S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 23:53

ముకరంపుర (కరీంనగర్), ఆగస్టు 4: కనీస వేతనాలు అమలు చేయాలంటూ ఆందోళన చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థల బస్ డ్రైవర్ల చర్చలు విఫలమవడంతో శుక్రవారం నుండి సమ్మెకు దిగుతున్నట్లు కరీంనగర్ ప్రైవేటు స్కూల్స్, కాలేజి వ్యాన్స్ డ్రైవర్స్ అండ్ హెల్పర్స్ నాయకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

08/04/2016 - 23:51

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 4: భ్రూణహత్యలకు పాల్పడ్డ ఎలాంటి వారైనప్పటికి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ భానుప్రసాద్‌నాయక్ తెలిపారు.

08/04/2016 - 23:51

నల్లగొండ రూరల్, ఆగస్టు 4 : తెలంగాణ హరితహారం లక్ష్యాలను అధికారులు అధిగమించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ సి ఎం కార్యాలయానికి హరితహారం వివరాలు రోజువారిగా నిర్వహిస్తున్నామని తెలిపారు. డివిజన్ అధికారులు గ్రామస్ధాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్రతి గ్రామ పంచాయితీకి 40వేల మొక్కలు నాటాలని సూచించారు.

08/04/2016 - 23:50

నల్లగొండ రూరల్, ఆగస్టు 4: బిజెపి జిల్లా శ్రేణులు గురువారం జిల్లా కేంద్రంలో భారీ మోటార్ సైకిల్, కార్ల ర్యాలీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు స్వాగతం పలుకుతు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొని పట్టణ వీధులగుండా ప్రదర్శనగా సాగారు.

08/04/2016 - 23:50

నల్లగొండ, ఆగస్టు 4 : పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్ధాపకురాలు కల్వకుంట్ల కవిత రేపు, ఎల్లుండి రెండురోజుల పాటు జిల్లాలో జరుగబోయే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. నేడు శుక్రవారం రోజున ఉదయం 8 గంటలకు చౌటుప్పల్ ఆంథోని మైసమ్మ దేవాలయంలో పూజలు చేసి, చౌటుప్పల్ టెక్స్‌టైల్ పార్కును సందర్శిస్తారు. తరువాత నల్లగొండలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు.

08/04/2016 - 23:49

సూర్యాపేట, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్‌లల్లో భారీ సంఖ్యలో మొక్కలు నాటి హరిత మార్కెట్‌లుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్న రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. గురువారం పట్టణంలోని నూతన వ్యవసాయ మార్కెట్‌యార్డును సందర్శించి మొక్కలు నాటారు.

08/04/2016 - 23:48

నల్లగొండ, ఆగస్టు 4: ప్రజాకర్షణ హామీలతో మాటల గారడితో తెలంగాణ సెంటిమెంట్ బాసటతో ఎన్నికల్లో గెలిచి గద్దె నెక్కిన సీఎం కెసిఆర్ ప్రభుత్వం పాలనా వైఫల్యాలపై బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నుండి ఉద్యమాలు ఉదృతం చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రకటించారు.

08/04/2016 - 23:45

ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయాలే..నవ్యాంధ్రలో కూడా కొనసాగుతున్నాయి. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడి సాగునీటి వనరులను మెరుగుపరిచి భూమిని సాగులోకి తేవాలి. అయితే వెనుకబడిన ఉత్తరాంధ్రలో సాగునీటి రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైం ది.

08/04/2016 - 23:43

చోదకుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, నిమగ్నతా రాహిత్యం వల్ల కావచ్చు, నిరంతరం పొంచివున్న బీభత్స పిశాచాల దాడుల వల్ల కావచ్చు. విధి వికటించడం వల్ల కావచ్చు...వాహనాలు కూలిపోతున్నాయి, వాహనాలు పేలిపోతున్నాయి, వాహనాలు కాలిపోతున్నాయి. ఢీకొట్టి ప్రాణాలు తీస్తున్నాయి. నదులలోపడి కొట్టుకుపోతున్నాయి. సముద్రాలలో మునిగిపోతున్నాయి.

08/04/2016 - 23:41

అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం అనే శీర్షికతో అన్నమయ్య కీర్తనలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌వారు ప్రసారం చేస్తున్నారు. అయితే ఆ పాటలు వారు (పాడేవారు) తేటగా పాడలేకపోతున్నారనిపిస్తున్నది. ఎందుకంటే ఆ గాయనీ గాయకులంతా, వారి అభ్యసనమంతా సినీ గీతాల ఆలాపనతోనే జరిగింది. అందువల్లనే స్పష్టత లోపించింది. లేదా వారికి ఈ సాహిత్య పదాలు (600 సం.నాటివి కదా) అపరిచితాలు అయి వుండవచ్చు.

Pages