S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 06:38

ఆ రాత్రి అకస్మాత్తుగా నా కాటేజ్ బయట అడుగుల చప్పుడు వినిపించింది. నేను తలుపు తెరచి చూస్తే అందులోంచి దిగిన ముగ్గురు కనిపించారు. ఆ అపరిచితులు నా కాటేజ్‌కి ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు.
‘మేము ఈ రాత్రికి మీ అతిథులం’ వారు లోపలికి వచ్చాక బాస్‌లా కనిపించే వ్యక్తి చెప్పాడు.
మాటల్లో వారిలోని ఒకరి పేరు హేంక్స్ అని నాకు తెలిసింది. మిగిలిన ఇద్దరి పేర్లు తెలీలేదు.

12/04/2016 - 06:29

ఉన్న స్థితిలో ఉండలేకపోవటం - ఉన్నత స్థితికి చేరుకోవాలన్న ప్రయత్నం - ఈ రెండింటి నడుమా కోరికలతో పరితపించటం.. ఇదీ సంసార జంఝాటం - ఇదే జీవన చక్రం.. జీవన యానం.

12/04/2016 - 06:28

మనుషులయినా దేవతలయినా అందరం పరమాత్మ సృష్టిలో భాగం. మనం అహంకరిస్తే అది మనకే ప్రమాదం. దీనికి ఎవరూ మినహాయింపు కారు. దేవతలు రాక్షసుల్ని యుద్ధంలో జయించారు. అదంతా తమ ప్రతాపంవల్లనే అని వాళ్లు విర్రవీగారు. అది పరమాత్ముని కృప వల్ల జరిగిందని వాళ్లు అనుకోలేదు. అదంతా స్వయంశక్తి వల్లనే సాధ్యమయిందని, సృష్టిలో తమని మించిన శక్తిసంపన్నులు ఎవరూ లేరని గర్వించారు.

12/04/2016 - 06:21

ఒంటె జాతికి చెందిన ఈ ‘యామా’లు చూడటానికి చాలా ముచ్చటగా ఉండాయి. దక్షిణ అమెరికాకు చెందిన ఇవి బలిష్టమైన జంతువులు. మన దేశాల్లో గాడిదల్లా బరువు మోయడంలో ఇవి పేరుపొందాయి. కానీ అవి మోయలేనంత బరువు వేసినా, వాటికి నచ్చకపోయినా ఒక్క అడుగుకూడా ముందుకు వేయవు. కొంచెం అయినా వాటిమీద వేసిన వస్తువులు తొలగిస్తేనే అది అడుగుకదుపుతుందట. ఇవి ఒంటెల జాతికి చెందినవే అయినా మూపురాలు ఉండవు.

12/04/2016 - 06:19

ప్లాటిపస్ పేరు అందరికీ తెలిసిందే. టాస్మేనియా, తూర్పు ఆస్ట్రేలియాల్లో కన్పించే ఇవి బాతు, ఒట్టర్, బీవర్ జంతువుల పోలికలతో ఉంటాయి. బాతులాంటి ముక్కు, కాళ్లు, బీవర్‌లా తోక, ఒట్టర్‌లా శరీరం వీటి ప్రత్యేకత. ముందుకాళ్లతో ఈదుతూ, తోకను స్టీరింగ్‌లా ఉపయోగించడం వీటి ప్రత్యేకత. వీటి వెనకకాళ్ల కింద ఉండే ముళ్లవంటి భాగంతో శత్రువులను కాటువేయడం వీటికి ఉన్న రక్షణ వ్యవస్థలో ఓ చర్య.

