S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/24/2017 - 11:45

మెదక్: జిల్లాలో ఏడుపాయల జాతర ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి తన్నీరు హరీష్ రావు వనదుర్గా మాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందేర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రాజమణి మురళి యాదవ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు పాల్గొన్నారు.

02/24/2017 - 11:24

భద్రాద్రి: పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన సంఘటన పినపాక మండలం చింతలబయ్యారంలో జరిగింది. మహా శివరాత్రి పర్వదినాన పుణ్యస్నానాలు చేయడానికి ముగ్గురు యువకులు గోపి (22), ప్రేమ్‌కుమార్‌ (23), నాగేంద్ర (22)లు గోదావరిలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యారు. దీంతో చింతలబయ్యారంలో విషాదం అలుముకుంది

02/24/2017 - 05:11

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్టు కమిషన్ చైర్మన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. పరీక్ష నిర్వహణకు తెలంగాణలో హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్‌లో 86 పరీక్ష కేంద్రాలతో పాటు ఆంధ్రాలోని 13 జిల్లాల్లో 1462 కేంద్రాలుంటాయని అన్నారు.

02/24/2017 - 05:10

హైదరాబాద్, ఫిబ్రవరి 23: నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలను తక్షణం అభివృద్ధి చేయాలని ఆ నియోజకవర్గ ఎంపి కవిత , ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి విజ్ఞప్తి చేశారు. దానిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

02/24/2017 - 05:09

హైదరాబాద్, ఫిబ్రవరి 23:ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మేరకు తెలంగాణకు ప్రత్యేకంగా ఏర్పాటైన వక్ఫ్‌బోర్డుకు పాలక వర్గం సభ్యుల ఎన్నిక, నామినేటెడ్ సభ్యుల నియామకంపై గురువారం మైనార్టీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికైన ఆరుగురు సభ్యులతోపాటు ప్రభుత్వం నామినేటెడ్ చేసిన ఐదుగురు సభ్యులతో కలిసి మొత్తం 11 మందితో కూడిన పాలకవర్గాన్ని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రకటించింది.

02/24/2017 - 05:09

హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 12 మంది పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత 12 మంది రంగంలో నిలిచారు. కొంగర శ్రీనివాస్ ఆల్ ఇండియా బిసి ఓబిసి పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయగా, మిగిలిన 11 మంది ఇండిపెండెంట్లుగానే రంగంలో నిలిచారు. టిఆర్‌ఎస్ మద్దతుతో కటేపల్లి జనార్దన్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.

02/24/2017 - 05:08

హైదరాబాద్, ఫిబ్రవరి 23: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్ పెంపుదల ప్రతిపాదనలకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన డెడ్‌లైన్ గురువారం ముగిసింది. 23వ తేదీ లోపల ప్రతిపాదనలు ఇవ్వనిపక్షంలో ప్రతిపాదనలు ఇచ్చినట్లుగా భావించి, వార్షిక రెవెన్యూ నివేదికను పరిగణనలోకి తీసుకుని టారిఫ్‌ను ఖరారు చేస్తామని ఇప్పటికే టిఎస్‌ఇఆర్‌సి ప్రకటించింది.

02/24/2017 - 05:08

హైదరాబాద్, ఫిబ్రవరి 23: విద్యాశాఖ అదనపు జాయింట్ డైరెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అడిషనల్ జాయింట్ డైరెక్టర్ గోపాల్‌రెడ్డిపై అదే శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడని ఆరోపించారు.

02/24/2017 - 05:07

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ప్రముఖ సాహితీవేత్త, అనువాదకుడు ఎజి యతిరాజులు (81) చిత్తూరు జిల్లా గ్రీమ్స్‌పేటలో కన్నుమూశారు. యతిరాజులు మృతిపట్ల సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షుడు తెలకపల్లి రవి, అధ్యక్షుడు వొర ప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. తమిళనాడు గుడియాత్తంలో చేనేత కుటుంబంలో 1935 ఆగస్టు 4న యతిరాజులు జన్మించారు.

02/24/2017 - 04:55

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ, విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టిటిడిపి నేతలు గవర్నర్ నర్సింహన్‌కు ఫిర్యాదు చేశారు. నిరుపేదలకు వైద్యం అందించడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలమవుతోందని వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

Pages