S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతో - మీరు

10/01/2016 - 21:07

‘రా.. రమ్మని’ కవర్‌స్టోరీ కథనం ద్వారా టూరిజం విశేషాలు, పలు ప్రదేశాల గురించి తెలుసుకున్నాం. దసరా సెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉందీ కథనం. ఎడిటర్‌తో ముఖాముఖి మనలో మనం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. సిసింద్రీ చిన్నారులకు, పెద్దలకు ఎంతో నచ్చుతోంది. వారం వారం మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న ఆంధ్రభూమి ఆదివారం అనుబంధానికి ధన్యవాదాలు.

09/24/2016 - 22:38

ఈ వారం ‘్భగ్యనగరిలో ఆణిముత్యాలు’ వ్యాసం చాలా బాగుంది. ఆలోచింపజేసేదిగా ఉంది. గోపీచంద్ కృషి వల్ల భారత్ ఈ పతకాన్ని సాధించగలిగింది. అతడి కృషి, సింధు పట్టుదల, క్రీడా నైపుణ్యం ఎంచదగ్గది. ఇప్పుడు ప్రతి రాష్ట్రం మేల్కొని మంచి క్రీడాకారులను ప్రోత్సహించాలి. రాజకీయాలకు అతీతంగా ఉంటే ఎన్నో ఆణిముత్యాలు రాణిస్తాయి. అలాగే ఊహించని విధంగా జిమ్మాస్టిక్స్‌లో దీపాకర్మాకర్ దూసుకొచ్చింది.

09/18/2016 - 06:53

భాగ్యనగరి ఆణిముత్యాలు కవర్‌స్టోరీ ఎంతో చక్కగా ఉంది. అంతర్జాతీయ వేదికలపై మెరుగైన ప్రదర్శన లిస్తున్న బ్యాడ్మింటన్ క్రీడాకారులు తెలుగు గడ్డపై సాధన చేసినవారే కావడం మనకు గర్వకారణం. రియో ఒలింపిక్స్‌లో పతకాలు తేలేదని విమర్శించేవారు ఆ క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం, మెరుగైన సౌకర్యాల కల్పన, ఉజ్వల భవిష్యత్తు లేవన్న విషయం గుర్తించాలి.

09/11/2016 - 00:35

‘చివరి చీర’ కథలో నాన్న పాత్ర తపనకు తగినట్టుంది. కథా కథనం చాలా చక్కగా ఉన్నాయి. పల్లీకరణ అంటూ కొత్త పదాన్ని పలికించారు. పండుగలు కాలక్రమంలో ఎలా రూపాంతరం చెందుతాయో మనవలు మనవరాళ్ల నోటి నుండి పలికించారు. రచయితకు ధన్యవాదాలు.
-పెండికట్ల పాపారావు (అమలాపురం)

09/03/2016 - 21:52

ఈ వారం స్పెషల్ శీర్షికన అందించిన ‘జంబో బస్సు వస్తోంది’ కవర్‌స్టోరీ చాలా బాగుంది. మినీ ట్రైన్స్‌ని తలపించేలా ఉన్న బస్సు చూస్తుంటే ఆసక్తిదాయకంగా ఉంది. ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాం. లక్ష్మిగారు రాసిన చిన్నిచిన్ని ఆశ కథ నేటి తరం విద్యార్థుల ఇబ్బందులను వివరించింది. యాంత్రిక జీవనంలో చదువుతోపాటు ఆటలు కూడా అవసరం అని పేరెంట్స్ గుర్తించాలి. తేలే పోస్ట్ఫాస్ నిజంగా నమ్మలేకపోయేలా ఉంది.

08/27/2016 - 22:53

కృష్ణా పుష్కరాల సందర్భంగా అందించిన ‘పుష్కర రాగిణి.. కృష్ణవేణీ తరంగిణి’ కవర్‌స్టోరీ మా ఇంటిల్లిపాదినీ అలరించింది. పుష్కరుడి ప్రవేశం.. ఆయా పుణ్యక్షేత్రాల సందర్శన తదితర అంశాలతో క్లుప్తంగా అందించినందుకు కృతజ్ఞతలు. అలాగే సండే గీత, ఓ చిన్న మాట, అవీ-ఇవీ, ‘్భ..’ కథ చాలాచాలా బాగున్నాయి.
-కాళహస్తి వెంకట శేషగిరిరావు (నెల్లూరు)
లోకాభిరామమ్

08/20/2016 - 22:19

రాయడం ఎంత సులభమో అంత కష్టం. వర్గీకరణ, విషయ సేకరణ ఎక్కువమందికి అర్థమయ్యేట్టు అందించటంలో ప్రయాస గురించి తనదైన శైలిలో గోపాల విజ్ఞాని రాయడం అలరించింది. మన పండుగలు ఆచార వ్యవహారాల్లోని సెన్స్, సైన్స్ గురించి ఆయన వివరంగా రాయాలని మా ఆశ. ఇక కళ్ల కింద సంచుల వల్ల ఏ మాత్రం ఉపయోగం లేకుండా బాధపడే చేపలు, మాటు వేసి చంపేసే హంతక బగ్‌ల గురించి చదివి ఆశ్చర్యపోయాం.

08/14/2016 - 09:19

ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆనంద హేతువు అంటూ ప్రాణాయామం గురించి ‘సండే గీత’లో చక్కగా చెప్పారు. రకరకాల రంగులతో శరీరం మీద పెయింటింగ్‌లు వేసుకోవడం, ఆ విధంగా వేసుకున్న బాడీ పెయింటింగ్‌ల పోటీలు నిర్వహించడం తెలిసి ఆశ్చర్యపోయాం. హైకోర్టు విభజనపై తెలంగాణ అనవసర రాద్ధాంతం చేస్తోంది. నిజానికి ఇద్దరు సి.ఎంలు, సిజెఐ కలిసి తీసుకోవలసిన నిర్ణయం అది. యాగానికి ఆయన ఈయన్ని ఆహ్వానిస్తారు.

08/06/2016 - 22:54

మన జీవితంలో మలుపు తిప్పే వ్యక్తులకు, మనల్ని ఆనందంగా ఉంచే వారికీ కృతజ్ఞతలు చెప్పడం ఎంతో అవసరం అని చెప్పిన ‘ఓ చిన్న మాట’ మహత్తరంగ ఉంది. వైద్యం వ్యాపారం అయిపోయిందని ఒక పాఠకుడు చింతించారు. భూమి, నీరు, ఉద్యోగాలు అన్నీ వ్యాపారాలుగా మారిపోవడానికి అసలు కారణం విద్య వ్యాపారంగా మారటమే. రాజకీయాలు వ్యాపారంగా మారిపోవడం మరో ముఖ్య కారణం.

07/30/2016 - 22:49

మైండ్ బ్లాక్ అవుట్ అయినప్పుడు తనేం చేస్తున్నాడో తనకే తెలియక నేరం చేస్తానన్న భయంతో ఒకడు తనని జైల్లో పెట్టమని పోలీసుల్ని కోరడంతో ప్రారంభమైన కథ అనేక మలుపులు తిరిగి నేర నిర్థారణతో ముగిసిన విధం ఆకట్టుకొంది. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేందుకు కొందరు ఎంచుకున్న ప్రయాణ సాధనాలు అబ్బురపరిచాయి.

Pages