S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/02/2017 - 04:00

హైదరాబాద్, జనవరి 1:తెలంగాణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని 650 దేవాలయాల్లో పని చేస్తున్న సుమారు 5800 మంది అర్చక, ఇతర సిబ్బంది వేతనాల చెల్లింపులపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం సమీక్ష జరిపారు. వీరి వేతనాల విషయంలో ఒక సమగ్రత తెచ్చి అర్చకులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

01/02/2017 - 03:49

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ ప్రభుత్వం 31నెలల పాలనా కాలంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని, విద్యుత్ సంక్షోభం నుంచి వెలుగుల వైపు పయనం సాగించిందని గవర్నర్ నరసింహాన్ తెలంగాణ ప్రభుత్వ పనితీరును, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో అభివృద్ధి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంలో సాధించిన పురోగతి ఆశ్చర్యం కలిగిస్తోందని, ఇది గొప్ప పురోగతి అని అన్నారు.

01/02/2017 - 03:46

హైదరాబాద్, జనవరి 1: అవిభక్తకవలలు వీణా వాణీలను నీలోఫర్ ఆసుపత్రి నుంచి స్టేట్ హోమ్‌కు తరలించారు. గత కొనే్నళ్లుగా వీణా వాణీలు చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే వీణావాణిలను స్టేట్‌హోంకు తరలించడం చర్చనీయాంశంగా మారింది.

01/02/2017 - 02:40

హైదరాబాద్, జనవరి 1: నగరానికే తలమానికమైన ‘నుమాయిష్’కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన 77వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్‌ను కెటిఆర్ తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తోకలిసి ప్రారంభించారు.

01/02/2017 - 02:37

హైదరాబాద్, జనవరి 1: స్పిన్నింగ్, రైస్‌మిల్లు పరిశ్రమలతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. ఈమేరకు తమ్మినేని ఆదివారం కెసిఆర్‌కు లేఖ రాశారు. తాను చేపట్టిన మహాజన పాదయాత్ర 2వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుందన్నారు. ‘‘మీరు అధికారం చేపట్టిన తర్వాత మరో క్యాలెండర్ మారినా, ప్రజల స్థితిగతులు మారలేదు.

01/02/2017 - 02:37

హైదరాబాద్, జనవరి 1: పెద్దనోట్ల రద్దుతో ఎన్ని లక్షల కోట్ల రూపాయల నల్లధనం పట్టుకున్నారో వివరాలు వెల్లడించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఏపి రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 3 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

01/02/2017 - 02:36

హైదరాబాద్, జనవరి 1: ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై దాడి కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న నిందితుల బ్యారక్‌ను మార్చారు. మే, 2011లో పాతబస్తీలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితులకు జైలు అధికారులు రాచమర్యాదలు కల్పిస్తున్నారన్న విషయంపై జైళ్లశాఖ డిజి, సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

01/02/2017 - 02:34

హైదరాబాద్, జనవరి 1: సికిందరాబాద్‌లోని గోకుల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నిధుల మిస్సింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. బ్యాంకులో దాదాపు రూ. 3.5 కోట్లకుపైగా నిధులు దుర్వినియోగమయ్యాయని అభియోగంపై బ్యాంక్ చైర్మన్ చీమల జగదీష్ యాదవ్‌ను శనివారం సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

01/02/2017 - 02:33

హైదరాబాద్, జనవరి 1: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు పలువురు మంత్రులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి భవన్ సందడిగా మారింది. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్.

01/02/2017 - 02:31

హైదరాబాద్, జనవరి 1: ప్రధాని నరేంద్ర మోదీని మరో మహాత్మా గాంధీలా దేశ ప్రజలు చూస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. పేదల ఇళ్ళల్లో ప్రధాని వెలుగులు నింపుతున్నారని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. 1917 సంవత్సరంలో మహాత్మా గాంధీ నాటి తెల్ల దొరలకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేపట్టారని, చాలా సాదాసీదాగా గోచి మాత్రమే ధరించారని డాక్టర్ లక్ష్మణ్ గుర్తు చేశారు.

Pages