S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/20/2019 - 04:08

తిరుపతి, మార్చి 19: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాల్లో నాల్గవ రోజైన మంగళవారం రాత్రి కోనేటిరాయుడు శ్రీదేవి, భూదేవీ సమేతుడై పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉభయ దేవేరులతో కలిసి తిరువీధుల్లో ఊరేగుతూ పుష్కరిణి వద్దకు చేరుకున్న మలయప్ప స్వామివారు వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై కొలువుదీరారు.

03/20/2019 - 04:06

ఖానాపూర్‌రూరల్, మార్చి 19: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ నుండి 29 రాష్ట్రాలలో ఓ ప్రత్యేకమైన రాష్ట్రంగా అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

03/20/2019 - 04:05

హైదరాబాద్, మార్చి 19: దేశంలో నగదు సమతుల్యతను సాధించడం ఆర్‌బీఐ ముందుండే అతి పెద్ద సవాల్ అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు.

03/20/2019 - 04:02

విశాఖపట్నం, మార్చి 19: విశాఖ జిల్లా రాజకీయాల్లో ఈ సారి అన్నీ సంచలనాలే. పార్టీలో చేరకుండానే టికెట్ దక్కించుకుని పోటీకి సిద్ధమైన నేత ఒకరితే, పార్టీ టికెట్ ఖరారు చేసిన తరువాత, పార్టీ కండువా మార్చేసిన అభ్యర్థి మరొకరు. ఇక పార్టీ మారిన 24 గంటల్లోనే టికెట్ ఖరారు చేసుకుని దర్జాగా ప్రచారం మొదలుపెట్టిన నేత మరొకరు.

03/20/2019 - 04:01

ముంబయి, మార్చి 19: భారత్‌లోని వృత్తి నిపుణుల్లో 66 శాతం మంది తమకు వారానికి నాలుగు రోజుల పని దినాలను కల్పిస్తే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా అభిరుచులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇటీవల నిర్వహించిన తాజా సర్వేలో పేర్కొన్నారు.

03/20/2019 - 04:01

ముంబయి, మార్చి 19: తీవ్రమయిన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో మంగళవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

03/20/2019 - 04:00

న్యూఢిల్లీ, మార్చి 19: దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమవుతున్నుట్ల, గణాంక వివరాలు తప్పుడు తడకలంటూ 108 మంది ఆర్థిక నిపుణులు సంతకాలతో కూడిన వినతిపత్రం ద్వారా బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. ఈ తరహా వినతిపత్రాల వెనక రాజకీయ పార్టీలు ఉంటాయన్నారు. ఈ పార్టీలే ఈ వినతిపత్రాలను తయారు చేసి నిపుణులనే వారిచేత సంతకాలు చేయిస్తుంటారన్నారు.

03/20/2019 - 03:59

న్యూఢిల్లీ, మార్చి 19: జమ్మూకాశ్మీర్‌లో నిషేధిత పాక్ హిజ్‌బుల్ ముజాహిద్దీన్, సయ్యద్ సలాఉద్దీన్ అనే ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్న కేసుకు సంబంధించి బండిపురాకు చెందిన మహమ్మద్ షఫీ షాతోపాటు మరో ఆరుగురు స్థానికులకు చెందిన 13 ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.

03/20/2019 - 03:58

భూదాన్‌పోచంపల్లి, మార్చి 19: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని రాంనగర్‌కు చెందిన చెరుపల్లి లలిత (72) మంగళవారం స్వగృహంలో అనారోగ్యంతో బాధపడుతూ బాత్‌రూంలో పడి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి మృతి చెందిన వార్త కుటుంబ సభ్యులతో సమాచారం అందుకున్న పెద్ద కుమారుడు చెరుపల్లి సురేందర్ (53) ఫొటోగ్రాఫర్ వనస్థలిపురం నుండి కుటుంబ సభ్యులతో వెంటనే పోచంపల్లికి వచ్చాడు.

03/20/2019 - 03:45

పనాజీ, మార్చి 19: గోవా కొత్త ముఖ్యమంత్రిగా మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాణస్వీకారం చేసిన ప్రమోద్ సావంత్ బుధవారం అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధపడుతున్నారు. మనోహర్ పారికర్ మృతితో బీజేపీ అధిష్ఠానం సావంత్‌ను ఎంపిక చేసింది. తీవ్ర రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో సావంత్ ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. శాసన సభ్యలో తమకు 21 మంది ఎమ్మెల్యేలున్నారని బీజేపీ చెబుతోంది.

Pages