S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

04/13/2019 - 21:55

నేను డెంటిస్టు దగ్గరకు వెళ్లాను. నిజానికి పంటినొప్పి లేనే లేదు. కానీ అనుభవం మరొక రకంగా ఉంది. నొప్పి తెలిసే సమయానికి ఏదో ఒక పంటిలో కొండగుహంత రంధ్రం తయారవుతుంది. -రాబర్ట్ సన్ డేవిడ్, నవలాకారుడు.
* * *

04/13/2019 - 21:54

ఎవరికీ నమ్మకంగా తెలియని విషయం గురించి మనకు అసలు అనుమానం ఉండనే కూడదు - ఆన్ వార్డ్ రాడ్ క్లిఫ్ (రచయిత)
* * *

03/30/2019 - 19:03

అయ్యా, దయచేసి మీకు మీకు తెలియనిది ఏమిటో చెప్పండి. -బేజ్ హాట్ వాలర్ (న్యాయవాది)
నిజమే, అన్నీ తెలిసినట్టు మాట్లాడే వారితో మనకే కష్టం. లాయర్లకు మరీ కష్టం.
* * *

03/23/2019 - 18:44

ఆయన ఇంకొంచెం తక్కువ చదువుకుని ఉంటే, అంతులేనంత బాగా చెప్పగలిగేవాడు - ఛార్ల్స్ డికెన్స్
నిజమే, అవసరమయిన మేరకు మాత్రమే మాట్లాడడానికి మరీ ఎక్కువ తెలివి అడ్డు తగులుతుంది.
* * *
మనిషి ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తరిగేట్లు లేదు. తప్పేముంది గనుక ముందుకు వెళదాము. ఎక్కిళ్లు ఎందుకు? అని ఎప్పుడయినా అనుమానం వచ్చిందా?

03/16/2019 - 18:11

చరిత్ర రాయడం చాలా సులభం. కానీ రాసిన తరువాత దాని నుంచి ఏదయినా తెలుసుకోవాలి. తేల్చుకోవాలి అంటే మాత్రం చాలా కష్టం. -వాల్తర్ నెర్న్‌స్ట్. ఈయన జర్మనీకి చెందిన వైజ్ఞానికుడు.
* * *

03/09/2019 - 22:44

విషయానికి రాగలగడం చాలా గొప్ప విషయం - మెక్ లియోడ్ జి ప్రెస్టన్ (ఈయనగారెవరో తెలియదు. కానీ చాలా గొప్ప మాట అన్నారు.)
* * *

03/09/2019 - 22:43

-రాతి మీద కాలి గుర్తులా? ఎంత బాగుంది! ఎంత వింతగ ఉంది! అన్నాడట ఎడ్వర్డ్ హిచ్‌కాక్. ఈయన సినిమాల మనిషి కాడు. అతను వేరు. పేరు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్.
* * *

02/23/2019 - 19:05

పాట విని చాలా బాగుంది అంటుంటారు. బాగా పాడారు అంటే ఏమిటి అర్థం? ఆ పాట అంతకు ముందే మరెవరో పాడి ఉంటారు. దాన్ని మరొకరికి నేర్పించి ఉంటారు. లేదా ఈ పాడిన వారు ఆ పాట విని మాత్రమే పాడి ఉంటారు. అటువంటి పాట బాగుంది అంటే అందులో అర్థం, అంతరార్థం ఏమిటి? నన్ను అందరూ కోడిగుడ్డు మీద అదేదో చేస్తున్నాడు అని తప్పు పట్టకండి గాని, కొంచెం నా మీద సానుభూతి చూపి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి.

02/16/2019 - 18:31

పల్లె బతుకులో పాటకు ప్రధానమైన స్థానం ఉంది. అక్కడ అడుగడుగునా పాట వినిపిస్తుంది. వ్యవసాయ కార్యక్రమంలో పాట లేనిదే ఏ పనీ జరగదు. నాట్లకు పాట, కలుపులకు పాట, పంట కోతలకు పాట, బంతి కట్టేందుకు పాట, బాయి నుంచి నీరు తోడేందుకు పాట! పశువులను కాస్తూ పని లేకుండా ఉండే కాపరి నోట పాట వినిపిస్తుంది.

02/09/2019 - 18:38

వేటాడే మనిషికి పరుగుతోబాటు ఆయుధాన్ని విసరవలసిన అవసరం కూడా ఎదురయింది. ఒక వస్తువును చేతితో పట్టుకుని విసరడం ప్రైమేట్ జాతి జంతువుకు మాత్రమే వీలవుతుంది. కానీ చింపాంజీలు, ఒరాంగ్ ఉటాన్‌లు, కోతులకు ఒక వస్తువును విసరడానికి మనిషికి ఉన్న వీలు లేదు. చేతిని పైకి ఎత్తి గుండ్రంగా తిప్పి క్రికెట్ బంతిలాగ విసరడం వీటికి చేతకాలేదు. ఒకవేళ విసిరినా గురి కుదరదు.

Pages