S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/29/2016 - 11:48

హైదరాబాద్ : ఎంసెట్‌-2 లీకేజి కేసులో నిందితులు విష్ణు, తిరుమల్‌ను వైద్య పరీక్షల అనంతరం ఉదయం చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత రాత్రి విష్ణు, తిరుమల్‌ను సీఐడీ పోలీసుల అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మరోవైపు ప్రధాన నిందితుడు రాజగోపాల్‌ను సీఐడీ విచారిస్తున్నారు.

07/29/2016 - 06:44

హైదరాబాద్, జూలై 28: రెండేళ్ల నుంచి విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పైచేయి సాధిస్తూ వచ్చిన తెరాస ప్రభుత్వం- ఎంసెట్ లీకేజీ, 8మంది వీసీల రద్దు తీర్పుతో ఇరుకునపడింది. ఎంసెట్ స్కాంతో ఓ పక్క గందరగోళం కొనసాగుతుండగానే మరోపక్క రెండురోజుల క్రితం నియమించిన 8మంది వీసీల నియామకాలు చెల్లవని హైకోర్టు తీర్పు ఇవ్వడం విపక్షాలకు కొత్త అస్త్రం అందించినట్లయిందని తెరాస నేతల్లో ఆందోళన మొదలైంది.

07/29/2016 - 06:43

హైదరాబాద్, జూలై 28: మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా ఉద్యమించిన రైతులపై పోలీసులు దుందుడుకు వైఖరి, సాచివేత చర్యలపై విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిజిపి అనురాగ్ శర్మకు వినతిపత్రం సమర్పించారు.

07/29/2016 - 06:42

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ ప్రభుత్వ ఉపాధి శాఖ, భారత పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూకట్‌పల్లి జెఎన్‌టియు ప్రాంగణంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.

07/29/2016 - 06:41

హైదరాబాద్, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్శిటీలకు విసిలనునియమిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేయడం కెసిఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. జీవోల ద్వారా విసిలను నియమించడం సరికాదన్నారు. వివిధ సందర్భాల్లో హైకోర్టు రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టిందని, దీని నుంచి కెసిఆర్ సర్కార్ సరైన గుణపాఠం నేర్చుకోవాలన్నారు.

07/29/2016 - 06:41

హైదరాబాద్, జూలై 28: న్యాయాధికారుల కేటాయింపు సందర్భంగా జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న 11 మంది తెలంగాణ న్యాయాధికారులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. సస్పెండైన వారిలో న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు కె రవీందర్ రెడ్డి, కార్యదర్శి వి వరప్రసాద్ తదితరులు ఉన్నారు.

07/29/2016 - 06:40

హైదరాబాద్, జూలై 28: ఎమ్సెట్-2 లీకేజికి బాధ్యత వహించి మంత్రులు కడియం శ్రీహరి, డాక్టర్ లక్ష్మారెడ్డిలను మంత్రి పదవుల నుంచి తొలగించాలని, లేదా వారు రాజీనామా చేయాలని గురువారం టిపిసిసి డిమాండ్ చేసింది. టిపిసిసి వర్కింగ్ అధ్యక్షుడు భట్టివిక్రమార్క విలేఖర్లతో మాట్లాడుతూ ఈకేసులో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్సెట్-2 లీకేజి వెనక టిఆర్‌ఎస్ నేతల హస్తం ఉందన్నారు.

07/29/2016 - 06:40

హైదరాబాద్, జూలై 28: అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 7వ తేదీన మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 3 గంటలకు మెదక్ జిల్లా గజ్వేల్‌కు చేరుకుంటారు.

07/29/2016 - 06:39

హైదరాబాద్, జూలై 28: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఎమ్సెట్ పరీక్ష మొదటి నుంచి వివాదాస్పదంగానే తయారైంది. ఎమ్సెట్ నిర్వహణలో చోటు చేసుకుంటున్న లోపాలను నిరోధించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.

07/29/2016 - 06:38

హైదరాబాద్, జూలై 28: అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను ఎండబెట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తెలంగాణలో మంటపెడుతున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ శాసన సభాపక్షం కార్యాలయంలోగురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులది జోకర్ ముఠా అని మండిపడ్డారు.

Pages