S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/24/2016 - 18:28

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవుకూరు దర్గా సమీపంలో గుర్తుతెలియని ఇద్దరు మహిళల మృతదేహాలను శుక్రవారం స్థానికులు గుర్తించారు. కొందరు పిల్లలు క్రికెట్ ఆడుతుండగా దూరంగా బంతి పడిన చోట మృతదేహాలను కనుగొన్నారు. ఎవరో ఆగంతకులు గొంతుకోసి వీరిని దారుణంగా హత్యచేశారు. వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

06/24/2016 - 17:44

ఖమ్మం: అందమైన హామీలతో అధికారంలోకి వచ్చిన తెరాస అధినేత కెసిఆర్ మాటలు ఇక చెల్లవని కాంగ్రెస్ ఎంపి రేణుకాచౌదరి శుక్రవారం ఇక్కడ అన్నారు. ప్రజలకు మేలైన పాలన అందించడానికి బదులు ఆయన మాటలతో ఎన్నాళ్లు నెట్టుకొస్తారని ఆమె ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో తెరాస సర్కారు చేసిందేమీ లేదని విమర్శించారు.

06/24/2016 - 17:42

హైదరాబాద్: నెలరోజుల క్రితం ఆస్ట్రేలియాలో ఎన్‌ఆర్‌ఐ రమ్యకృష్ణ అనుమానాస్పద మృతి ఘటనకు సంబంధించి కూకట్‌పల్లి పోలీసులు ఆమె అత్తమామలను అరెస్టు చేశారు. అదనపుకట్నం కోసం భర్త, అత్తమామలు పెడుతున్న వేధింపుల వల్లే తమ కుమార్తె మరణించిందని రమ్యకృష్ణ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరంగల్‌లో ఉంటున్న అత్తమామలు సుగుణ, సుబ్రమణ్యంలను అరెస్టు చేశారు.

06/24/2016 - 17:42

హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్తదంపతులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన ఘటన సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో శుక్రవారం జరిగింది. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న భవానీశంకర్, కీర్తిరెడ్డి తమ కుటుంబ పెద్దలను కాదని రెండురోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ వీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

06/24/2016 - 17:41

హైదరాబాద్: ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని కొడుకు పుట్టాక మరో మహిళను వివాహం చేసుకున్న కానిస్టేబుల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన ఆనంద్ గౌడ్ అనిత అనే యువతిని ప్రేమించి 2013లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కొడుకు పుట్టాడు.

06/24/2016 - 17:40

హైదరాబాద్: ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 20 మంది యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి వంచించిన ఓ కన్సల్టెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులిచ్చి చాలా రోజులైనా ఉద్యోగాల ఊసే లేకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు నిరుద్యోగులు ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కన్సల్టెంట్ భాస్కర్‌ను అరెస్టు చేసి పోలీసులు వివరాలు రాబడుతున్నారు.

06/24/2016 - 17:40

హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి పేద ప్రజలకు తెరాస ప్రభుత్వం అన్యాయం చేసిందని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, సంపన్నులకు, కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిఎం కేసీఆర్ విద్యుత్, ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజలపై 1,800 కోట్ల రూపాయల భారాన్ని మోపారన్నారు.

06/24/2016 - 16:18

నల్గొండ: అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా విపక్షాలు అడ్డుతగులుతున్నాయని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. ఆలేరులో జరిగిన తెరాస కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్, టిడిపి నేతలను ప్రజలే నిలదీయాలన్నారు.

06/24/2016 - 12:09

ఆదిలాబాద్: మండల కేంద్రమైన నేరేడుగొండలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అఖిల (17) తన గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండడాన్ని శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు కనుగొన్నారు. ఎప్పటిలాగే గురువారం రాత్రి ఆమె నిద్రపోయింది. శుక్రవారం ఉదయం ఎంతసేపటికీ ఆమె లేవకపోవడంతో ఈ విషయం బయటపడింది. వేరే కులానికి చెందిన యువకుడిని ఆమె ప్రేమిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

06/24/2016 - 12:08

ఖమ్మం: హైదరాబాద్ నుంచి మణుగూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు శుక్రవారం తెల్లవారు జామున కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద నాగార్జున సాగర్ ప్రధాన ఎడమకాల్వలో బోల్తా పడింది. మితిమీరిన వేగంతో వెళ్లడం వల్లే అదుపుతప్పి బస్సు కాల్వలో పడింది. ఈ ఘటనలో 14 నెలల శిశువు మరణించగా 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

Pages