S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/27/2016 - 12:21

హైదరాబాద్: ఓ వివాహిత మహిళ అనుమానాస్పదంగా మరణించగా, పోలీసుల తీరుపై ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలానగర్ రాజ్‌కాలనీలో హరిణి అనే గృహిణి మంగళవారం అర్ధరాత్రి మరణించింది. ఆమెను అత్తింటివారే చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని చూసేందుకు తమను అనుమతించక పోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయని మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

07/27/2016 - 08:16

హైదరాబాద్, జూలై 26: సికిందరాబాద్ ఆర్‌పి రోడ్‌లోని మోండా మార్కెట్‌లో మంగళవారం ఓ పురాతనం భవనం కుప్పకూలి ఓ షాపు యజమాని దుర్మరణం చెందాడు. శిథిలాల క్రింది చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడ్డ ఆయన్ని గాంధీకి తరలిస్తూండగా మృతి చెందాడు. భవనం కుప్పకూలిన విషయం తెలిసిన వెంటనే జిహెచ్‌ఎంసి, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన షాపు యజమానిని గోపాల్‌గా గుర్తించారు.
ఆలయాల్లో

07/27/2016 - 08:14

హైదరాబాద్, జూలై 26: తెలంగాణలో టూరిజం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు తెలంగాణ టూరిజం శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. టూరిజం ప్లాజాలో మంగళవారం టూరిజం అభివృద్ధిపై చందూలాల్ సమీక్ష జరిపారు.

07/27/2016 - 07:37

హైదరాబాద్, జూలై 26: అసలే అంతర్గత కలహాలతో అట్టుడుకున్న ప్రకాశం తెదేపాలో, కొత్తగా డిసిసిబి అవిశ్వాస వ్యవహారం పార్టీ యువనేత లోకేష్‌కు ఆగ్రహం తెప్పించింది. ఒకేపార్టీకి చెందిన ఇద్దరు ఒకొకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుని, అవిశ్వాసం వరకూ వెళ్లడంతో రంగంలోకి దిగిన లోకేష్ జిల్లా మంత్రి, జిల్లా అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరికీ రాజీ చేయాలని ఆదేశించారు.

07/27/2016 - 07:23

నల్లగొండ, జూలై 26: కృష్ణా పుష్కరాల కోసం నల్లగొండ జిల్లా పరిధిలోని 28 పుష్కర ఘాట్‌లకు కోటిన్నర మంది భక్తుల వస్తారని అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం వారికి అవసరమైన వౌలిక వసతుల కల్పనలో మాత్రం దారుణంగా వెనుకబడింది. తాగునీటి వసతి కోసం ఆర్‌డబ్ల్యుఎస్ శాఖకు 18.3 కోట్లు విడుదల చేశారు.

07/27/2016 - 07:01

హైదరాబాద్, జూలై 26: తన సొంత నియోజకవర్గంలోనే ప్రజలపై లాఠీచార్జి చేయించి దేశంలో ఏ సిఎం సాధించని విధంగా చరిత్రకెక్కారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పేర్కొన్నారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద రాష్టస్థ్రాయి మహాధర్నా నిర్వహించారు.

07/27/2016 - 07:00

హైదరాబాద్, జూలై 26: ప్రజలను ఒప్పించి భూసేకరణ జరుపుతాం, ఎవరు అడ్డుకున్నా ప్రాజెక్టులు కట్టి తీరుతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి విపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

07/27/2016 - 05:34

హైదరాబాద్, జులై 26: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జిని నిరసిస్తూ కదం తొక్కాలనుకున్న కాంగ్రెస్ వ్యూహాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మల్లన్న సాగర్‌కు చేరుకోవాలని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యూహం విఫలమైంది. పార్టీ నేతలు, శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

07/27/2016 - 05:29

హైదరాబాద్, జూలై 26: అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గడిచిన 24 గంటలుగా ఉత్తర తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ జిల్లా నర్మెట్టలో 12 సెమీ వర్షపాతం నమోదైంది.

07/27/2016 - 05:20

హైదరాబాద్, జూలై 26: విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్ జనాభాను దృష్టిలో పెట్టుకుని హెచ్‌ఎండిఏలో 12 లాజిస్టిక్ హబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌ఎండిఏ ప్రస్తుతం చేపట్టిన, భవిష్యత్ కార్యక్రమాలపై మున్సిపల్ మంత్రి కె తారక రామారావు బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో సమీక్షించారు. నగర విస్తరణకు అనుగుణంగా హెచ్‌ఎండిఏ పరిధి విస్తరించాలని సూచించారు.

Pages