S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 03:56

విజయవాడ, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయటంతో ప్రజలు బ్యాంకులు, ఎటిఎంల చుట్టూ కొత్త కరెన్సీ నోట్ల కోసం తిరుగుతూనే ఉన్నారు. దీనిని నివారించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వినూత్న చర్యలు తీసుకుంటున్నాయి. చర్యలతో పాటు వీసా కార్డులు, డెబిట్ కార్డులను ప్రోత్సహించేందుకు ఆన్‌లైన్ లావాదేవీలు జరిపేందుకు చర్యలు చేపట్టారు.

12/04/2016 - 03:56

ఏలూరు, డిసెంబర్ 3 : రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల కొరత నివారించడానికి అవుట్ సోర్సింగ్ పద్దతిపై త్వరలోనే 400 డాక్టర్ల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని రాష్ట్ర విధాన పరిషత్తు కమిషనర్ ఎన్ దుర్గా ప్రసాద్ చెప్పారు.

12/04/2016 - 03:55

రాజమహేంద్రవరం, డిసెంబర్ 3: తూర్పుగోదావరి జిల్లా రివర్ సిటీ రాజమహేంద్రవరం మాస్టర్ ప్లాన్‌కు ఎట్టకేలకు కౌన్సిల్ ఆమోదం లభించింది. రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన శనివారం జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో సవరించిన మాస్టర్ ప్లాన్‌కు పాలకవర్గ ప్రజా ప్రతినిధులు ఆమోద ముద్ర వేశారు.

12/04/2016 - 03:54

విజయవాడ, డిసెంబర్ 3: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీది తుగ్లక్ పాలనగా పేర్కొనడాన్ని భారతీయ యువ మోర్ఛా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.రమేష్‌నాయుడు తీవ్రంగా ఖండించారు. ఒకపక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరోపక్క ఆ పార్టీ నాయకులు విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు.

12/04/2016 - 03:53

హైదరాబాద్, డిసెంబర్ 3: ఒక మహిళ నివసిస్తున్న ఇంటిని కూల్చివేసినందుకు ఒక లక్ష రూపాయలను నష్టపరిహారంగా ఆమెకు చెల్లించాలని హైకోర్టు విజయనగరం మున్సిపాలిటీని ఆదేశించింది. ఈ తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు వెలువరించారు. విజయనగరం మున్సిపాలిటీలో పూల్‌బాగ్ రోడ్డులో ఉంటున్న ఎం శ్రీదేవి అనే మహిళ తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

12/04/2016 - 03:52

అహమ్మదాబాద్, డిసెంబర్ 3: నల్లధనం స్వచ్ఛంద వెల్లడి పథకంలో రూ.13,860 కోట్లు వెల్లడించిన ప్రాపర్టీ డీలర్ మహేశ్ షా శనివారం నాటకీయ పరిణామాలలో లొంగిపోయారు. ఐటి అధికారులు మహేశ్ షా ఇంటిపై దాడులు చేయటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావటంతో ఓ గుజరాతీ చానల్ లైవ్ షోలో నేరుగా ప్రత్యక్షమై లొంగిపోయారు.

12/04/2016 - 03:51

హైదరాబాద్, డిసెంబర్ 3: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి జిల్లాలో నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తున్న 15 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 8 లక్షల నగదు, పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. బీబీనగర్ మండలం రాఘవపురంలో వ్యాస్ అనే ఎన్‌ఆర్‌ఐకి చెందిన 24 ఎకరాల స్థలంపై కొందరి కన్నుపడింది.

12/04/2016 - 03:50

నెల్లూరు, డిసెంబర్ 3: రెండు నెలలుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను త్వరలోనే డిస్‌చార్జ్ చేసే అవకాశం ఉందని అపోలో ఆసుపత్రి వైస్ చైర్మన్ ప్రీతారెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. జయలలితను ఒక ప్రత్యేక వైద్యబృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఆమె కూడా వైద్యసేవలకు బాగా స్పందిస్తున్నారని తెలిపారు.

12/04/2016 - 03:49

కాకినాడ, డిసెంబరు 3: డిసెంబరు నెలాఖరుకు అన్ని రకాల ఆర్ధిక లావాదేవీలనూ నగదు రహితంగా నిర్వహించేందుకు తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ సన్నాహాలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు.

12/04/2016 - 03:48

అనంతపురం సిటీ, డిసెంబర్ 3: పెద్దనోట్లు రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. బంగారం జోలికొస్తే మహిళలు తిరగబడతారని, పరకలతో తరిమికొడతారని హెచ్చరించారు. నోట్ల రద్దు, బంగారం లెక్కలపై జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్వహిస్తామన్నారు.

Pages