S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/04/2015 - 07:41

మహబూబ్‌నగర్/నల్లగొండ/మెదక్, డిసెంబర్ 3: సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక, అప్పుల బాధలు భరించలేక రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ఆరుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండల కేంద్రానికి చెందిన నామాల లక్ష్మినారాయణ (51) అనే రైతు తన వ్యవసాయ పొలం దగ్గర పురుగుల మందు సేవించి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.

12/04/2015 - 07:40

గర్భిణిని కొట్టి చంపిన కిరాతకులు
ఇటుక బట్టీ కూలీపై సూపర్‌వైజర్ల ఘాతుకం
పెద్దపల్లిలో యజమాని ఆదేశాలతోనే ఘోరం
శవాన్ని కదలనీయని వలస కార్మికులు

12/04/2015 - 07:40

ప్రకటించిన కలెక్టర్ నీతూప్రసాద్ * మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల తరువాత మూడోది

12/03/2015 - 11:39

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి తెరాస ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొనేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ వాదనలకు బలం చేకూర్చేలా గురువారం ఉదయం టిడిపి ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు తెరాసలో చేరే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

12/03/2015 - 11:38

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఉదయం కస్టమ్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు జరిపి దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి కిలో బంగారం, వెండి పౌడర్ స్వాధీనం చేసుకున్నారు.

12/03/2015 - 11:37

ఆదిలాబాద్: అవినీతికి పాల్పడే అధికారులు, ప్రజా ప్రతినిధులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తూ కాగజ్‌నగర్‌లో మావోయిస్టులు బ్యానర్లు ప్రత్యక్షం కావడం కలకలం సృష్టిస్తోంది. పట్టణంలోని మూడు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిశాక గురువారం ఉదయం పోలీసులు ఆ బ్యానర్లను తొలగించారు.

12/03/2015 - 06:42

హైదరాబాద్, డిసెంబర్ 2: కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు నాలుగు వారాల జైలు శిక్షను విధిస్తూ ఆ వెంటనే పైకోర్టుకు వెళ్లేందుకు వీలుగా ఈ ఆదేశాలను సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు బుధవారం ప్రకటించింది. ఈ తీర్పును జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, జస్టిస్ చల్లా కోదండరామ్‌తో కూడిన ధర్మాసనం వెలువరించింది.

12/03/2015 - 06:41

హైదరాబాద్, డిసెంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ఒక పండుగ మాదిరిగా నిర్వహించాలని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి అన్నారు. ఈ నెల 18 నుంచి 27 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ బుక్‌ఫెయిర్ జరుగుతుందని తెలిపారు. బుక్‌ఫెయిర్‌ను గత ఏడాది ఆరు లక్షల మంది సందర్శిస్తే, ఈ ఏడాది ఇంకా ఎక్కువ మంది సందర్శిస్తారని ఆయన ఆకాంక్షించారు.

12/03/2015 - 06:40

హైదరాబాద్, డిసెంబర్ 2: నగరంలోని వివిధ ప్రాంతాలలో గొలుసు దొంగతనాలకు పాల్పతున్న ఓ ఘరానా చైన్ స్నాచర్‌ను వనస్థలిపురం క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వనస్థలిపురం, మీర్‌పేట్ పోలీసు స్టేషన్ల పరిధిలో గత మూడేళ్లుగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న చల్లగాలి మురళీకృష్ణ రాజు 12 కేసుల్లో నిందితుడు. కాగా అతనిని నుంచి ఏడు లక్షలు విలువ చేసే 25తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

12/03/2015 - 06:38

హైదరాబాద్, డిసెంబర్ 2: కరవు సహాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరవును ఎదుర్కొవడానికి వెంటనే లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుదామని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి కె.

Pages