S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

10/01/2016 - 22:32

అందాల తార శ్రుతి హాసన్ ఫుల్ జోష్‌లో వుంది. తాజాగా టాలీవుడ్‌లో నాగచైతన్యతో ‘ప్రేమమ్’తో పాటు, పవన్ కల్యాణ్ ‘కాటమ రాయుడు’ చిత్రాల్లో నటిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తనకు నచ్చిన పాత్రల్లో జీవిస్తూ, కెరీర్‌లో సరైన బాటనే ఎంచుకుంటోంది. అయితే ఏ ఒక్క భాషకో పరిమితం కాకుండా అన్ని భాషల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. టాలీవుడ్ సరే.. బాలీవుడ్ మాటేమిటి?

10/01/2016 - 22:30

బాలీవుడ్‌లో 2008లో వచ్చిన ‘రాక్ ఆన్’ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనకు తెలియంది కాదు. ఆ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసి మంచి వసూళ్లు రాబట్టుకుంది. అంతేకాదు..విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు తాజాగా అదే చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ‘రాక్ ఆన్ 2’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం శరవేగంగా తెరకెక్కుతోంది. అది సరే..ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?

10/01/2016 - 22:29

‘‘ఎదిగే తారలపై గాసిప్స్ సృష్టించడం మామూలు విషయమే. ఏ నటిపైనా గాసిప్స్ బాగా వచ్చాయంటే ఆ నటి కెరీర్‌లో బాగా ఎదిగినట్టే. ఎన్నో కలలతో..మరెన్నో ఆశలతో వెండితెరపై అడుగుపెట్టిన ముద్దుగుమ్మలపై గాసిప్స్ వారిని ఎంత బాధిస్తాయో ఒక్కసారి అర్థం చేసుకోవాలి’’అంటోంది సీనియర్ నటి ప్రియాంక చోప్రా.

09/24/2016 - 21:53

అంటున్నారంతా. అందుకు కారణం లేకపోలేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించడమేగాక, ఆయా భాషల్లో అగ్ర నటులతో ఆడిపాడింది శ్రీయ. అయితే చాలా కాలం తర్వాత శ్రీయ బాలయ్య సరసన ఓ క్యారెక్టర్ చేస్తుండడమే ఇందుకు కారణమైంది. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య టైటిల్ పాత్రలో రూపుదిద్దుకుంటున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

09/24/2016 - 21:51

బాలీవుడ్‌లో నిలదొక్కుకుంటానంటోంది అందాల తార తాప్సీ. టాలీవుడ్, కోలీవుడ్‌లో గ్లామర్ పాత్రలతో అందర్నీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ తాప్సీ టార్గెట్ బాలీవుడ్డేనట. వినడానికి ఆశ్చర్యంగా వున్నా..ఇది నిజమేనట. తెలుగులో ముఖ్యంగా తన గ్లామర్‌తో యువతను కట్టిపడేసిన ఈ సుందరాంగి కెరీర్ చూస్తున్నంతలోనే అడ్రస్ లేకుండా పోయింది. తాజాగా బాలీవుడ్‌లో ‘పింక్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో బిగ్‌బి అమితాబ్ నటిస్తున్నారు.

09/24/2016 - 21:50

టాలీవుడ్‌లో లావణ్య త్రిపాఠి బిజీ బిజీగా మారబోతోంది. ఇప్పటికే చేతిలో మూడు సినిమాలున్నాయి. మరో రెండింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. టాలీవుడ్‌లో ప్రవేశిస్తున్న తారలంతా ముందుగా గ్లామర్ పాత్రలవైపే చూస్తున్నారు. గ్లామరే కెరీర్‌ను రక్షిస్తుందని కలలు కూడా కంటున్నారు. కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే గ్లామర్‌తో యువతను కట్టిపడేయాలనుకుంటున్నారు. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం అందుకు పూర్తి విరుద్ధం అంటోందిట.

09/18/2016 - 21:13

బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్ అంటేనే ఎప్పుడూ ఓ సంచలనమే. చేసే చిత్రాలేకాదు, పోషించే పాత్రల్లోనూ ఆమె ఓ సంచలనమే! కత్రీనాపై వచ్చినన్ని రూమర్స్ మరే బాలీవుడ్ తారపై రాలేదంటే ఆలోచించాల్సిందే మరి! కత్రీనా వర్సెస్ మీడియా ఇలా వీరిద్దరి మధ్య ఎన్నో వివాదాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. ఎప్పుడూ హాట్ హాట్‌గానే వార్తలు గుప్పుమన్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కెరీర్‌లో ఎన్నో చూసింది.

09/18/2016 - 21:11

వెండితెరపై ఎంతో వెలిగిపోవాలని..మరెంతో పేరు తెచ్చుకోవాలని ఆరాటపడని భామలుండరు. అయితే అందరికీ ఈ రంగుల ప్రపంచంలో నిలదొక్కుకునే అవకాశాలు రావు. అవి కొందరికి మాత్రమే రాసిపెట్టి వుంటాయి. నటి సలోని కూడా ఎన్నో కలలుకంది. నటిగా ఓ వెలుగు వెలిగిపోవాలనుకుంది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. అవి ఏవీ ఈ అమ్మడికి కలిసిరాలేదు. దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి చేతిలో పడ్డా, ఫలితం లేకుండా పోయింది.

09/18/2016 - 21:09

ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌ను ఏలుతున్న నటి బిపాసాబసు ఇప్పుడు హాయిగా కబుర్లు చెబుతోంది. కలిసిన చోటల్లా ఎవ్వరికి పడితే వారికి తన నటనానుభవాలను పూసగుచ్చినట్లు వివరిస్తుందట. కొందరైతే బిపాసాను చూసి వామ్మో..! అంటూ పరుగులు కూడా పెడుతున్నారట! ‘బస్ బిపాసా..బస్’ అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నా వినక తన గురించి తను గొప్పలు చెప్పుకుంటోందిట.

09/18/2016 - 21:07

-వుంటానంటోంది అందాల భామ నయనతార. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర నటుల సరసన ఆడిపాడిన ఈ సుందరాంగి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. కెరీర్ పరంగా చూసుకుంటే నయనకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తేనే కాస్త పరేషాన్. పరిశ్రమలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అందరి అభిమానాలను పొందడమేగాక, నటిగా మంచి మార్కుల్నే కొట్టేసింది.

Pages