12/04/2016 - 06:17

‘రోడెంట్’ వర్గానికి చెందిన జీవుల్లో ‘బీవర్’ అతి పెద్దది. దాదాపు 30 కేజీల బరువు వరకు పెరిగే ఇవి 25 ఏళ్లపాటు జీవిస్తాయి. యురేషియా, ఉత్తర అమెరికా దేశాల్లో ఇవి కనిపిస్తాయి. తెడ్డులాంటి తోక వీటికి ప్రత్యేకం. నీళ్ల లోపల పావుగంటపాటు గడపగలగడం వీటి స్పెషాలిటీ. అవి జీవించి ఉన్నంతకాలం పెరిగే బలమైన దంతాలు వాటి ఆయుధాలు.

12/04/2016 - 06:14

1670 ప్రాంతంలో జర్మనీ తత్వవేత్త, గణిత శాస్తజ్ఞ్రుడు గాట్ ఫ్రయెడ్ విల్హెమ్ లీల్నజ్ సాధించిన వాటిలో కేలిక్యులస్ ఆవిష్కరణ ఒకటి. గణితం, లాజిక్, సైన్సులలో సాధించిన ప్రగతి హెచ్చించటం, కూడటం చేయగలిగిన, సంఖ్యా గణితానికి ఉపయోగపడే మెషీన్ ఆవిష్కరణకు ఇది తావిచ్చింది. ఇంతేకాకుండా లీబ్నిజ్, తను కనుగొన్న మెషీన్‌ను బైనరీ పద్ధతి లెక్కలను ఉపయోగించే విధంగా ఎలా మార్పుచేయాలో కూడా తెలుసుకోవడం జరిగింది.

12/04/2016 - 06:11

న్యూటన్ సార్వత్రిక గురుత్వాకర్షణ సూత్రాల ప్రకారం ఈ విశ్వంలోని ప్రతి భారీ రేణువు మరో భారీ రేణువు చేత ఆకర్షింపబడుతుంది. ఈ ఆకర్షణ వాటి ద్రవ్యరాశితో అనులోమంగా, వాటి మధ్య దూరపు స్కైర్‌కు విలోమంగా సంబంధం కలిగి ఉంటుంది. ఈ సంబంధం అన్ని సమయాలు, అన్ని ప్రదేశాలకు వర్తిస్తుంది. అందువల్ల ఇది సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంశంగా గుర్తింపు పొందింది.

12/04/2016 - 06:09

ఆదివారం కావటంవల్ల ఉదయం ఏడైనా ఇంకా మంచం దిగలేదు శివ.
శివ ఏడవ తరగతి విద్యార్థి. వారమంతా త్వరగా లేవటం, స్కూలు, ట్యూషన్, డాన్స్ క్లాసెస్ అంటూ ఎప్పుడూ బిజీగా ఉండటంవల్ల ‘లే స్కూల్ బస్ వచ్చేస్తుంది’ అన్న కేకలు వినిపించలేదన్న ఆనందంతో రంగురంగుల కలలు కంటూ నిద్రపోతున్నాడు.
‘శివా.. ఊర్నుంచీ మనింటికి ఎవరొచ్చారో చూడు’ అన్న పిలుపు హాల్లో నుంచి వినిపించి దిగ్గున మేలుకున్నాడు.

12/04/2016 - 06:06

గోపీ తన పుట్టినరోజుకి అక్క జ్యోతితో బజారుకు వెళ్లి 60 పెన్సిల్స్, 100 డ్రాయింగ్ షీట్స్, 40 పెన్నులు, పెయింటింగ్స్‌లో గెలిచిన వారికి ఇవ్వటానికి 45 రూపాయలతో 6 గిఫ్ట్స్ కొన్నారు. కొన్ని కలిపి వాళ్ల నాన్న ఇచ్చిన 300 రూపాయలు సరిపోయినాయి. పెన్సిల్ ఖరీదు డ్రాయింగ్ షీట్‌కి రెట్టింపు, పెన్ను ఖరీదు పెన్సిల్‌కి ఒకటిన్నర రెట్లు ఎక్కువ. అయితే ఒక్కొక్క పెన్సిల్, డ్రాయింగ్ షీట్, పెన్ను ఖరీదు ఎంత?

Pages