S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/03/2017 - 02:45

హైదరాబాద్, జనవరి 2: ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు దాతలు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. జిల్లెలగూడ జడ్‌పిహెచ్‌ఎస్‌లో కంప్యూటర్ ల్యాబ్‌ను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు.

01/03/2017 - 02:44

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మేరకు మన టీవీలో (సాఫ్ట్‌నెట్)లో ఐఐటి మెయిన్స్, ఎంసెట్, నీట్ శిక్షణ తరగతుల ప్రసార కార్యక్రమాలు సోమవారం నాడు ప్రారంభం అయ్యాయి. అధ్యాపకుడు జె చంద్రశేఖర్ మాథ్స్-1 సబ్జెక్టులోని ఫంక్షన్స్ టాపిక్‌ను బోధించగా ముందే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఉదయం ఆరు గంటలకు ప్రసారాలు ప్రారంభించారు.

01/03/2017 - 02:44

హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్ కేంద్రంగా గంజాయి దందా సాగుతోంది. ఓ అపార్ట్‌మెంట్‌లో గంజాయి సాగు జరుగుతోంది. సౌత్‌జోన్ టాస్క్ఫోర్స్ బృందం, గోల్కొండ పోలీసుల సహకారంతో సోమవారం దాడులు నిర్వహించి సయ్యద్ షాహెద్ హుస్సేన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుంచి 8.6 కేజీల గంజాయితోపాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ డిసిపి కోటిరెడ్డి తెలిపారు.

01/03/2017 - 02:43

హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్‌లోని ప్రముఖ నగల వ్యాపార సంస్థ ముసద్దీలాల్ యజమాని కైలాష్‌చంద్ గుప్తా, నరేందర్‌కుమార్‌లకు విధించిన ఐదు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో సోమవారం సిసిఎస్ పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. కాగా మరో ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరనున్నారు.

01/03/2017 - 02:42

మహబూబ్‌నగర్, జనవరి 2: నోట్ల రద్దు ఘోరమైన తప్పిదమని, యాభై రోజుల్లో అన్ని కరెన్సీ కష్టాలు తీరుతాయని చెప్పిన ప్రధాని ప్రస్తుతం ఇంకా ప్రజల కష్టాలు కొనసాగుతుండడంతో దేశ ప్రజల ముందు సాగిలపడి బిజెపి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో ఆయన భేటీ అయ్యారు.

01/03/2017 - 02:39

నల్లగొండ, జనవరి 2: నల్లగొండ జిల్లా నల్లమల రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని దేవరకొండ, చందంపేట, పిఏపల్లి మండలాల్లో మరోసారి యురేనియం నిక్షేపాల తవ్వకాల ప్రయత్నాలు సాగడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.

01/03/2017 - 02:14

హైదరాబాద్, జనవరి 2: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ సిఐ రమేష్, ఎస్‌ఐ రాములును కమిషనర్ సందీప్ శాండిల్య సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మియాపూర్ ఏవి కాలనీలో నివాసముంటున్న వెంకటరమణ వృద్ధ దంపతుల స్థలంపై రాజు అనే రియల్టర్ కన్నుపడింది. ఎలాగైనా ఈ స్థలాన్ని దక్కించుకోవాలని రాజు అనే రియల్టర్ కొంతకాలంగా వెంకటరమణ దంపతులను వేధించసాగాడు.

01/03/2017 - 02:13

హైదరాబాద్, జనవరి 2: గ్యాంగ్‌స్టర్ అయూబ్ ఖాన్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సౌత్‌జోన్ డిసిపి నేతృత్వంలోని ప్రత్యేక బృందం అయూబ్ ఖాన్ నేరచరిత్ర, కుల పర్యవేక్షణ, పాత కేసులు, చార్జీషీట్ దాఖలు వంటి అంశాలపై ప్రత్యేక బృందం దర్యాప్తు జరిపేందుకు పోలీస్ శాఖ అనుమతించింది. ఈ బృందం అయూబ్ ఖాన్ అనుచరుల కోసం గాలిస్తూ, అతనిపై గల కేసుల వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్టు తెలిసింది.

01/03/2017 - 02:12

నాగార్జునసాగర్, జనవరి 2: నాగార్జునసాగర్ దయ్యాలగండి వద్ద అదుపు తప్పి రోడ్డుపై అడ్డంగా బోల్తా పడిన గడ్డి ట్రాక్టర్‌ను పక్కకు జరిపించే పనిలో ఉన్న సాగర్ పోలీసులపై, చూసేందుకు వచ్చిన పౌరులపై బ్రేక్‌లు ఫెయిలైన లారీ దూసుకుపోవడంతో నలుగురి మృతి చెందారు. ఈ సంఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే..

01/03/2017 - 02:11

హైదరాబాద్, జనవరి 2: గత నవంబర్‌లోనే సిద్ధమైన టిఆర్‌ఎస్ పార్టీ కమిటీలు, నామినేటెడ్ పదవులకు ఇంకా మోక్షం లభించలేదు. 2015 ప్లీనరీలోనే నామినేటెడ్ పదవుల పంపకం చేస్తామని సిఎం ప్రకటించినా అమలుకు నోచుకోలేదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే పేరుతో జిల్లా కమిటీల ఏర్పాటును వాయిదా వేశారు.

Pages