S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/09/2015 - 06:49

హైదరాబాద్, డిసెంబర్ 8: రాష్ట్రంలో కందిపప్పు ధరలను అదుపులో ఉంచడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కందిపప్పు ధర విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం ఇటీవల రాష్టవ్య్రాప్తంగా 129 కేంద్రాలను తెరిచింది. వాటి ద్వారా కందిపప్పును కిలో రూ. 135 చొప్పున విక్రయిస్తోంది. అయితే కొన్ని కేంద్రాలలో కందిపప్పు నిల్వలు లేనట్టు సిఎం దృష్టికి వచ్చింది.

12/09/2015 - 04:34

హైదరాబాద్, డిసెంబర్ 8: అంతగా ప్రాధాన్యతలేని పథకాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ఏబీసీ కేటగిరిగా విభజిస్తారు. 2016-17 బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం సచివాలయంలో స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలతో సమావేశం అయ్యారు.

12/09/2015 - 04:32

హైదరాబాద్, డిసెంబర్ 8: కరువు పరిస్ధితులను ఎదుర్కొనేందుకు తాత్కాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను అనుసరించేందుకు కేంద్రం సహాయం కావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కోరారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటన ముగిసిన తర్వాత మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రితో సమావేశమైంది.

12/09/2015 - 04:30

హైదరాబాద్, డిసెంబర్ 8: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు బుధ, గురువారం వరకు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉంటారు. బుధవారం జరగనున్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ కూతురు వివాహానికి హాజరవుతారు. అలాగే గురువారం జరుగనున్న ఎన్‌సిపి నేత శరద్‌పవార్ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

12/09/2015 - 04:29

హైదరాబాద్, డిసెంబర్ 8: పొత్తుల ఊహాగానాలను పటాపంచలు చేస్తూ శాసన మండలి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మొత్తం పనె్నండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆదివారం ఏడుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించగా, మంగళవారం ఐదుగురి పేర్లు అధికారికంగా ప్రకటించారు. మహబూబ్‌నగర్‌లో రెండు స్థానాలుండగా, జగదీశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

12/09/2015 - 04:15

భద్రాచలం, డిసెంబర్ 8: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. పీఎల్‌జీఏ వారోత్సవాల ముగింపు రోజైన మంగళవారం సుక్మా జిల్లా పోలీసులకు 26 మంది మావోయిస్టులు లొంగిపోయిన కొద్ది గంటల్లోనే ఇదే జిల్లాలోని కిష్టారం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు హతులయ్యారు. ఎదురుకాల్పుల్లో 5గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

12/08/2015 - 13:11

ఖమ్మం: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. ఖమ్మం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లింగాల కమల్ రాజ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మహబూబ్ నగర్ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

12/08/2015 - 11:55

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులను తెలుసుకొనేందుకు కేంద్ర బృందం మంగళవారం పర్యటించింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుతోపాటు పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూములను కమిటీ సభ్యులు సందర్శించి స్థానికుల నుంచి వివరాలు తెలుసుకొన్నారు.

12/08/2015 - 11:53

ఖమ్మం: ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో మంగళవారం ఉదయం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 20 వాహనాలను స్వాధీనం చేసుకొని 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

12/08/2015 - 11:52

సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి శివారులో సోమవారం అర్ధరాత్రి కారులో వెళ్తున్న వారిని అటకాయించి ముగ్గురు దుండగులు యాభై లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇషాక్, మరి కొందరితో కలిసి సంగారెడ్డి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పత్తి రైతులకు చెల్లించేందుకు ఈ నగదును ఇషాక్ తీసుకెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Pages