S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/22/2016 - 17:29

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను నియంత్రించేందుకు ప్రాంతీయ రవాణాశాఖ (ఆర్‌టిఎ) అధికారులు బుధవారం వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. భెల్ వద్ద ముంబయి హైవేపై 15 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, ఏడు లారీలపై కేసులు నమోదు చేశారు.

06/22/2016 - 17:28

హైదరాబాద్: ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను ప్రభుత్వం నియంత్రించనందుకు నిరసనగా తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని తెలంగాణ పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతను నివారించేందుకు కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

06/22/2016 - 16:11

ఆదిలాబాద్: తెలంగాణ ప్రజాకవి గూడ అంజయ్యకు ప్రజా గాయకుడు గద్దర్ ఘనంగా నివాళులర్పించారు. అనారోగ్యంతో కన్నుమూసిన అంజయ్యకు ఈరోజు ఆయన స్వస్థలమైన లింగాపూర్‌లో అంత్యక్రియలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా రాగన్నగూడెం నుంచి గూడ అంజయ్య భౌతికకాయాన్ని లింగాపూర్‌కు తీసుకువచ్చారు. అంత్యక్రియల్లో పలువురు కళాకారులు, గాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.

06/22/2016 - 16:10

హైదరాబాద్: తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నందున ఉభయ రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఏమీ మాట్లాడనని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి అన్నారు. రాజకీయాల్లో లేని తాను ఆ విషయాలను ప్రస్తావించడం సరికాదన్నారు. కొత్తగా కొన్న స్కోడా కారును రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఆయన బుధవారం ఖైరతాబాద్‌లోని ఆర్‌టిఎ కార్యాలయానికి వచ్చారు.

06/22/2016 - 13:20

హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ఆర్థిక, పరిపాలన, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కొత్త జిల్లాలపై కలెక్టర్లు ఇచ్చే నివేదికలను పరిశీలించాక ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది.

06/22/2016 - 13:19

మెదక్: మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల డిమాండ్లకు మద్దతుగా ఈ నెల 27 నుంచి 72 గంటల నిరాహార దీక్ష చేస్తామని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తెలిపారు. భూ నిర్వాసితులకు న్యాయమైన రీతిలో నష్టపరిహారం చెల్లించి అన్ని సౌకర్యాలను అందించాలన్నారు. కాగా, ప్రభుత్వ నిధులు కొల్లగొట్టేందుకే తెలంగాణ మంత్రులు ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో హడావుడి చేస్తున్నారని ఆరోపించారు.

06/22/2016 - 12:07

ఖమ్మం: ఇల్లెందులో హైదరాబాద్‌కు చెందిన శ్రీహరి అనే యువకుడు హత్యకు గురైన ఘటన బుధవారం వెలుగు చూసింది. కొంతమంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

06/22/2016 - 12:06

హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న లాయర్లు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కోర్టుల వద్ద ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఆందోళన చేస్తున్న పదిమంది లాయర్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల చర్యను లాయర్ల జెఎసీ నేతలు తప్పుబట్టారు.

06/22/2016 - 12:04

హైదరాబాద్‌: నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలు నిర్మిస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను పోత్సహిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఎల్బీస్టేడియంలో ఒలింపిక్‌ రన్‌-2016 కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

06/22/2016 - 11:25

హైదరాబాద్‌: పీఎస్‌ఎల్‌వీ సీ34 ప్రయోగం విజయవంతం చేసేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్‌ బుధవారం అభినందనలు తెలిపారు. ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం మరో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.

Pages