S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/23/2016 - 06:37

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం నాడు విడుదల చేశారు. సమగ్ర వివరాలతో కూడిన సిడిని ఆయన ఆవిష్కరించారు.

04/23/2016 - 06:37

హైదరాబాద్, ఏప్రిల్ 22: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ కె. లక్ష్మణ్ శుక్రవారం పార్టీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య, కేంద్ర మంత్రులు, పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.

04/23/2016 - 06:36

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఖమ్మంలో ఈ నెల 27న నిర్వహించనున్న టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీకి ఎన్నికల కమిషన్ అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం ప్లీనరీని నిర్వహించుకోవచ్చని టిఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్ అధికారికంగా తెలియజేశారు.

04/23/2016 - 06:32

కొలనుపాకలో కానరాని అభివృద్ధి
నెలలు గడిచినా ప్రారంభంకాని పనులు

04/22/2016 - 18:07

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ రాజ్‌భవన్‌లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఇటీవల గవర్నర్ రెండు రోజుల దిల్లీ పర్యటన అనంతరం ఆయనను సిఎం కలవడం చర్చనీయాంశమైంది. విభజన సమస్యలు, ఉద్యోగుల విభజన, కరవు, నీటి సమస్య వంటి పలు విషయాలపై వీరు చర్చించినట్లు సమాచారం.

04/22/2016 - 18:03

హైదరాబాద్: పాలేరు ఉపఎన్నికలో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క ఈరోజు వైకాపా అధినేత జగన్ కలిశారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయనకు జగన్ చెప్పినట్లు సమాచారం.

04/22/2016 - 16:36

హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు సేవలందించిన తమకు తెలంగాణ ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు బకాయి పడిందని, తక్షణం 50 కోట్లయిని చెల్లించకుంటే మే 2 నుంచి తాము సేవలను బంద్ చేస్తామని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అల్టిమేటం ఇచ్చాయి.

04/22/2016 - 16:35

హైదరాబాద్: హైదరాబాద్‌లో మూడు భారీ ఆస్పత్రులతో పాటు ఉస్మానియా ఆస్పత్రిలో వెయ్యి పడకలతో టవర్లు నిర్మిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి ఈరోజు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, భారీ ఆస్పత్రుల నిర్మాణాలకు విదేశీ కంపెనీల నుంచి డిజైన్లు ఆహ్వానిస్తున్నామని, విదేశీ బ్యాంకుల నుంచి నిధులు తీసుకువస్తామని వివరించారు.

04/22/2016 - 16:34

హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికలో పోటీ పెట్టరాదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన విజ్ఞప్తిని తమ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ శుక్రవారం మీడియాకు తెలిపారు. పదవిలో ఉంటూ ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరిని పోటీ లేకుండా ఎన్నుకోవడమనే సంప్రాదాయాన్ని తెరాస పట్టించుకోవడం లేదన్నారు.

04/22/2016 - 16:33

హైదరాబాద్: ఈ నెల 27న ఖమ్మంలో తెరాస పార్టీ ప్లీనరీ జరుపుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పాలేరు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక నేపథ్యంలో ఖమ్మంలో ప్లీనరీ నిర్వహించరాదని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్లీనరీ విషయమై కొన్ని నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నామని తెరాస వివరించింది. 27 ఉదయం పార్టీ ప్రతినిధుల సభ, సాయంత్రం బహిరంగ సభ జరిపాలని తెరాస నాయకత్వం సన్నాహాలు చేస్తోంది.

Pages