S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/23/2019 - 20:12

నల్లగొండ, మే 23: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలైన నల్లగొండ, భువనగిరి స్థానాల్లో పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన పట్టును తిరిగి సాధించినట్టయ్యింది.

05/23/2019 - 19:50

ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మోదీ మార్కు విజయం మళ్లీ సాకారమైంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ సహా అనేక కఠిన నిర్ణయాలు జన బాహుళ్యాన్ని ఇబ్బందులకు గురిచేసినా మళ్లీ జయహో మోదీ అంటూ ఆయనకే పట్టం కట్టారు. ఒకే ఒక్కడుగా ఇటు బీజేపీని దేశవ్యాప్తంగా ముందుకు నడిపించడమే కాదు, దాని విజయాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని అజేయమైన రీతిలో అపూర్వమైన విజయానే్న సాధించిపెట్టారు.

05/23/2019 - 19:48

రాజకీయ నాయకుడికి ప్రధానంగా కావల్సింది పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోగలికే సహనశీలత. ఆంధ్రప్రదేశ్‌లో అద్వితీయమైన విజయాన్ని ఇటు లోక్‌సభ ఎన్నికల్లోనూ అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి సాధించగలిగారంటే అందుకు కారణం గత పదేళ్లుగా ఆయన తన రాజకీయ బాటను పటిష్టమైన రీతిలో వ్యూహాత్మకంగా తీర్చిదిద్దుకోవడమే.

05/23/2019 - 19:46

శతాధిక వత్సరాల కాంగ్రెస్ పార్టీకి అతి పిన్న వయస్కుడిగా అధ్యక్ష బాధ్యతలు అందిపుచ్చుకున్న రాహుల్ గాంధీ మ్యాజిక్ ఏదీ లోక్‌సభ ఎన్నికల్లో పనిచేయలేదు. ప్రధాని నరేంద్రమోదీకి ఏకైక బలమైన ప్రత్యర్థిగా జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుకునేందుకు రాహుల్ విసిరిన మహాఘట్ బంధం పాచికలు పారలేదు. కాంగ్రెస్ సారధ్యంలోని ఈ కూటమితో చేతులు కలిపిన ప్రాంతీయ పార్టీలన్నింటికీ మోదీ ప్రభంజనం ముచ్చెమటలు పోయించింది.

05/23/2019 - 19:44

రాజకీయ వ్యూహకర్త, ఎదుటి వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తుచేయగలిగే రాజకీయ చాణక్యం ఆయన సొంతం. ఎలాంటి రాజకీయ సవాల్‌నైనా ఆనుపానులు తెలుసుకుని పరిష్కరించగలి నేర్పరితనం కూడా చంద్రబాబుదే. రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైబడిన అనుభవం ఎన్టీఆర్ అనంతరం తెలుగుదేశం అంటే చంద్రబాబే అన్న బలమైన నమ్మకం ఆ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ విభజన అనంతర ఏపీలోనూ ఇన్నాళ్లూ నిలబెట్టింది.

05/23/2019 - 16:54

అమరావతి:ఏపీలో అధికార పార్టీకి ఓటమి తప్పలేదు. విపక్ష పార్టీ వైకాపా దాదాపు 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, తెలుగుదేశం ముప్పయి స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. కాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుప్పంలో గెలుపొందారు. కాగా ఈసారి చంద్రబాబు మెజార్టీ తగ్గిందనే చెప్పవచ్చు. ఆయన గత ఎన్నికల్లో 47121 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా.. ఈసారి కేవలం 28 వేల మెజార్టీతో గెలిచారు.

05/23/2019 - 16:22

అమృతసర్: పంజాబ్‌లో కాంగ్రెస్ మోదీ ప్రభంజనానికి కాస్తంత అడ్డుకట్టపడింది. ఇక్కడ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని 2014 ఎన్నికల బరిలో దిగిన ఆప్ పోటీ నామమాత్రమైంది. గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ+అకాలీదళ్ కూటమి మధ్య ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ స్పష్టమైంది.

05/23/2019 - 16:19

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జయభేరీ మోగించింది. ఇక్కడ ఏడు లోకసభ స్థానాలు ఉండగా అన్నింటా బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతూ విజయయాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీ ఆప్ చతికలపడింది. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సైతం ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మాత్రమే కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చి రెండవ స్థానంలో నిలచింది.

05/23/2019 - 14:04

భోపాల్:్భపాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ వౌనం వీడి ఇంటి నుంచి బయటకు వచ్చి తన ఆధిక్యాన్ని కార్యకర్తలతో పంచుకున్నారు. మహాత్మాగాంధీపైన, అయోధ్య అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఈసీ చేత చివాట్లు తిన్న ప్రజ్ఞాసింగ్ వౌనవ్రతాన్ని పాటిస్తున్నారు.

05/23/2019 - 14:01

ముంబయి: దేశంలో సుస్థిరమైన ప్రభుత్వానిక సంకేతాలు వెలువడటంతో స్టాక్ మార్కెట్లు సైతం కనీవినీ ఎరుగని స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే నిఫ్టీ 20 వేల మార్క్‌ను, సెనె్సక్స్ 40 వేల మార్కును దాటేసాయి. నిఫ్టీ 270 పాయింట్ల లాభంతో 12,008 వద్ద, సెన్సెక్స్‌ 909 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 40,020 వద్ద ట్రేడవుతోంది.

Pages