S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/28/2016 - 05:41

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ ఎమ్సెట్-1 కూడా లీకైందా? ఎమ్సెట్-2లో నిందితుడిగా అనుమానించి అదుపులోకి తీసుకున్న రాజ్‌గోపాల్ రెడ్డిని సిఐడి పోలీసులు విచారించినప్పుడు ఈ విషయం బహిర్గతమైనట్లు తెలిసింది. ఇదే నిజమైతే సిఐడి దర్యాప్తు మరికొన్నిరోజులు సాగే అవకాశం ఉంది. సిఐడి పోలీసులు ఈ విషయమై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.

07/28/2016 - 03:43

హైదరాబాద్, జూలై 27: విదేశాలకు వెళ్లే వారి సమస్యల పరిష్కారానికి ‘ప్రవాసీ తెలంగాణ దివాస్’ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కె తారకరామారావు తెలిపారు. కేరళ, పంజాబ్ కంటే మెరుగైన ఏన్నారై పాలసీని తీసుకోస్తామన్నారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో బుధవారం ఎన్నారైలతో మంత్రి సమావేశమయ్యారు.

07/28/2016 - 03:41

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) గతంలో జారీ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను తాజాగా మళ్లీ జారీ చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో 434 పోస్టుల భర్తీ చేయనున్నట్టు టిఎస్‌పిఎస్‌సి పేర్కొంది. అయితే గ్రూప్-2 కేడర్‌కు మరో 593 పోస్టుల మంజురుకు ప్రభుత్వం ఆమోదించింది.

07/27/2016 - 18:14

హైదరాబాద్: ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డికి బుధవారం విజ్ఞప్తిచేశారు. పేపర్ లీక్ చేసినవారిని, దానిని కొన్న విద్యార్థులను కఠినంగా శిక్షించాలే తప్ప పరీక్షను రద్దు చేయాలనుకోవడం తగదని వారు తెలిపారు.

07/27/2016 - 18:13

హైదరాబాద్: ఎంబిబిఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి ఇటీవల జరిగిన తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ అయినట్టు సిఐడి పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆరు బృందాలుగా ఏర్పడిన సిఐడి పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఇందుకు సంబంధించి బ్రోకర్లను, విద్యార్థులను, కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలను క్షుణ్ణంగా విచారించారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు కీలక నిందితుల కోసం గాలిస్తున్నారు.

07/27/2016 - 17:54

హైదరాబాద్‌ : గ్రూప్‌ -2లో అన్ని పోస్టులకు టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసే యోచనలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ఉంది. మొత్తం 1027 పోస్టులకు ఒకే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.

07/27/2016 - 17:38

మెదక్‌: మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చేందుకు పల్లెపహాడ్‌ గ్రామస్థులు ముందుకొచ్చారు. గజ్వేల్‌లో పల్లెపహాడ్‌ రైతులు, గ్రామస్థులతో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ చర్చలు బుధవారం జరిపారు. మంత్రి హామీతో ప్రాజెక్టుకు భూములిచ్చేందుకు పల్లెపహాడ్‌ రైతులు అంగీకారం తెలిపారు.

07/27/2016 - 15:09

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారంలో 16 మంది బ్రోకర్లకు ప్రమేయం ఉన్నట్టు కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే చాలామంది బ్రోకర్లను ప్రశ్నించారు. పేపర్ లీకేజీ వెనుక ప్రధాన సూత్రధారులెవరున్నారన్న అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రింటింగ్ ప్రెస్‌లోనే పేపర్ లీక్ అయిందన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

07/27/2016 - 15:07

నల్గొండ: ప్రైవేటు విద్యాసంస్థల్లో అరాచకాలను అరికట్టాలని ఎబివిపి ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై ఓ ప్రైవేటు కాలేజీ చైర్మన్ చేయి చేసుకోవడంతో హుజూర్‌నగర్‌లో బుధవారం ఉద్రిక్తత ఏర్పడింది. తమపై దాడి చేసిన కాలేజీ చైర్మన్‌పై చర్య తీసుకోవాలని విద్యార్థులు ధర్నా ప్రారంభించగా వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు.

07/27/2016 - 12:22

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన చార్మినార్ మాజీ కార్పొరేటర్ అహ్మద్ గౌస్‌ను ప్రత్యేక పోలీసు బృందం బుధవారం అరెస్టు చేసింది. పెండింగ్ వారంట్లకు సంబంధించి ఆయనను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Pages