S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/11/2017 - 02:45

హైదరాబాద్, ఫిబ్రవరి 10: దివ్యాంగుల ఉపాధి కల్పన, శిక్షణ కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలను రూపొందించనున్నట్టు ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పని చేస్తూ, ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని అన్నారు.

02/11/2017 - 02:44

హైదరాబాద్, ఫిబ్రవరి 10: బాబానని, స్వామీజీనంటూ అమాయకులను బుట్టలో వేసుకుని మోసాలు చేసే ఓ బురిడీ బాబాను పంజాగుట్ట పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. భక్తి ముసుగులో ఆంధ్రా, తెలంగాణల్లో యధేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్న తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటకు చెందిన నేదూరి శ్రీను అలియాస్ సిద్ధిరెడ్డి సత్యనారాయణ (39)ని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ నగర పశ్చిమ మండలం డిసిపి తెలిపారు.

02/11/2017 - 02:43

హైదరాబాద్, ఫిబ్రవరి 10: పర్యావరణ, అటవీశాఖల అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించడంపై వారం రోజులలో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (సౌత్ జోన్) శుక్రవారం ఆదేశించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం వల్ల శ్రీశైలం-నాగార్జునసాగర్ టైగర్ ప్రాజెక్టులో వన్యప్రాణులకు విఘాతం కలుగుతుందని బీరం హర్షవర్ధన్‌రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్‌న ఆశ్రయించారు.

02/10/2017 - 05:15

హైదరాబాద్, ఫిబ్రవరి 9: రబీ సీజన్‌లో వ్యవసాయానికి అవసరమైన మేరకు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రబీ సీజన్‌లో 10 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని ఆ మేరకు సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ సీజన్‌లో విద్యుత్ సరఫరాపై గురువారం జెన్‌కో, ట్రాన్స్‌కో సిఎండి డి ప్రభాకర్‌రావుతో ముఖ్యమంత్రి సమీక్షించారు.

02/10/2017 - 05:12

హైదరాబాద్, ఫిబ్రవరి 9: చట్టంలో కారుణ్య కారణాలపై వారసత్వ ఉద్యోగ నియామక విధానం ఎక్కడాలేదని హైకోర్టు స్పష్టం చేసింది. సింగరేణి కాలరీస్ సంస్థలో 30 వేల ఉద్యోగాలను వారసత్వ కారుణ్య నియామకాలతో భర్తీ చేస్తామని సింగరేణి జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ గోదావరిఖనికి చెందిన కె సతీశ్‌కుమార్ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

02/10/2017 - 05:12

హైదరాబాద్, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో జూ పార్కుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జూ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జపాట్) చైర్మన్, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. గురువారం అరణ్య భవన్‌లో జరిగిన జపాట్ సమావేశంలో మంత్రి జోగు రామన్న పలు నిర్ణయాలు తీసుకున్నారు. జంతు ప్రదర్శన శాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు.

02/10/2017 - 05:10

హైదరాబాద్, ఫిబ్రవరి 9: వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాలం చెల్లిన, కలుషితమైన సెలైన్ బాటిల్ ఎక్కించడం వల్లే ఇటీవల గాంధీ ఆసుపత్రిలో ఒక పాప మరణించిందని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం వెనకేసుకురావడంలో ఆంతర్యం ఏమిటని ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

02/10/2017 - 05:09

హైదరాబాద్, ఫిబ్రవరి 9: జీవ వైవిధ్యం సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, మరీ ముఖ్యంగా రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

02/10/2017 - 05:08

హైదరాబాద్, ఫిబ్రవరి 9: రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల్లో ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడ్డ వెంటనే భారీ సంక్షోభం ఏర్పడింది.

02/10/2017 - 02:04

హైదరాబాద్, ఫిబ్రవరి 9:వీసాలపై అమెరికా ఆంక్షలు విధిస్తే భారతీయ ఐటి పరిశ్రమకు నష్టం అని ఈ అంశంపై ఒక బృందం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని త్వరలోనే కలువనున్నట్టు ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ ఐటి రంగంపై పడే ప్రభావంతో అమెరికా వెళ్లిన వారి తల్లిదండ్రులు ఆందోళన చేందుతున్నారని దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి వివరించనున్నట్టు చెప్పారు.

Pages