S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/18/2018 - 01:56

ఆళ్లగడ్డ, నవంబర్ 17: ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం, చాగలమర్రి, కొలిమిగుండ్ల మండలాల్లో శనివారం ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 200 సర్వీసులు అక్రమమైనవిగా గుర్తించి రూ. 8.10 లక్షల జరిమానా విధించారు.

11/18/2018 - 01:56

డోన్, నవంబర్ 17: రాష్ట్భ్రావృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న దొంగల పార్టీ వైసీపీకి బుద్ధిచెప్పాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

11/18/2018 - 01:55

పెద్దకడుబూరు, నవంబర్ 17: బాలింతలు, గర్భిణులకు అందించేందుకు అంగన్‌వాడీలకు ప్రభుత్వం సరఫరా చేసే పాలల్లో నాణ్యత లోపించడం, పాడయినవి రావడంతో ఒక్కో సెంటర్ నుంచి పదుల లీటర్లలో కాలువల్లో పారేస్తున్నారు. పెద్దకడుబూరులోని అంగన్‌వాడీ నెంబర్-3లో ఇలా పాడయిన పాలను శనివారం కాలువలో పారబోశారు. పెద్దకడుబూరు మండలంలోని అంగన్‌వాడీలకు విజయ వజ్రా పాలు సరఫరా అవుతున్నాయి.

11/18/2018 - 01:54

రాజమహేంద్రవరం, నవంబర్ 17: పోలవరం భూసేకరణలో నిర్వాసితులకు భూమికి భూమిగా కేటాయించాల్సిన భూసేకరణ అతీగతీ లేకుండా పోయంది. భూసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పోలవరం ప్రాజెక్టు కుడివైపు నిర్వాసితులకు భూమికి భూమి కేటాయింపు పూర్తయినప్పటికీ ఎడమవైపు నిర్వాసితులకు ఇంకా భూమికి భూమి కేటాయింపు ప్రక్రియ మాత్రం పూర్తి మందగమనంలో సాగుతోంది.

11/18/2018 - 01:54

ఖమ్మం, నవంబర్ 17: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా ఐదు నియోజకవర్గాల్లో 2014ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్నవారే ఇప్పటి ఎన్నికల్లో కూడా ప్రత్యర్థులుగానే ఉన్నారు. అయితే కొందరు నాడు ఒక పార్టీ తరపున పోటీ చేయగా నేడు మరొక పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఒక నియోజకవర్గంలో మాత్రం నాటి అభ్యర్థి కుమారుడు బరిలో నిలిచారు.

11/18/2018 - 01:53

కల్లూరు, నవంబర్ 17: ప్రతి ఒక్కరూ చిట్కాలు పాటించి మీ ఆరోగ్యంతో పాటు ఇంటిలోని కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను కాపాడుకుంటూ హాయిగా జీవించండంటూ ప్రకృతి వైద్యులు సిద్ధార్థ యోగ విద్యాలయం డాక్టర్ కెయూ రామచంద్రరావు పేర్కొన్నారు.

11/18/2018 - 05:35

అమరావతి, నవంబర్ 17: రాజధాని అమరావతిలో హైకోర్టు భవనాల నిర్మాణం నిర్ణీత గడువులోగా పూర్తవుతుందని హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ తొట్టత్తిల్ బి రాధాకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భవన నిర్మాణాలు పూర్తయి, నోటిఫికేషన్ వెలువడిన అనంతరం రాష్ట్రానికి హైకోర్టును తరలిస్తామన్నారు.

11/18/2018 - 01:52

గార్ల, నవంబర్ 17: పాలక విధానాల వల్ల సమస్యలతో సతమతమవుతున్న ప్రజా పోరాటాలకు మద్దతునిచ్చే పార్టీలకే ఈ ఎన్నికల్లో సహకారం అందించాలని న్యూడెమోక్రసి మహబూబాబాద్ జిల్లా నాయకుడు జి సక్రు కోరారు.

11/18/2018 - 01:52

నేలకొండపల్లి, నవంబర్ 17: నియోజకవర్గంలోని అన్ని మండలాలలో భారతీయ జానత పార్టీ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తుంది. పోలింగ్ బూత్ వారిగా జిజెపి పార్టీ గెలిపించాలని పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి మోడీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు.

11/18/2018 - 01:51

గుంటూరు, నవంబర్ 17: రాష్ట్రంపై స్వైన్ ఫ్లూ పంజా విసిరింది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో వైద్యారోగ్య శాఖ అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే గుంటూరు, కర్నూలు జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ వైరస్ ఎక్కువగా విజృంభించింది.

Pages