S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 04:04

తిరుపతి, డిసెంబర్ 3: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన శనివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు విశేష అలంకరణ భూషితురాలై రథాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఓవైపు వర్షం కురుస్తున్నా భక్తులు గోవిందనామ స్మరణచేస్తూ రథాన్ని ముందుకు లాగి తమ భక్తిని చాటుకున్నారు.

12/04/2016 - 04:01

భద్రాచలం, డిసెంబర్ 3: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పిఎల్‌జిఏ వారోత్సవాలు హింసాత్మకంగా మారాయి. నక్సల్స్ వారోత్సవాలు విజయవంతం చేయాలంటూ కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేసి వాటి కింద ప్రెషర్ బాంబులు పెడుతున్నారు.

12/04/2016 - 06:01

హార్ట్ ఆఫ్ ఆసియా కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి శనివారం రాత్రి అమృత్‌సర్ వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనితో కలిసి స్వర్ణదేవాలయం సందర్శించారు. ఆలయ భోజన శాలలో స్వయంగా గరిట పట్టుకుని వడ్డించారు. ఆదివారం అమృత్‌సర్‌లో ఈ సదస్సు జరగనుంది. పాకిస్తాన్ నుంచి ఆ దేశ ప్రధాని విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ పాల్గొంటున్నారు.

12/04/2016 - 04:01

తిరుపతి, డిసెంబర్ 3: తమ బంగారు భవిష్యత్తు ఏమిటంటూ మహిళామణులు ప్రభుత్వ తీరుపై కనె్నర్ర చేశారు. శనివారం తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద వైకాపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా మహిళామణులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా మహిళలు నిరసన వ్యక్తం చేశారు.

12/04/2016 - 04:00

శ్రీకాకుళం, డిసెంబర్ 3: గిరిజనుల సాంప్రదాయాలు, సంస్కృతి, అస్తిత్వాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథ్ పిలుపునిచ్చారు.

12/04/2016 - 03:59

కర్నూలు, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం, బ్యాంకులు, ఎటిఎంలలో నగదు కొరత నేపధ్యంలో ఆన్‌లైన్ కొనుగోళ్లకు సిద్ధపడిన ప్రజలకు బ్యాంకు సర్వర్లు చుక్కలు చూపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువుల బిల్లుల చెల్లింపులకే కాకుండా దుకాణాల్లో కొనుగోళ్ల అనంతరం స్వైపింగ్ యంత్రాల ద్వారా బిల్లు చెల్లిద్దామంటే అవి కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది.

12/04/2016 - 03:59

శ్రీకాళహస్తి, డిసెంబర్ 3: కొత్త నోట్లు, చిల్లరకోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బ్యాంకులు, ఎటిఎంలలో నగదు నిల్వలు శనివారం నుంచి లేవు. జిల్లాకు శుక్రవారం 109 కోట్ల రూపాయల మేర నగదు రావడంతో శనివారం బ్యాంకుల నిండా జనమే. ఈ సందర్భంగా పట్టణంలోని సన్నిధివీధిలో ఉన్న భారతీయ స్టేట్‌బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద తోపులాట జరిగింది. దీంతో బ్యాంక్ ద్వారం అద్దాలు పగిలిపోయాయి.

12/04/2016 - 03:58

విశాఖపట్నం, డిసెంబర్ 3: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌కి సమీపంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. రెండు రోజుల అనంతరం కాస్త బలపడి వాయుగుండంగా మారుతుందని అంచనావేస్తున్నారు. ఇది మరింత బలపడి తుపానుగా ఉధృతం అవుతుందన్న అంచనాలు ఇప్పుడే చెప్పలేమన్నారు.

12/04/2016 - 03:58

కోరుకొండ, డిసెంబర్ 3: ఫార్మశీ రంగానికి ఉపాధి అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అసోసియేషన్ (ఐపిఎ) అధ్యక్షుడు డాక్టర్ రావ్ వడ్లమూడి తెలిపారు.

12/04/2016 - 04:25

తాడికొండ, డిసెంబర్ 3: కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో గ్రామీణ ప్రజలు అనేక కష్టనష్టాలు పడుతున్నప్పటికీ బ్యాంకు అధికారులు తమకు న్యాయం చేయడం లేదని, ప్రతిరోజూ తమ పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ నగదు సక్రమంగా అందించటం లేదంటూ మండల పరిధిలోని పొనె్నకల్లు గ్రామస్తులు శనివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, సిబ్బందిని నిర్బంధించారు.

Pages