S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/22/2017 - 04:33

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ప్రజల వద్దకు విశ్వవిద్యాలయం పేరుతో ప్రజాకళల పునరుజ్జీవానికి ప్రజల వద్దకే వెళ్లి వారికి శిక్షణ ఇస్తున్నామని తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. లలిత కళలు, సాహిత్యం, సంస్కృతి, ప్రజా కళలు పరిరక్షణకు అన్ని చర్యలూ చేపట్టామని ఆయన వెల్లడించారు.

02/22/2017 - 02:27

హైదరాబాద్, ఫిబ్రవరి 21: అంతర్జాతీయంగా స్పేస్ టెక్నాలజీలో అతివేగంగా దూసుకుపోతున్న భారత్, వ్యవసాయ రంగంలో కూడా అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ప్రవేశపెడుతోంది. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇందుకు వేదిక కాబోతోంది.

02/22/2017 - 02:25

హైదరాబాద్, ఫిబ్రవరి 21: నిరుద్యోగ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మంగళవారం ఉపసంహరించుకుంది. పిటిషన్‌ను ఉపసంహరించుకున్న తర్వాత కోదండరామ్ 22న ముందు అనుకున్నట్లుగా ర్యాలీని నిర్వహించుతామని ప్రకటించిన విషయం విదితమే. నిరుద్యోగ ర్యాలీకి అనుమతి కోసం రెండు రోజుల క్రితం పిటిషన్ దాఖలయింది.

02/22/2017 - 02:23

హైదరాబాద్, ఫిబ్రవరి 21: వడగాడ్పులపై (వడదెబ్బ) బుధవారం జాతీయ సదస్సు జరుగుతోంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) నేతృత్వంలో డాక్టర్ ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి సంస్థలో రెండురోజుల పాటు సదస్సు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తోంది. వడగాడ్పుల ప్రభావం మనుషులపై ఎక్కువగా పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సందర్భంగా చర్చిస్తారు.

02/22/2017 - 02:23

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ ఆత్మహత్యలను నిరోధించేందుకు, గిట్టుబాటు ధరలు లభించేందుకు వీలుగా కేంద్రం వద్దకు అఖిల పక్షం తీసుకెళ్లాలని కల్వకర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి కొనగాల మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

02/22/2017 - 02:22

హైదరాబాద్, ఫిబ్రవరి 21: పంచాయితీరాజ్, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల ఉపాధ్యాయులకు కోర్టు ఆదేశాలకు లోబడి పదోన్నతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని కోర్టు ధిక్కారం కింద కేసును స్వీకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్లను కోర్టు ధర్మాసనం విచారించింది.

02/21/2017 - 12:56

హైదరాబాద్:జర్వేషన్ ప్రక్రియను ప్రశ్నిస్తూ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన సినిమా శరణం గచ్చామి సినిమాకు అనుమతివ్వాలంటూ ఓయూ కు చెందిన దళిత, గిరిజన విద్యార్థులు సెన్సార్ బోర్డ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆఫీస్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.

02/21/2017 - 12:51

హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చేందుకు హైకోర్టు సిద్ధమైంది. బుధవారం(22న) కాకుండా ఆదివారం(26న) నిర్వహించుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. అయితే ర్యాలీకి ఇప్పటికే ఏ‍ర్పాట్లు పూర్తి చేసుకున్నామని హైకోర్టుకు జేఏసీ తెలిపింది. శాంతియుత ర్యాలీ ఏర్పాట్ల వివరాల గురించి న్యాయస్థానం అడిగింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాయిదా వేసింది.

02/21/2017 - 12:43

జయశంకర్‌ భూపాలపల్లి : సమాజానికి వెలుగునిచ్చేది సింగరేణి కార్మికులేనని బీజేఎల్పీ నేత జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సింగరేణి సైరన్‌ యాత్రలో భాగంగా సింగరేణి ఐదో ఇంక్లైన్‌లో ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కార్మికులకు వైద్య కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్దీకరించాలని ఆయన కోరారు.

02/21/2017 - 12:35

మంచిర్యాల: జిల్లాలోని బెల్లంపల్లి మండలం అకెనేపల్లి అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు అకెనేపల్లికి చెందిన బాపు(45), నెన్నెలకు చెందిన లస్మక్క(35)గా గుర్తించారు.

Pages