S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/01/2017 - 07:25

హైదరాబాద్, డిసెంబర్ 31: తెలంగాణలో 2016 ఆగస్టు 1 నుండి డిసెంబర్ 30 వరకు 94 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని ప్రభుత్వం ప్రకటించింది. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చిన 2,610 మంది నుండి శాంపిళ్లు సేకరించామని, వీటిని పరీక్షించగా, కేవలం 94 మందికి మాత్రమే స్వైన్‌ఫ్లూ వ్యధి సోకినట్లు వెల్లడైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

01/01/2017 - 05:15

గడచిన ఏడాదిలోనే ప్రగతి పునాదులు
కొత్త ఏడాదిలోనూ అదే ఒరవడి చూపుతాం
ముఖ్యమంత్రి కెసిఆర్ భరోసా
రాష్ట్భ్రావృద్ధిపై అమాత్యుల్లోనూ ధీమా

తెలంగాణ సరైన దిశలోనే ప్రగతి పరుగు తీస్తోంది. 2016లో తెలంగాణ అభివృద్ధికి బలమైన పునాదులు పడ్డాయి. 2017లో అదే ఒరవడిని కొనసాగించి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం.

01/01/2017 - 05:11

హైదరాబాద్, డిసెంబర్ 31: వచ్చే ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించేందుకు జనవరి 18వరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి గడువు ఇచ్చినట్లు తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు. టారిఫ్ ప్రతిపాదనలపై ప్రభుత్వంతో కూడా చర్చించాల్సి ఉందని, తాము మరింత గడువు కావాలని కోరిన వెంటనే నియంత్రణ మండలి ఆమోదించిందన్నారు.

12/31/2016 - 04:02

హైదరాబాద్, డిసెంబర్ 30: చట్టసభల సీట్లలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, బిసిలకు న్యాయం చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో బిసి ప్రతినిధుల బృందం శుక్రవారం ఇక్కడ బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో ప్రణబ్ ముఖర్జీని కలిసి వినతిపత్రం సమర్పించారు.

12/31/2016 - 04:00

హైదరాబాద్, డిసెంబర్ 30: రాష్ట్రంలో వంద రిటైల్ చేపల మార్కెట్లు ప్రారంభించనున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం శాసన సభలో రాష్ట్రంలో మత్స్య పరిశ్రమాభివృద్ధిపై లఘు చర్చ జరిగింది. మంత్రి తలసాని రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.

12/31/2016 - 03:59

హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించుకున్న భూసేకరణ బిల్లును తిరస్కరించాలని, ఇందులో రైతులు, రైతుకూలీలు, భూయజమానులకు కల్పించిన రాజ్యాంగ పరమైన రక్షణలు హరించివేశారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్టప్రతిని కోరింది.

12/31/2016 - 03:58

హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ చేపలంటే దేశం మొత్తంలో మంచి గిరాకీ ఉందని, ఈ మత్స్యపరిశ్రమపై ఆధారపడి లక్షల కుటుంబాలు జీవిస్తున్నందున, దీన్ని మరింత అభివృద్ధి చేసుకోవల్సిన అవసరముందని అధికార, విపక్షాలకు చెందిన సభ్యులు శుక్రవారం శాసన మండలిలో ప్రభుత్వానికి సూచించారు. మధ్యాహ్నం ‘మత్స్య పరిశ్రమ’పై లఘు చర్చ జరిగింది.

12/31/2016 - 03:57

హైదరాబాద్, డిసెంబర్ 30: గ్రామీణాభివృద్ధి శాఖలో సెర్ప్ విభాగం, జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులకు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్టమ్రేనని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.

12/31/2016 - 03:56

హైదరాబాద్, డిసెంబర్ 30: గురువారం శాసనసభ సమావేశాలను బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి సభకు హాజరయ్యారు. బుధవారం శాసనసభలో భూసేకరణ బిల్లు ఆమోదం తరువాత స్పీకర్ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. ముఖ్యమంత్రి సమాధానం తరువాత బిల్లుపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి నిరసనగా గురువారం ఒక్క రోజు సభను బహిష్కరించాలని నిర్ణయించారు.

12/31/2016 - 03:37

వెల్దండ, డిసెంబర్ 30: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు తక్షణమే పనులను ప్రారంభించాలని, లేనిపక్షంలో జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావును కల్వకుర్తి ప్రాంతంలో కాలుపెట్టనివ్వమని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి హెచ్చరించారు.

Pages