S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 05:10

జకార్తా, డిసెంబర్ 3: ఇండోనేసియా పోలీసు విమానం గల్లంతైంది. 16 మందితో వెళ్తున్న విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ఇండోనేసియాలో ఇది చోటుచేసుకుంది. ఎం28 స్కైట్రక్ చిన్న విమానం శనివారం మధ్యాహ్నం 1.50 గంటల నుంచి ఎయిల్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి)తో సంబంధాలు తెగిపోయాయి. గల్లంతైన విమానం కూలిపోయి ఉంటుందన్న భయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

12/04/2016 - 05:10

హైదరాబాద్, డిసెంబర్ 3: విత్తన నమూనా, అంకురోత్పత్తిపై ఐదురోజుల ప్రత్యేక వర్క్‌షాప్ ఈ నెల ఐదున హైదరాబాద్‌లోని పార్క్‌హోటల్‌లో నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. శనివారం ఇక్కడ అధికారిక ప్రకటన చేస్తూ, తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ ప్రమాణాల పరీక్ష అసోసియేషన్ (ఇస్తా) ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు వివరించారు.

12/04/2016 - 05:09

రేణిగుంట, డిసెంబర్ 3: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరను శనివారం ఐటి శాఖ అధికారులు సోదా చేశారు. శనివారం ఆమె ఆరుగురు కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి దర్శనార్థం స్పైస్‌జెట్‌లో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈసందర్బంగా ఐటి శాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి బాలకృష్ణ సతీమణి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేశారు.

12/04/2016 - 05:01

చౌటుప్పల్, డిసెంబర్ 3: అమెరికాలో స్థిరపడిన ప్రవాసభారతీయుడు దీపక్‌కాంత్ వ్యాస్‌కు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేసేందుకు కొంతమంది కనే్నశారు. నకిలీ పత్రాలు తయారు చేసి రికార్డులను మార్చివేసి వెంచర్ వేసేందుకు పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న దీపక్‌కాంత్ వ్యాస్ ఇక్కడి చేరుకొని ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది.

12/04/2016 - 04:58

శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణంతో దక్షిణ భారత కర్ణాటక సంగీత స్వర ధ్వజస్తంభం స్వర్గారోహణం అయింది.
అటువంటి గంధర్వ గాయకుడిని తయారుచేసి మరల భూమి మీద ప్రతిష్ఠించటానికి ప్రకృతికి కొన్ని వేల సంవత్సరాల సమయం అవసరం అవుతుంది. నేటి నుంచి ఇంధ్రసభలో స్వర సంగీత సమ్మేళనం అవిరళంగా స్రవిస్తుంది.

12/04/2016 - 04:56

ఏ కారణం లేకుండా ఈ భూమీద ఎవరి పేరూ శాశ్వతంగా నిలిచిపోదు. పువ్వు పుట్టగానే పరిమళించడం సహజం. భగవంతుడు కొందరికి కొన్ని విభూతులను ప్రసాదించి, వాళ్లల్లో ‘తనను’ చూసుకోమంటాడు.
డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈ కోవకు చెందిన గాయకుడు. కిందటి శతాబ్దపు అయిదో దశకు తెలుగుదేశానికి మరపురాని దశకు కారణం అప్పటి ఆకాశవాణి సంగీత వైభవం.

12/04/2016 - 04:56

నల్లగొండ, డిసెంబర్ 3: పెద్ధనోట్ల రద్ధు పిదప శనివారం తెల్లవారుజాము నుండి మళ్లీ టోల్ టాక్స్ వసూళ్లు చేస్తుండటంతో వాహనాదారులకు మళ్లీ ‘చిల్లర’ కష్టాలు మొదలయ్యాయ. దీంతో టోల్ ప్లాజాల వద్ధ పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. తొలిసారిగా స్వైప్ మిషన్లు వాడినా, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టోల్‌టాక్స్ చెల్లింపులు ప్రవేశపెట్టినా టోల్‌ఫ్లాజాల వద్ధ సమస్యలు మాత్రం తీరలేదు.

12/04/2016 - 04:54

నల్లగొండ, డిసెంబర్ 3: నాగార్జున సాగర్ ఎడమకాలువకు డిసెంబర్ 1నుండి నీటి విడుదల చేస్తామంటు తెలంగాణ ప్రభుత్వం ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డు నుండి అనుమతి లభించకపోవడంతో నీటి విడుదలపై ప్రతిష్టంభన నెలకొంది.

12/04/2016 - 04:51

భద్రాచలం, డిసెంబర్ 3: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పిఎల్‌జిఏ వారోత్సవాలు హింసాత్మకంగా మారాయి. నక్సల్స్ వారోత్సవాలు విజయవంతం చేయాలంటూ కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేసి వాటి కింద ప్రెషర్ బాంబులు పెడుతున్నారు.

12/04/2016 - 04:49

వరంగల్, డిసెంబర్ 3: జిల్లాలలో పాలనావ్యవహారాలు సజావుగా సాగేందుకు, సమస్యలు సత్వరంగా పరిష్కరించేందుకోసం రెవెన్యూ అధికారులకు 15 రోజుల్లో ల్యాప్‌టాప్‌లు అందచేస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. అదే విధంగా రాష్టవ్య్రాప్తంగా తహశీల్ధార్లకు వాహన సదుపాయం కల్పించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు.

Pages