S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

02/23/2020 - 23:31

ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అన్న పుస్తకం గురించి విననివారు ఉండరు. ఎక్కడికి వెళ్లినా ఏం మాట్లాడినా ప్రపంచమంతా నిలబడి అతడిని గమనించింది. తాను పరిశోధిస్తున్న వౌలిక భౌతికశాస్త్రం గురించి మాత్రమే కాకుండా అతను మరెన్నో విషయాలను గురించి పట్టించుకున్నాడు. తనలాంటి కదలలేని మనుషులకు సాయం చేయాలని ఎంతో ప్రయత్నించారు. అణుయుద్ధం గురించి ప్రపంచాన్ని హెచ్చరించాడు.

02/16/2020 - 23:08

నాకు మనిషి తెలివి పట్ల అంతులేని నమ్మకం ఉంది. తెలివి ఉండి కూడా వాడని వారి పట్ల అంతగానూ అసహనం కనబరుస్తాను. అది నా బలహీనత. తెలివిని వాడుకుని మన గురించి ప్రపంచం గురించి తెలియజెప్పిన వారంతా నాకు గురువులు. సైన్ల్ నాకు వేదం. వేదం అంటే తెలివిడి అని అర్థం. విజ్ఞానశాస్త్రంలో మరీ లోతైన అంశాలను గురించి అవగాహన కలిగించిన వారు మరీ గొప్ప గురువులు.

02/09/2020 - 23:38

మల్టీమీడియా అని ఒక మాట ఉంది. అక్షరాలు, అంటే పుస్తకాలు, లేఖలు ఇలాంటి దస్తావేజులు అన్నీ కంప్యూటర్‌లో ఉంటాయి. ఆడియో అంటే ధ్వని కూడా కంప్యూటర్‌లోనే ఉంటుంది. నేను ఇంట్లో కూర్చుని కంప్యూటర్‌లో రికార్డ్ చేసిన అంశాలను నా బ్లాగ్‌లో కూడా వినిపించాను అంటే అందులో ముక్క కూడా అబద్ధం లేదు. రికార్డ్ చేసిన మాట పాట ఏదైనా అందులోని నాణ్యత పెంచడం అనవసరమైన ధ్వని లేదా ఇతర అంశాలను తీసివేయడం, అది ఒక విద్య.

02/02/2020 - 22:28

కంప్యూటర్లు నాలాంటి వాళ్లకు చాలా కాలం క్రితమే బతుకులో భాగంగా మారాయి. చాలాకాలంగా మాలాంటి వాళ్లు వాడుతున్న నా డెస్కుటాపు ఈమధ్యన పాడైంది. దాన్ని బాగు చేయడానికి నేను ఎక్కడికి వెళ్లను. నా కొడుకు వచ్చినప్పుడు ఇద్దరమూ కలిసి దాన్ని కొంత ఖర్చు పెట్టి మరమ్మతు చేశాం. అది బాగానే పనిచేయ సాగింది. మరీ పాతది గనుక కొన్నాళ్ల తర్వాత మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. ఇక దాన్ని వదలక తప్పదని నాకు అర్థం అయింది.

01/26/2020 - 22:40

గడచిన సంవత్సరంలో కొన్న పుస్తకాలను గురించి ఒక సమీక్ష చేశాను. అందులో ముఖ్యంగా నాకు మూడు రకాలు కనిపించాయి. మొదటివి సైన్స్ పుస్తకాలు. రేడియోలో నేను చేసిన ఉద్యోగం కారణంగా, ఆ తరువాత కూడా వరుసబెట్టి అదే పనిగా సైన్స్ రాస్తున్నందుకు నన్ను కొంతమంది సైన్స్ గోపాలం అంటారు. మొత్తానికి నాకు సైన్స్ చీమ గట్టిగానే కుట్టింది. అదేదో నేను తప్పకుండా పట్టించుకోవలసిన అంశం అన్న భావం మెదడులో గట్టిగా మిగిలిపోయింది.

