S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

09/08/2018 - 18:57

పల్లెకు పోదాం, పారును చూద్దాం, అల్లరి చేద్దాం, చలో చలో అంటాడు దేవదాసు. ఆ పాట వింటున్నా ఆ సినిమా చూస్తున్నా అదేదో అసలు సిసలు తెలుగు వాతావరణం అనిపిస్తుంది. కానీ అది శరచ్చంద్ర చటోపాధ్యాయ అనే శరత్‌బాబు బంగ్లా నవల ఆధారంగా రూపొందిన చిత్రం అని చాలామందికి తెలియకపోవచ్చు. మనవాళ్లు కొంతమంది చదువుకోవడానికి శాంతినికేతన్ వెళ్లారు. అక్కడ బెంగాలీ నేర్చుకున్నారు.

09/01/2018 - 18:31

సంస్కృతంలో నీళ్లకు జీవనం, వనం అని కూడా పేర్లున్నాయి. నీళ్లు లేనిదే జీవనం లేదు. అసలు జీవమే లేదు. కానీ ఈ నీళ్లు అంత సులభంగానూ ప్రాణాలను తీస్తాయి కూడా. ప్రాణమిచ్చిన నీటికి ప్రాణం తీసే శక్తి ఉండడం సహజమే కదా. కేరళలో వరదలు వచ్చాయట. పరిస్థితి మరీ అన్యాయంగా ఉందంటున్నారు. కేరళను ఒకసారి వెళ్లి చూడని వారికి ఈ పరిస్థితి గురిచి ఆలోచించడం కొంచెం కష్టమే అవుతుంది.

08/25/2018 - 17:59

పొద్దునే్న లేచి అందరూ తలొక దిక్కు ఎందుకు పోతారు అన్నది ప్రశ్న. అందరూ ఒకే దిక్కుకు కనుక పోతే నేల ఆ దిక్కు కుంగిపోతూ ఉందేమో అన్నది జవాబు. ఈ మాటలో హాస్యము ఉన్నదా లేక ఆలోచించేటందుకు ఏమన్నా ఉన్నదా అన్నది మన ఎదురుగా ఉన్న ప్రశ్న. భూమిని బల్లపరుపుగా అంటే ఒక మంచము వలె, ఒక చాప వలె ఉన్నది అనుకుంటే అప్పుడు అందరూ ఒక దిక్కు పోతే మరి భూమి ఆ దిక్కు వంగిపోయే అవకాశం ఉన్నది. కానీ భూమి అట్ల బల్లపరుపుగా లేదు.

08/17/2018 - 20:43

మనిషి తీరు గురించి మరీ లోతుగా చెపితే అందరూ ఆసక్తిగా చదువుతారా? ఎంత విస్తారంగా చెపితే చదువుతారు! ఈ రచన పుస్తకంగా నేరుగా వేయడం మంచిదా! ఎన్నో ప్రశ్నలు.. వీటన్నిటికీ కారణం ఉంది. మనిషి తనకు తెలిసి కొంత, తెలియకుండా కొంత నియమాలు పెట్టుకుంటాడు. ఆ నియమాల ప్రకారం బతుకులు సాగుతుంటాయి. మానవులు సమాజంగా బతకడం మొదలయిన తరువాత అంతకు ముందటి పద్ధతి కొనసాగదు అని తెలిసింది.

08/14/2018 - 18:58

గాలి కంటికి కనిపించదు. ఒకచోట స్థిరంగా నిలబడదు. కనుక నిలకడ లేని మాటలను గాలి కబుర్లు అంటారు. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది మాత్రం గాలిని గురించిన కబుర్లు. బతుకుకు ఆధారమైన గాలిని గురించిన కబుర్లు. ఇవి అసలు సిసలు సైన్సు మాటలు. చుట్టూ ఉన్న గాలిలో ఏ రసాయనం ఎక్కువ ఉంది అని ప్రశ్న వేసుకున్నాం. జవాబు కొరకు వెతుకుతున్నాం.

08/11/2018 - 21:41

ఎందుకు దొంగచాటు వ్యవహారం? రహస్యం కనుక. దాచవలసిన విషయం కనుక. తరచుగా మూడవ కంట పడకుండా అన్యాయంగా జరగవలసిన వ్యవహారం కనుక.

08/04/2018 - 20:52

కాలం రాయడం అంటే అందులో అన్ని విషయాలు ఉన్నాయి అని ఎంతమంది అనుకుంటారో తెలియదు. రాసేవారికి అది తప్ప ఇంకొక పని తెలియదు. చదివేవారికి హాయిగా చదవడం తప్ప రచయితలు పడే బాధలను గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ నిజంగా పత్రిక అంత అందంగా తయారయి తమ చేతిలోకి వచ్చింది అంటే దాని వెనుక ఎంతమంది కృషి ఉంది అన్న సంగతిని అందరూ గమనిస్తే ఎంత బాగుండును.

07/28/2018 - 18:20

మొన్న ఒక సాహిత్య సభకు వెళ్లాను. వేదికను అలంకరించవలసిన ఐదారుగురు నిజంగా పెద్ద మనుషులు. వయసులో కూడా పెద్దవాళ్లు. ఒకరు తప్ప మిగతావారంతా ముందే వచ్చి కూర్చున్నారు. ఇక హాలులో ప్రేక్షకులుగా వచ్చినవారిలో సగంమంది వేదికమీదకు వెళ్లి మాట్లాడగలిగిన మనుషులే. ఒకప్పుడు సాహిత్య సభలకు నావంటి మామూలు మనుషులు వెళ్లి ఎవరు లో కూర్చుని చేతనయింది విని కాసింత గోలచేసి వచ్చేసేవాళ్ళం.

07/21/2018 - 20:40

అథాతో ఆత్మజిజ్ఞాస అంటున్నది మన పద్ధతి. పరబ్రహ్మంతో పనిలేదు. ముందు మన గురించి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు సర్వేభద్రాణి పశ్యంతు అన్న మాట ప్రకారం అందరూ హాయిగా ఉండగలుగుతారు. ఇంతకూ కథం ఇదం ఆత్మా? ఈ నేనంటే ఎవరు? ఈ మనిషి అంటే ఎవరు? ఈ మనిషికి గుర్తింపులు ఏమయినా ఉన్నాయా? ఇలాంటి ఆలోచనలు ముందుకు సాగాలి.

07/14/2018 - 22:38

అరిసి కూట్టు అత్తా మగనే, నీ కూట్టుంబోదు వెలిక్కవిల్లియో, అని ఒక తమిళ సినిమా పాట. పాపము శపించుగాక. కొంతమందికి అర్థం తెలియలేదని నాకు తెలిసింది. బియ్యం దంచే అత్తకూతురా (బియ్యం దంచేది అత్త అనుకునేరు గనుక. సాక్షాత్తు అత్తకూతురే దంచుతూ ఉంటుంది!) (మధ్యలో మాట దారి మళ్లిందా? మళ్లా క్షమించండి..) అత్తకూతురా దగ్గర కదూ అన్నాము. పాటలోనండీ! నీవు దంచుతుంటే నొప్పి పుట్టలేదా?

Pages