S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/25/2017 - 05:10

హైదరాబాద్, మార్చి 24: జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు ఆస్పత్రుల ఏర్పాటు గురించి మంత్రి వివరణ ఇచ్చారు.

03/25/2017 - 04:39

హైదరాబాద్/ చాంద్రాయణగుట్ట, మార్చి 24: కామంతో కళ్లుమూసుకుపోయిన దుర్మార్గులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారం రోజులు పాటు జరిగిన ఈ దుర్మార్గం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులు కోసం గాలిస్తున్నారు.

03/25/2017 - 04:39

హైదరాబాద్/ఉప్పల్, మార్చి 24: గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యుడు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన రోడ్డు పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదని ఆరోపించారు.

03/25/2017 - 04:38

హైదరాబాద్/ఖైరతాబాద్, మార్చి 24: ప్రభుత్వం మొక్కుబడిగా పోస్టులను భర్తీచేసి చేతులు దులుపుకుంటోందని టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. 40వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 8వేల 900పోస్టులను మాత్రమే భర్తీచేస్తామని మంత్రి కడియం శ్రీహరి ప్రకటించడం నిరుద్యోగులను దగా చేయడమేనని అన్నారు. టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థల బలోపేతానికి కృషి చేస్తోందని విమర్శించారు.

03/25/2017 - 04:38

హైదరాబాద్, మార్చి 24: దేశవ్యాప్తంగా 11 విశ్వవిద్యాలయాలు బిటెక్ ప్రవేశాలకు ‘యూని గేజ్ ఇ’ స్కోర్‌ను ఆమోదించాయి. ఎరా ఫౌండేషన్ సభ్యత్వ సంస్థల్లో యూనిగేజ్ పేరిట 150 నగరాల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.

03/25/2017 - 04:37

హైదరాబాద్ / చాంద్రాయణగుట్ట, మార్చి 24: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మీడియా పాయింట్ వద్ద జరిగిన వాగ్వివాదంలో కామాటీపుర పోలీసు ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను మాజీ ఎంపి వి.హనుమంతరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మీడియా పాయింట్ ముందు డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌తో హనుమంతరావు దురుసుగా ప్రవర్తించారు.

03/25/2017 - 04:37

హైదరాబాద్, మార్చి 24: గతంలో గ్రూప్ 1, 2,3 ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా భర్తీ చేసే వారని, కానీ ఇప్పుడు అన్ని ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కార్పొరేషన్ ఉద్యోగాలను సైతం పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించినట్టు శుక్రవారం శాసన సభలో తెలిపారు.

03/25/2017 - 04:36

హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ పోలీసు శాఖకు ప్రతిష్ఠాత్మకమైన ‘గోల్డెన్ పీకాక్’ అవార్డు లభించింది. హైదరాబాద్ నగర పోలీసు విభాగం ‘హైద్‌కాప్’ అనే మొబైల్ యాప్ రూపొందించి ప్రజలకు మెరుగైన సౌకర్యాన్ని కల్పించినందుకు ఈ అవార్డు లభించిందని హైదరాబాద్ నగర పోలీసు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

03/25/2017 - 04:35

హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కాలేజీల్లో 2017-18 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి మే 10వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్టు కార్యదర్శి బి శేషుకుమారి తెలిపారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు సైతం ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించాలని అన్నారు.

03/24/2017 - 04:34

హైదరాబాద్, మార్చి 23: ప్రభుత్వ గురుకుల కళాశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని ప్రారంభంలోనే అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో గురువారం మంత్రి సమ్మర్ సమురాయ్‌ని ప్రారంభించారు. సాంఘిక సంక్షేమ, గురుకుల సంక్షేమ, గురుకుల విద్యా బోధన మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం కుదిరిందని అన్నారు.

Pages