S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 07:43

తిరుపతి, జూలై 2: టిటిడికి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాసరేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. శనివారం సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 3వ తేదీ ఉదయం 9నుంచి 10 గంటల వరకు సింహలగ్నంలో ధ్వజారోహణం, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు.

07/03/2016 - 07:43

తిరుమల, జూలై 2: టిటిడి నిర్వహిస్తున్న అన్నప్రసాదం ట్రస్టుకు లక్ష రూపాయలు, బర్డ్ ట్రస్టుకు లక్ష రూపాయలు, హరిటేజ్ రిజర్వేషన్ ట్రస్టుకు 3 లక్షల రూపాయల విరాళాలను టిటిడి ట్రస్టుబోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి శనివారం డిడి రూపంలో టిటిడి ఇ ఓ డాక్టర్ డి. సాంబశివరావుకు అందజేశారు.

07/03/2016 - 07:42

తిరుమల, జూలై 2: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కలకత్తాకు చెందిన ప్రకాష్ చౌదరి అనే భక్తుడు రెండు బస్సులకు విరాళంగా అందించారు. శనివారం ఉదయం శ్రీవారి ఆలయం సమీపాన ఉన్న వైభవోత్సవ మండపం వద్ద బస్సులకు సంబంధించిన తాళాలను దాత తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజుకు అందించారు.

07/03/2016 - 07:41

తిరుపతి, జూలై 2: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సౌకర్యం కోసం ఏర్పాటుచేసిన సంక్షేమ వసతి గృహాలను ప్రభుత్వం మూసివేయాలని చూస్తే పతనం తప్పదని ఎఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు పురుషోత్తం, బండి చలపతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

07/03/2016 - 07:40

తిరుపతి, జూలై 2: పాతతరం వైద్యుల అనుభవాలను నేటి యువ వైద్యులు అందిపుచ్చుకొని రోగులకు సేవలందిస్తే వృత్తికి సార్థకత చేకూరుతుందని ఐ ఎం ఎ తిరుపతి శాఖ అధ్యక్షురాలు, ప్రముఖ మధుమేహ వ్యాధి నిపుణురాలు, హర్షిత హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ కృష్ణప్రశాంతి పిలుపునిచ్చారు.

07/03/2016 - 07:40

చిత్తూరు, జూలై 2 : చిత్తూరు కోర్టు ఆవరణలో చోటు చేసుకున్న బాంబు పేలుడు ఘటనలో ఆల్-ఉమా తీవ్రవాద సంస్థ ప్రమేయం ఉందని నిర్దారణకు వచ్చిన పోలీసులు ఆ సంస్థ నాయకుడు సిద్దిక్ కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చిత్తూరు సరిహద్దులోని ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి.

07/03/2016 - 07:39

తిరుపతి, జూలై 2: ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణాలో సహకరించిన వారికి, పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు తప్పవని ఆ దిశగా చట్టాలు రూపొందించడం జరిగిందని, వీటిపై ప్రతి అధికారి అవగాహన పెంచుకోవాలని రాయలసీమ డి ఐజి ప్రభాకర్‌రావు, అర్బన్ ఎస్పీ జయలక్ష్మిలు అన్నారు.

07/03/2016 - 06:50

అనంతపురం సిటీ, జూలై 2: జిల్లాను సస్యశ్యామలంగా చేయడానికి హంద్రీనీవా ప్రాజెక్టును పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. శనివారం స్థానిక రెవిన్యూ భవన్‌లో హంద్రీనీవా పనులు పురోగతి, భూసేకరణ పనులపై హంద్రీనీవా ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

07/03/2016 - 06:49

అనంతపురం సిటీ, జూలై 2: దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఉగ్రవాదుల కదలికలు జిల్లాలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు నగరంలో శనివారం నుండి ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు తీవ్రంగా ఉన్నట్లు ఇంటిలిజెన్సీ సమాచారంతో జిల్లాలో కూడా పలుచోట్ల పోలీసులు తనిఖీలను చేపట్టారు.

07/03/2016 - 06:48

అనంతపురం, జూలై 2 : జిల్లావ్యాప్తంగా విచ్చలవిడిగా మద్యం అక్రమ విక్రయాలు, ఎమ్మార్పీకి మించి అధిక ధరలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ నిద్రమత్తులో జోగుతోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది. జిల్లాలో అనంతపురం, పెనుకొండ ఎక్సైజ్ (యూనిట్లు) ఉన్నాయి. వీటి పరిధిలో 238 మద్యం దుకాణాలు ఉన్నాయి.

Pages