీ అవసరం లేదని మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె.తారకరామారావు అసెంబ్లీలో హామీ ఇచ్చారు. పలువురు సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ వేసవికాలంలోనూ మామూలు రోజుల మాదిరిగానే సాధారణంగా నీటిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.

03/24/2017 - 03:23

హైదరాబాద్, మార్చి 23: శాసనసభలో విద్యుత్‌శాఖ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సభలో విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి క్షమాపణ చెప్పారు. శాసనసభ గురువారం ప్రారంభం కాగానే మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సభలో తాను ప్రధాన మంత్రిని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, రికార్డులను కూడా పరిశీలించానన్నారు.

03/24/2017 - 03:20

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డ చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను తిరిగి తెరిపించాలని, ఇందుకు రాష్ట్రప్రభుత్వం నడుం కట్టాలని శాసనసభలో కాంగ్రెస్ సభ్యురాలు, మాజీ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి కోరారు.

03/24/2017 - 03:18

హైదరాబాద్, మార్చి 23: రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని, జాతీయ సగటు అక్షరాస్యత కన్నా తెలంగాణలో అక్షరాస్యత తక్కువగా ఉందని, ఉపాధ్యాయులు లేక పోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని విపక్షాల సభ్యులు విమర్శించారు. వెంటనే డిఎస్‌సి నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

03/24/2017 - 03:17

హైదరాబాద్, మార్చి 23: ఈసారి గతంలో ఎప్పుడూ లేని విధంగా అసాధారణ స్థాయిలో ఎండలు ఉంటాయని, ఎండలు అప్పుడే ప్రారంభం అయ్యాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు రంగంలోకి దిగి తగిన చర్యలు చేపట్టాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ బిపి ఆచార్య సూచించారు. అసాధారణ వాతావరణ పరిస్థితులపై గురువారం నిర్వహించిన ఒక రోజు వర్క్‌షాప్ ముగింపు సభలో ఆయన మాట్లాడారు.

Pages