S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/28/2016 - 18:06

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-2లో రెండు సెట్ల పేపర్లు లీకయ్యాయని సీఐడీ గురువారం ప్రకటన చేసింది. ‘ హైదరాబాద్‌, ఏపీ, బెంగళూరులో కొందరు బ్రోకర్లను గుర్తించాం. ఇప్పటివరకు విష్ణుధర్‌ అలియాస్‌ విష్ణువర్థన్‌, తిరుమల్‌ అలియాస్‌ తిరుమలరావును అరెస్టు చేశాం. వీరిద్దరూ 25 మంది విద్యార్థులను బెంగళూరుకు తీసుకెళ్లారు. పరీక్షకు 2, 3 రోజుల ముందు ప్రశ్నాపత్రాలు వారికి అందజేశారు.

07/28/2016 - 17:15

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో నలుగురు, కరీంనగర్‌ జిల్లాల్లో ఇద్దరు విద్యార్థులకు ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఎంసెట్‌ పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు రెండు రాష్ట్రాల్లో వచ్చిన ర్యాంకుల్లో భారీ తేడాలు ఉండటంతో సీఐడీ దర్యాప్తు విస్తృతం చేసింది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోనూ సీఐడీ విచారణ చేస్తోంది.

07/28/2016 - 16:42

వరంగల్ : రైలు కింద పడి తల్లీ కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కేసముద్రం మండలం ఇంటికన్నెలో గురువారం చోటుచేసుకుంది. ఈజరిగింది. కుటుంబ కలహాల నేపధ్యంలోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

07/28/2016 - 16:27

హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీక్‌కు సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జెఎన్‌టియు ఎదుట భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు గురువారం ధర్నా జరిపారు. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం అసరమర్ధత వల్ల అమాయక విద్యార్థులు ఇక్కట్ల పాలవుతున్నారని అన్నారు. జెఎన్‌టియు వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

07/28/2016 - 16:26

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీకి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య-ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డిలను పదవుల నుంచి వెంటనే తొలగించాలని ఓయు నిరుద్యోగ జెఎసి డిమాండ్ చేసింది. లీకేజికి కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ గురువారం నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యంలో ఓయులో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

07/28/2016 - 16:26

హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీలో తెలంగాణ ప్రభుత్వంలోని ఓ కీలకవ్యక్తి ప్రమేయం ఉందని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి గురువారం ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులే లీకేజీకి కారకులని, కొంతమంది దళారులను అరెస్టు చేసి జైలుకు పంపితే సరిపోదన్నారు. పేపర్ లీక్‌కు సంబంధించిన మూలాలు దిల్లీ, ముంబయిలో ఉన్నందున సిబిఐ చేత విచారణ జరిపించాలన్నారు.

07/28/2016 - 15:26

హైదరాబాద్‌: ఎంసెట్‌-2 పరీక్షపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు ప్రకటన చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశ్వవిద్యాలయాలపై రేపు సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఎంసెట్‌-2 పరీక్షపై ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించనుంది. పరీక్ష రద్దు నిర్ణయం జరిగిపోయిందని అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలుందని తెలుస్తోంది.

07/28/2016 - 15:12

హైదరాబాద్‌: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి, మరట్వాడ దానికి ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల రెండు రోజుల్లో తెలంగాణ, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.

07/28/2016 - 12:24

హైదరాబాద్: నగరంలోని కోఠి వద్ద ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలో గురువారం ఉదయం మంటలు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో సుమారు కోటి రూపాయల విలువ చేసే సీసీ కెమెరా కాలిపోయాయి.

07/28/2016 - 12:24

హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని గగన్‌పహాడ్ వద్ద ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన వ్యాన్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో స్కూల్‌వ్యాన్‌లో డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు.

Pages