S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/24/2017 - 04:36

మిర్యాలగూడ, ఫిబ్రవరి 23: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగిన ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానన్న కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉద్యమకారులను కాటేస్తున్నారని, కాపలా కుక్కే కాటేస్తే ఎలా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు.

02/24/2017 - 04:35

తిప్పర్తి, ఫిబ్రవరి 23: తెలంగాణలో ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి నియంతృత్వ పాలన సాగిస్తున్న సిఎం కెసిఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. మండలంలో దుప్పలపల్లి నుండి తిప్పర్తి వరకు 1000 మోటార్ సైకిళ్ల ర్యాలీ, కోలాట ప్రదర్శనలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

02/24/2017 - 04:35

నిజామాబాద్, ఫిబ్రవరి 23: పన్ను చెల్లింపులను సక్రమంగా జరిపినప్పుడే ఆర్థిక లావాదేవీలకు చట్టబద్ధత చేకూరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మెగ్వాల్ అన్నారు. డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంపొందించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్‌లో గురువారం నిర్వహించిన డిజి ధన్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

02/24/2017 - 04:31

కురవి, ఫిబ్రవరి 23: మహాశివరాత్రిని పురస్కరించకుని జరిగే మహ బూబాబాద్ జిల్లా కురవిలోని భద్రకాళి సమేత వీరభద్రుని కల్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం ఆచారం ప్రకారం ఆలయ ప్రధాన పూజారి పారుపెల్లి రామన్న ఇంటి నుండి మేళతాళాలతో పసుపు, కుంకుమలు తీసుకురావడంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

02/23/2017 - 07:59

హైదరాబాద్, ఫిబ్రవరి 22: తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో బుధవారం ఉస్మానియా యూనివర్శిటీలో చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా కొంతమంది పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతుండగా సందీప్ అనే విద్యార్థి తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటుండగా పోలీసులు అతణ్ని వారించారు.

02/23/2017 - 07:59

హైదరాబాద్, ఫిబ్రవరి 22: నిరుద్యోగుల నిరసన ర్యాలీని భగ్నం చేసేందుకు తెలంగాణ జెఎసి నేత ప్రొఫెసర్ కోదండరామ్‌ను అర్ధ రాత్రి అరెస్టు చేయడం అత్యంత హేయమైన చర్యగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభివర్ణించారు. కెసిఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని మండపడ్డారు.

02/23/2017 - 07:58

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ప్రసిద్ధ రచయిత పాపినేని శివశంకర్‌కు బుధవారం ఢిల్లీలోజరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సాహిత్య అకాడమి పురస్కారాన్ని అందజేశారు. రజనీగంథ పేరిట రాసిన కవితా సంకలనానికి శివశంకర్‌కు 2016వ సంవత్సరంలో సాహిత్య అకాడమి పురస్కారం దక్కింది. 24 భాషల్లో 24 మంది రచయితలకు బుధవారం పురస్కారాలు అందించారు.

02/23/2017 - 07:58

తిరుపతి, ఫిబ్రవరి 22: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే స్వామివారికి 5కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు చేయిస్తానని కెసిఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కిన మొక్కులను బుధవారం సిఎం హోదాలో వచ్చి తీర్చుకున్నారు. ఈసందర్భంగా 14కేజీల 148 గ్రాముల బరువుకలిగిన బంగారుకమల సాలిగ్రామ హారాన్ని అలాగే 4కేజీల 924 గ్రాముల బరువు కలిగిన ఐదుపేటల మకర కంఠి హారాన్ని ఆయన శ్రీవారికి సమర్పించారు.

02/23/2017 - 07:57

హైదరాబాద్, ఫిబ్రవరి 22: నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని శాంతియుతంగా ర్యాలీ నిర్వహించతలపెట్టిన ప్రొఫెసర్ కోదండరాం సహా యువకులు, విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నట్టు ఒయు ఐకాసా నేతలు తెలిపారు.

02/23/2017 - 02:18

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఆసరా పెన్షన్ల కోసం రూ.5054 కోట్లు, ఒంటరి మహిళల పెన్షన్ల కోసం రూ.247 కోట్లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతిపాదించింది. రోడ్ సౌకర్యం లేని 459 గ్రామాలలో సిసి రోడ్లు, 500కు పైగా జనాభా కలిగిన 262 గిరిజన తండాలు, 336 దళిత వాడలకు రోడ్ సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించింది.

Pages