S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2016 - 06:00

ఒబామా అందగాడు.. చతురుడు! వైట్‌హౌస్‌లో అరుదైన విందుకు హాజరైన అనంతరం బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా
వ్యాఖ్యలివి..ప్రపంచ ప్రముఖులెందరో హాజరైన ఈ విందులో ఒబామా దంపతులతో ప్రియాంక ఛాయాచిత్రమిది.

05/02/2016 - 06:01

సోలార్ విద్యుత్‌తో నడిచే ఈ-బోట్‌ను ఆదివారం వారణాసిలో ప్రారంభించిన ప్రధాని మోదీ అందులోనే ప్రయాణిస్తున్న దృశ్యం

05/02/2016 - 05:55

సిమ్లా/ డెహ్రాడూన్, మే 1: ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్న దావానలం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌ను అంటుకుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో అడవులు తగుల బడటంతో వేలాది హెక్టార్లు నాశనం కావడంతో..ఆ మంటలను అదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగిన నేపథ్యంలో ఇప్పటికే హిమాచల్ రాజధాని సిమ్లాలో 50వేల హెక్టార్ల అటవీ భూమి అంటుకు పోయింది.

05/02/2016 - 05:52

విజయవాడ, మే 1: రాష్ట్భ్రావృద్ధిలో ఎంతో కీలకమైన పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం ఇటు కార్మికులు, అటు యాజమాన్యాల మధ్య వారధిగా నిలవటమే గాక కార్మికులకు అన్యాయం జరుగకుండా బాధ్యత తీసుకునే పరిశ్రమల యాజమాన్యానికి అండగా నిలుస్తానం టూ ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. అలాగే తమకు ఉపాధి చూపుతున్న యాజమాన్యాల పేరు ప్రతిష్టలను పెంచే విధంగా కార్మికులు నడుచుకోవాలని పిలుపునిచ్చారు.

05/02/2016 - 05:50

అనకాపల్లి, మే 1: విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలో కిడ్నాప్‌కు గురైన బాలుడు కొణతాల ఉదయ్ (8) హత్యకు గురయ్యాడు. బాలుడి మృతదేహాన్ని ఏలేరు కాలవ గట్టు పొదల్లో పోలీసులు ఆదివారం గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించగా, బాలుని దుస్తుల ఆధారంగా ఉదయ్ మృతదేహాన్ని గుర్తించారు. గత శుక్రవారం గుర్తు తెలియని కొంతమంది ఉదయ్‌ను కిడ్నాప్ చేసినట్టు తండ్రి శ్రీనివాస్‌కు ఫోన్ చేసి చెప్పారు.

05/02/2016 - 05:48

ఖమ్మం, మే 1: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ప్రధాన అనుచర వర్గమంతా టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. గత కొద్ది రోజులుగా ఎంపితో పాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇతర ప్రధాన నేతలు అధికార పార్టీలో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది.

05/02/2016 - 05:46

విజయవాడ, మే 1: ‘స్వార్ధ ప్రయోజనాల కోసం తాను కేంద్రంతో రాజీపడుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం నాకెం తో బాధ కలిగిస్తోంది. అలా రాజీపడటం నా జీవితంలోనే లేదు. అయితే ప్రజల కోసం ఎలాంటి రాజీకైనా, త్యాగానికైనా సిద్ధపడతా’ అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.

05/02/2016 - 05:45

హైదరాబాద్, మే 1: తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులు మరో వారంపాటు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. రాయలసీమ జిల్లాలతోపాటు కోస్తాలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో, తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండి హెచ్చరించింది.

05/02/2016 - 05:43

హైదరాబాద్, మే 1: వచ్చే నెల 15వ తేదీ నాటికి హైదరాబాద్‌నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి తరలించనున్న మొదటి విడత ప్రభుత్వ శాఖల గుర్తింపు దాదాపు ఖరారైంది. అమరావతి రాజధాని ప్రాంతంలో వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనులు వేగవంతమవుతున్న విషయం విదితమే.

05/02/2016 - 05:39

హైదరాబాద్, మే 1: రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాలేదనే ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బిజెపి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? ఈ నెల 4వ తేదీ బుధవారం నీతి అయోగ్ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఇంతవరకు కేటాయించిన నిధులు తదితర అంశాలపై ఈ సమావేశంలో నీతి అయోగ్ ఉన్నతాధికారులు చర్చించనున్నారు.

Pages