S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/23/2017 - 02:17

హైదరాబాద్/ రాజేంద్రనగర్, ఫిబ్రవరి 22: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కూలర్ల గోదాంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. వీరిలో నలుగురు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.

02/23/2017 - 02:12

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ‘రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారించింది’ అని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం కోదండరామ్ పోలీసు స్టేషన్ నుంచి విడుదలయ్యాక ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం పోలీసులు ఆయనను అరెస్టు చేసి కామాటిపురా పోలీసు స్టేషన్లో సాయంత్రం వరకు ఉంచారు. సాయంత్రం విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడేందుకూ పోలీసులు అవకాశం ఇవ్వకుండా ఆయన్ను తార్నాకలోని నివాసానికి తరలించారు.

02/23/2017 - 02:09

హైదరాబాద్, ఫిబ్రవరి 22: నిరుద్యోగుల నిరసన ర్యాలీని పోలీసులు వ్యూహాత్మకంగా భగ్నం చేశారు. టిజెఎసి చైర్మన్ ఎం కోదండరామ్‌ను తెల్లవారజాము 3.30 గంటల సమయంలో తార్నాకలోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. తొలుత ఆయన తలుపులు తీయకపోవడంతో పోలీసులు గునపాలతో బద్ధలుకొట్టారు. ఈ సందర్భంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.

02/22/2017 - 12:19

హైదరాబాద్‌: నిరుద్యోగుల ర్యాలీ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణ నిరుద్యోగ సమస్యపై నేడు ర్యాలీ నిర్వహించాలని రాజకీయ ఐకాసా ఛైర్మన్‌ కోదండరామ్‌ పిలిపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన్ను బుధవారం తెల్లవారు జామున పోలీసులు అరెస్టు చేశారు.

02/22/2017 - 04:39

హైదరాబాద్, ఫిబ్రవరి 21: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ శాసనమండలి ఉపాధ్యాయ స్థానానికి మంగళవారం నామినేషన్ల పరిశీలన జరిగింది. రెండు నామినేషన్లను తిరస్కరించారు. ఒక నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టారు. మొత్తం 17 మంది 33నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి అధ్వైత కుమార్ సింగ్ నామినేషన్లను పరిశీలించి, నిబంధనల ప్రకారం లేకపోవడం వల్ల భోజరాజు, సంతోష్ యాదవ్‌ల నామినేషన్లను తిరస్కరించారు.

02/22/2017 - 04:38

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమ సమయంలో టెన్షన్ ఉన్నట్లు ఇప్పుడు మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్‌ను పోలీసులు దాదాపు గృహ నిర్బంధం చేశారు. బుధవారం ఉదయం ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తే అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటి వద్ద సిద్ధంగా ఉన్నారు.

02/22/2017 - 04:37

హైదరాబాద్, ఫిబ్రవరి 21: నిరుద్యోగ ర్యాలీపై అధికార పక్షం, కోదండరామ్ నేతృత్వంలోని వైరి పక్షం ఎత్తులు పై ఎత్తులతో రాజకీయం సాగిస్తున్నాయి. గత రెండేళ్ల కాలంలో దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగడమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు కూడా వెలువడుతున్నాయి.

02/22/2017 - 04:35

హైదరాబాద్, ఫిబ్రవరి 21: జీవో 123 ప్రకారం భూ సేకరణను నిలుపుదల చేస్తూ జనవరి 5న ఇచ్చిన స్టేను సవరించేందుకు హైకోర్టు మంగళవారం సంసిద్ధత వ్యక్తం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అఖ్తర్ కేసును విచారించారు. భూ నిర్వాసితులకే కాకుండా వివిధ వృత్తులపై ఆధారపడి జీవించే వారికి పునరావసం కోసం ప్రభుత్వం జీవో 38ని జారీ చేసింది.

02/22/2017 - 04:35

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ పదవీకాలం పొడిగించారు. ఈనెలతోనే ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డిజిపి పదవీకాలాన్ని ఈ ఏడాది నవంబర్ వరకు పొడిగించింది. దీంతో అనురాగ్ శర్మ ఈ సంవత్సరం నవంబర్ వరకు డిజిపి పదవిలో కొనసాగుతారు.

02/22/2017 - 04:34

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ నిరుద్యోగ జెఏసి నిర్వహించతలపెట్టిన ర్యాలీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Pages