01/12/2020 - 23:42

మా అమ్మాయి కొంతకాలంగా సింగపూర్‌లో పని చేస్తూ ఉండేది. పై చదువు, పని పేరున తాను ఇప్పుడు యూరోప్‌కు మారుతుంది. కనుకనే సింగపూర్ చూడటానికి మమ్మల్ని రమ్మని పిలిచింది. మా అబ్బాయి కూడా అక్కడికి వచ్చాడు. నలుగురం కలిసి నాలుగు రోజుల పాటు మా ఊర్లో తిరిగాం.

01/05/2020 - 23:42

ఒకప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అంటే కర్ణాటక సంగీతం వినపడుతూ వుండేది. అది నా గొప్పతనం కాదు. సంగీతం ఎవరినయినా పట్టుకుంటే అట్లా పట్టుకుంటుంది. నా కొడుకు అప్పటికి డైనింగ్ టేబుల్ ఎత్తు కూడా లేడు. ఒక రాత్రి నేను అన్నం తింటున్నాను. వాడు నా ముందు వచ్చి గంభీరంగా నిలబడ్డాడు. సంగీతం పెట్టకుండా అన్నం తింటున్నావు ఎందుకు? అంటూ నన్ను నిలదీశాడు. మొత్తానికి పిల్లలిద్దరికీ కూడా సంగీతం వినడం అలవాటు అయింది.

12/29/2019 - 23:40

మలుపు వచ్చిందా చెప్పండి. మీరు వచ్చిందంటే నేనూ సరే అంటాను. అరవయి ఆరు సంవత్సరాలు గడిచినాయి. అందులో కొంతకాలం మలుపుల గురించి తెలియనే లేదు. తెలిసిన తరువాత తేడా తెలియలేదు. గోళ్లు గిల్లుకుంటూ కూచున్నా సరే, రోజూ గడిచిపోతుంది. చూస్తుండగానే వయసు పెరిగిపోతుంది. నిన్నటిరోజు మళ్లా రాదు. కన్నుమూసి తెరిచేలోగా ఆ క్షణం గడిచిపోతుంది. అందుకనే చేయవలసినదేదో సకాలంలో చేయాలి. లేకుంటే దానికి అర్థమే ఉండకపోవచ్చు.

12/22/2019 - 23:34

ఒక పుస్తకం ప్రింట్ చేయించడానికి లేదా మరేదో అచ్చు వేసుకోవడానికి ఫొటో కాపీషాప్‌కి వెళ్లవలసి వస్తుంది. యజమాని మిత్రుడు కనుక నేను వెళ్లిన అంగట్లో కొంతసేపు కూర్చుంటాను. అక్కడికి వచ్చే వాళ్లను గమనిస్తూ ఉంటాను. ఆశ్చర్యం ఎదురవుతుంది. వచ్చే వాళ్లంతా బడి పిల్లలు. ఇంటర్‌నెట్‌లో ఏవో బొమ్మలు వెతుకుతారు. వాటిని కొందరు రంగుల్లోనూ నలుపు తెలుపులోను అచ్చు వేయించుకుంటారు.

12/15/2019 - 23:10

చదవడం ఒక వ్యసనం. వెతికి వెతికి మరీ చదవడం అంతకంటే మంచి వ్యసనం. ఈ వెతుకులాటలో కొన్ని ఆశ్చర్యాలు ఎదురవుతాయి. రుచికరమైన పదార్థాన్ని ఒక్కరే తినకూడదు అన్నది ఒక మంచి పద్ధతి. అదే రకంగా మంచి రచనలు కనిపించినప్పుడు కూడా అందరితో పంచుకోవాలి అన్నది ఇంకా మంచి పద్ధతి. గిల్గమేష్ అని ఒక్క ఎపిక్ దొరికింది. అంటే ప్రాచీన గాథ అన్నమాట. దాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి నవల అని వర్ణించారు. మనకు మనసు ఊరుకోదు కదా!

Pages