S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథా సాగరం

07/21/2018 - 20:33

నిజమైన సాధువు ఎవరితోనూ విభేదించడు, చర్చించడు, వాదించడు. ఒక గురువు ఉండేవాడు. ఆయన్ని కలవడానికి ఎందరో వచ్చేవాళ్లు. ఆయన వాళ్లందర్నీ సంతృప్తి పరిచేవాడు. ఎవరితోనూ విభేదించేవాడు కాడు, చర్చించేవాడు కాడు. కారణం సాధువుకు వాదన ఉండదు.

07/14/2018 - 21:25

ఇండియాలో గొప్ప సూఫీ గురువు ఉండేవాడు. ఆయన పేరు ఉస్మాన్ హరూనీ. ఆయనకు వేల మంది శిష్యులు వుండేవాళ్లు. వాళ్లలో ఎందరో విద్యావంతులు, తాత్వికులు వుండేవాళ్లు. ఆయన ఎంతో గాఢంగా వాళ్లకు మార్మిమార్గం గురించి ఉపదేశించేవాడు.
ఆయన దగ్గరున్న వాళ్లందరూ దాదాపు నామ, రూప రహితుడయిన దేవుణ్ణి విశ్వసించేవాళ్లు. నిరాకారుడయిన దేవుణ్ణి ఆరాధించేవాళ్లు.

07/07/2018 - 22:09

సాది కవి గురించి ఈ కథ చెబుతారు.
సాదీ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. తన జీవితంలో ఆయన ఆ అమ్మాయికి అపూర్వమయిన స్థానమిచ్చాడు. అతను ఆ అమ్మాయి కోసం ఎన్నో చేశాడు.

06/30/2018 - 22:31

సర్మద్ గొప్ప సూఫీ సాధువు. గ్వాలియర్‌లో నివసించేవాడు. అప్పుడు ఉత్తర భారతాన్ని ఔరంగజేబు పాలించేవాడు. ఔరంగజేబు చక్రవర్తి సర్మద్‌ని ప్రార్థన కోసం మసీదుకు రమ్మన్నాడు.
ఆ రోజుల్లో ప్రార్థనా సమయానికి మసీదుకి రాకుంటే కఠిన శిక్షకు గురి కావల్సి వుండేది.

06/24/2018 - 00:04

ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వముంది. వాళ్లు ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డారు. ఒక వ్యక్తి బలహీనుడు. రెండోవాడు బలవంతుడు. బలవంతుడయిన వ్యక్తి సూఫీ ధర్మాన్ని తెలిసినవాడు.

06/10/2018 - 00:13

ఒక వీరుడు గుర్రం మీద వేటకు బయల్దేరాడు. దారిలో ఒక మనిషి తాగి కనిపించాడు. దారి మధ్యలో కూచున్నాడు. అతను వీరుణ్ణి చూసి ‘నువ్వు నీ గుర్రాన్ని అమ్ముతావా?’ అని అడిగాడు.
వీరుడు అతను తాగి ఉన్నట్లు తెలుసుకుని సమాధానమివ్వలేదు. అడవికి వెళ్లి వేటాడాడు. సాయంత్రమయింది. మళ్లీ తిరుగు ప్రయాణమయ్యాడు. మళ్లీ అదే దారిగుండా గుర్రం మీద వచ్చాడు.
అప్పుడు తాగి దారి మధ్యలో కూచున్న వ్యక్తి ఇప్పుడు దారి

06/02/2018 - 21:09

సాదీ గొప్ప కవి. ఆయన తన జీవితంలోని ఒక సంఘటన గురించి రాసుకున్నాడు. ఓసారి నాకు చెప్పుల్లేవు. వేడి యిసుకలో చెప్పుల్లేకుండా నడవాల్సి వచ్చేది. నేనెంత దురదృష్టవంతుణ్ణి అని దిగులుపడ్డాను. అప్పుడు ఒక కుంటివాణ్ణి చూశాను. అతనికి ఒక కాలు లేదు. శ్రమపడుతూ నడుస్తున్నాడు. నేను మోకరిల్లి ఆకాశం కేసి చూసి ‘్భగవంతుడా! కనీసం నాకు కాళ్లిచ్చావు’ అని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను’ అన్నాడు.

05/28/2018 - 23:32

ఒక సాధువు వీధంట వెళుతున్నాడు. అది రాత్రి. ఒక పోలీసు ఆ సన్యాసిని చూసి ‘ఇంత చీకట్లో వెళుతున్నావు. ఎవరు నువ్వు? దొంగవా?’ అన్నాడు.
సాధువు ‘అవును. నేను దొంగనే’ అన్నాడు.
పోలీసు ఆ సాధువును తీసుకెళ్లి జైల్లో వేశాడు. సాధువు ఆ అనుభవాన్ని ఆనందిస్తూ రాత్రంతా గడిపాడు.

05/19/2018 - 22:13

మోసెస్ ప్రవక్త సీనాయ్ పర్వతం దగ్గరకు వెళుతున్నాడు. దారిలో ఆయన ఒక భక్తిపరుడయిన వ్యక్తిని కలిశాడు. ఆ భక్తుడు ‘ఎక్కడికి వెళుతున్నారు?’ అని అడిగాడు. మోసెస్ ‘సీనాయ్ పర్వతం మీదకు’ అన్నాడు. ఆ భక్తుడు ‘దయచేసి నా గురించి దేవుడితో చెప్పు. నేను నా జీవితమంతా దైవభక్తితో, నియమనిష్టల్తో గడిపాను. ధర్మబద్ధంగా జీవించాను. నేను భగవంతుణ్ణి ప్రార్థించాను. కానీ ఏం లాభం? నా బతుకంతా బాధలు, కష్టాలు, దురదృష్టాలే.

05/12/2018 - 20:06

కథాసాగరం.....

Pages