S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

03/02/2016 - 21:02

మార్కెట్‌లో కూరగాయల ధరలు రెండింతలు పెరిగిపోయాయి, దాంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు, వర్షాభావం, సాగు తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నా, మధ్యలో దళారీల మోసం కూడా సుస్పష్టం. రైతు తనకు గిట్టుబాటు ధర లేదని వాపోతుండగా, కొనుగోలుదారుడు ధరలతో మొర్రో అంటున్నాడు. రైతుకు అంతతక్కువ మొత్తం చేతికి అందిన తర్వాత కొనుగోలుదారుడి దగ్గరకు వచ్చేసరికి ఈ ధరలు ఆకాశానికి ఎలా అంటుతున్నాయి?

03/02/2016 - 21:00

కూరగాయలు పండించే రైతుకు ఎక్కడైనా మిగిలేది దగానే. అలాగని వినియోగదారుడికి ఉపయోగపడుతుందా అంటే అదీ లేదు. అధిక ధరలతో వినియోగదారుడు నిత్యం తీవ్రవ్యధకు లోనవుతున్నాడు. ఇద్దరికీ మధ్యలో దళారి రోజురోజుకీ ధనవంతుడు అవుతున్నాడు. ఇదే పరిస్థితి చాలాకాలంగా కొనసాగుతున్నా పట్టించుకునే ప్రభుత్వంగానీ నాధుడుగానీ లేడు. టమోటా రైతు పరిస్థితి చూడండి.. కిలో రెండు, మూడు రూపాయలా? ఇక రైతు ఎలా బతుకుతాడు.

03/02/2016 - 20:58

ప్రజలకు కల్తీలేని కూరగాయలతోపాటు పండ్లను ప్రభుత్వమే పండించాలని నిర్ణయించాం. ఉద్యానవన శాఖ అధ్వర్యంలో పండ్లు, కూరగాయాలను సాగు చేయడానికి కార్యాచరణను రూపొందిస్తున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం 6 లక్షల 65 వేల ఎకరాలలో కూరగాయలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో 3 కోట్ల 75 లక్షల జనాభా ఉన్న ప్రజానీకానికి ప్రస్తుతం రాష్ట్రంలో సాగు చేస్తున్న కూరగాయలు ఏ మూలకు సరిపోవు.

03/02/2016 - 20:57

ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు పడిపోయాయి. రైతుకు గిట్టుబాటు లేకపోగా పంటను నేలపాలు చేయాల్సిన దుస్థితి. మార్కెట్లలో మధ్య దళారుల బాధ ఒకవైపైతే, మరోవైపు కనీసం పెట్టుబడి కూడా రాలేకపోతుందని ఆవేదన. దీంతో వ్యవసాయంపైనా ముఖ్యంగా వాణిజ్య పంటలపై రైతులు మొగ్గు చూపడం లేదు. ఇటీవల కాలంలో కిలో ఉల్లి రూ.60 నుంచి 80 వరకు అమ్ముతుండగా ప్రభుత్వం కొనుగోలు చేసి సబ్సిడీపై అందించింది.

03/02/2016 - 20:56

కూరగాయల ధరలు ఒకవైపు రైతులకు లాభదాయకంగా, మరోవైపు వినియోగదారులకు తక్కువగా లభించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉంది. కీలక సమయాల్లో ఈ ధరలు మార్కెట్లో భారీగా పడిపోకుండా ఉండేందుకు వీలుగా ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్’ (ఎంఐఎఫ్) ను ఏర్పాటు చేయాలి.

03/02/2016 - 20:55

ప్రభుత్వ విధానాలు మారినప్పుడే ఏ పథకమైనా ప్రజలకు మేలు చేస్తుంది. కూరగాయలు పండించే రైతులకు ప్రోత్సాహమూ లేదు, గిట్టుబాటు ధరా లేదు. అలాగని వినియోగదారులకు తక్కువ ధరలకు కూరగాయలు అందుబాటులో ఉన్నాయా అంటే అదీ లేదు. కూరగాయల ధరలు చుక్కలను అంటుతున్నాయి. మధ్యలో దళారులు బాగుపడుతున్నారు. వ్యవస్థ మొత్తం ప్రక్షాళన జరగాలంటే ముందు ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది.

03/02/2016 - 20:53

ఓట్ల ఆలోచనే తప్ప ధరల పెరుగుదల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ, బతకడమే గగనమైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రతిపక్షాలను దెబ్బతీయడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం వంటి చర్యలకు ప్రభుత్వాలు పాల్పడుతున్నాయే తప్ప ధరల పెరుగుదల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

03/02/2016 - 20:49

నలభైయ్యేళ్లుగా హైదరాబాద్ (మోండా మార్కెట్) లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. ప్రస్తుతం నా వయస్సు 55 సంవత్సరాలు. మా అమ్మ కూడా కూరగాయల వ్యాపారం చేసేది. మా పిల్లలు కూడా ఇదే వ్యాపారంలో ఉన్నారు. వాస్తవ పరిస్తితి పరిశీలిద్దాం.. టమోటా, పచ్చిమిర్చి తదితర కూరగాయల ధరలు పెరిగితే అత్యధికంగా పెరుగుతున్నాయి.. లేకుంటే తక్కువకు పడిపోతున్నాయి.

03/02/2016 - 20:46

కూరగాయలను పండించే రైతులకు లాభం రావాలి. అలాగే వినియోగదారులకు సరసమైన ధరలకే కూరగాయలు లభించాలి. దళారుల గుత్త్ధాపత్యాన్ని నియంత్రించాలి. ఈ కానె్సప్ట్‌తో ప్రతి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూరగాయల ధరల నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాలి. కూరగాయల ధరలు పెరిగినప్పుడు ఉత్పత్తిదారులైన రైతులను విమర్శిస్తారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించక, కొనేవాళ్లు లేక ఉల్లి, టమోటాలను రోడ్డుపైన పారేస్తారు.

03/02/2016 - 20:45

ఒక్కోసారి కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయి వినియోగదారులకు అందుబాటులో లేకపోవడం, కొన్నిసార్లు టమోటా లాంటివి రూపాయికి కిలో చొప్పున పడిపోయి రైతులను కన్నీళ్లు పెట్టించడం ఆనవాయితీగా మారింది. ఈ విధానం వల్ల ఆటు రైతులకు ప్రయోజనం కలగడం లేదు, ఇటు వినియోగదారులు సంతోషంగా లేరు. కూరగాయలకు కూడా కనీస మద్దతు ధర నిర్ణయించాలి. అంతకంటే తక్కువ ధరకు కొనడం చట్ట వ్యతిరేకంగా నిర్ణయించాలి.

Pages