S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/24/2017 - 04:53

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి జలాల మళ్లింపుపై తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఎకె బజాజ్ కమిటీ వచ్చే నెలలో మళ్లీ రెండు రాష్ట్రాల్లో పర్యటించనుంది. ఈ నెల రెండవ వారంలో బజాజ్ కమిటీ రెండు రాష్ట్రాల్లో పర్యటించి కృష్ణా జలాల వినియోగంపై అధ్యయనం చేసిన విషయం విదితమే.

02/24/2017 - 04:53

హైదరాబాద్, ఫిబ్రవరి 23: గౌతమ బుద్ధుడు చూపిన శాంతి మార్గంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించి, తెలంగాణను కలను సాకారం చేశారని శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు. రెండు రోజులపాటు జరిగే అంతర్జాతీయ బౌద్ధ ఉత్సవాలను హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో స్పీకర్ గురువారం ప్రారంభించారు.

02/24/2017 - 04:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల సొమ్ముతో మొక్కులు తీర్చుకోవడం ఏమిటని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి మధుయాష్కి గౌడ్ ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ, దేవుడి మొక్కులు తీర్చుకోవాలంటే సొంత సొమ్ముతో చెల్లించుకోవాలి తప్ప ప్రజల డబ్బుతో కాదని ధ్వజమెత్తారు.

02/24/2017 - 04:51

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: మహారాష్టల్రోని మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుపొందటంపట్ల కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. గురువారం దత్తాత్రేయ విలేఖరులతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ పారదర్శక పాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యనించారు. ఈ ఫలితాలను చూసైనా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ గుణపాఠం నేర్చుకోవాలని దత్తాత్రేయ హితవు పలికారు.

02/24/2017 - 04:51

హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరాపార్కు సమీపంలో ఉన్న ధర్నా చౌక్‌ను మార్చాలని పోలీస్ శాఖ యోచిస్తోంది.

02/24/2017 - 04:48

హైదరాబాద్, ఫిబ్రవరి 23: అరుదైన ‘అలగిల్లే సిండ్రోమ్’ అనే జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హైదరాబాద్ నగరానికి చెందిన ఐదేళ్ల చిన్నారి పార్వతి రోహ్రోకి అపోలో వైద్య నిపుణుల బృందం ఒకేసారి కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. వైద్య చరిత్రలోనే ఈ సర్జరీ అరుదైనదిగా వైద్యనిపుణులు చెబుతున్నారు.

02/24/2017 - 04:48

హైదరాబాద్, ఫిబ్రవరి 23:రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్‌పల్లి-అత్తాపూర్ ఘటనలో మృతుల కుటుంబాల ఆచూకీ తెలియక పోలీసులు సతమతమవుతున్నారు. బుధవారం కూలర్ గోదాంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించి ఆరుగురు కార్మికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే.

02/24/2017 - 04:47

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఎండాకాలంలో వడగాడ్పుల వల్ల నష్టం జరగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, భారత వాతావరణ శాఖ, స్వచ్ఛంద సేవాసంస్థల సహకారం తీసుకోవాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎనిడిఎంఎ) నిర్ణయించింది. ఎన్‌డిఎంఎ నేతృత్వంలో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి)లో నిర్వహించిన రెండురోజుల వర్క్‌షాప్ గురువారం ముగిసింది.

02/24/2017 - 04:37

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ రాష్ట్రంలోని శివాలయాలన్నీ ‘శివరాత్రి’కి ముస్తాబయ్యాయి. వేములవాడ శ్రీరాజరాజేశ్వరి ఆలయం, కాళేశ్వరంలోని ముక్తేశ్వర-కాళేశ్వర ఆలయం, వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం, వరంగల్ నడిబొడ్డున ఉన్న వేయికాళ్ల దేవాలయం, నాగర్‌కర్నూలు జిల్లాలోని ఉమామహేశ్వరస్వామి ఆలయం తదితర దేవాలయాలకు ఇప్పటికే రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు.

02/24/2017 - 04:36

హైదరాబాద్, ఫిబ్రవరి 23: టిజెఎసి చైర్మన్ కోదండరామ్ తన రాజకీయ స్వార్థంకోసం విద్యార్థులను బలిపశువులుగా మార్చే కుట్రలు చేస్తున్నారని టిఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, శంభీపూర్ రాజు, టిఆర్‌ఎస్ నేత రాకేశ్‌లతో కలిసి మాట్లాడారు. తెలంగాణకు నష్టం చేయాలన్నదే కోదండరామ్ బ్యాచ్ అజెండా అని విమర్శించారు.

Pages