S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/27/2016 - 05:46

హైదరాబాద్, జూలై 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. జూలై 9న నిర్వహించిన ఎంసెట్-2 పేపర్ లీకైందన్న అనుమానాల నేపథ్యంలో ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది. వరంగల్ కేంద్రంగా ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకైనట్టు విచారణ చేస్తున్న సిఐడి అధికారులు నిర్దారణకు వచ్చారని తెలిసింది.

07/26/2016 - 16:42

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ సొంత నియోజకవర్గంలో రైతులపై లాఠీచార్జి జరగడం దారుణమని సిపిఎం నేత బృందాకారత్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, వాటిలో అక్రమాలను తాము అడ్డుకుంటామని ఆమె అన్నారు. అసైన్డ్ భూములను సాగుచేస్తున్న రైతులకు కూడా న్యాయపరంగా నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

07/26/2016 - 16:40

హైదరాబాద్: నగరంలోని జెబిఎస్, ఎంజిబిఎస్ బస్ కాంప్లెక్సులలో కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరు ఇటీవల ఎంజిబిఎస్ బస్ స్టేషన్‌లో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఉత్తరాదికి చెందిన ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

07/26/2016 - 16:39

మెదక్: లాఠీచార్జిలో గాయపడిన మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను పరామర్శించేందుకు మెదక్ బయలుదేరిన కాంగ్రెస్ నేతలను మంగళవారం నాడ గజ్వేల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ ముందస్తు అరెస్టులు చేశామని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో కాంగ్రెస్ నేతలు డికె అరుణ, దామోదర రాజనరసింహ, అద్దంకి దయాకర్, శ్రవణ్ తదితరులున్నారు.

07/26/2016 - 15:48

హైదరాబాద్‌: నగరంలో పట్టుబడ్డ ఐసిస్‌ తీవ్రవాదులకు ఆగస్టు 24 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగిస్తూ నాంపల్లి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. జైల్లో ఉన్న ఏడుగురు నిందితులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయస్థానం విచారించింది.

07/26/2016 - 13:15

హైదరాబాద్ : రుతు పవనాల ప్రభావంతో గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిన తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

07/26/2016 - 12:47

హైదరాబాద్: నిర్వాసిత రైతులపై లాఠీచార్జికి నిరసనగా ‘చలో మల్లన్నసాగర్’ యాత్రకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో మంగళవారం ఉదయం నగరంలోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ నేతలను బయటికి వెళ్లనీయకుండా పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు.

07/26/2016 - 11:57

హైదరాబాద్‌: మంగళవారం ఉదయం నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌, మెహిదీపట్నం, లక్డీకాపూల్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, నాచారం, సికింద్రాబాద్‌, శంషాబాద్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట ప్రాంతాల్లో ఉదయం 6గంటల నుంచి కుండపోతగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరింది. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది.

07/26/2016 - 05:58

హైదరాబాద్, జూలై 25: తెలంగాణలో పోగొట్టుకున్న బలాన్ని తిరిగి సాధించే ప్రయత్నాల్లో తెలుగుదేశం మునిగింది. దానికోసం ప్రభుత్వంపై పోరాట కార్యక్రమాలకు పదును పెడుతోంది. ప్రతి శనివారం పార్టీ నేతలతో ప్రత్యేక భేటీ అవుతున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ప్రజాసమస్యలపై దృష్టి సారించే కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా వేసిన పది కమిటీలు పది ముఖ్యమైన సమస్యలను గుర్తించాయి.

07/26/2016 - 05:57

హైదరాబాద్, జూలై 25 : కొత్త విసిలు వీరే
పి.సాంబయ్య
తెలంగాణ యూనివర్శిటీ
వి. ప్రవీణ్‌కుమార్
జయశంకర్ అగ్రికల్చరల్

బి. రాజారత్నం
పాలమూరు యూనివర్శిటీ

ఎస్. రామచంద్ర
ఉస్మానియా యూనివర్శిటీ
సాయన్న
కాకతీయ యూనివర్శిటీ

సీతారామారావు
బి.ఆర్. అంబేద్కర్ వర్శిటీ

Pages