S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2016 - 05:38

విజయవాడ, మే 1: హైదరాబాద్ నుంచి రాజధానికి ఉద్యోగులు తరలి రానున్నారు. వారు నివాసం ఉండేందుకు కావల్సిన ఇళ్ళను నిర్మించేపనిలో పడ్డారు రైతులు. ఈ ఇళ్ళు నిర్మించాలంటే కూలీలు కావాలి కదా! అసలు సమస్య ఇక్కడే మొదలైంది. వందల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు తయారవుతున్నాయి. వీటికి వేల సంఖ్యలో కూలీల అవసరం ఉంది. ఉన్న ఊళ్ళో తాపీ మేస్ర్తీ పని చేసేవారితో కథ నడిపిద్దాం అని రైతులు అనుకున్నారు. అయితే, వారు హ్యాండిచ్చారు.

05/02/2016 - 05:18

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ యాజమాన్యం (అసలు యజమానులు ప్రజలే) నిర్వహణా వ్యయాలు తగ్గించుకోకుండా నష్టాలు పూడ్చుకోవటానికి అంటూ చీటికి మాటికి ప్రజలపై భారం మోపుతున్నది. తాజాగా చార్జీలు పెంచకుండా ప్యాసింజర్, నాన్ స్టాప్ ఎక్స్‌ప్రెస్‌ల సంఖ్య తగ్గించి పాతబడిన లగ్జరీ బస్సులకే వీడయోలు ఏర్పాటుచేసి నాన్‌స్టాప్ సర్వీసులుగా తిప్పుతూ రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు.

05/02/2016 - 05:16

వచ్చే ఏడాది మొదట్లోనే అంటే 2017 యు.పి.లో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే పంజాబ్‌లో కూడా వోట్ల పండుగ- రెండూ కూడబలుక్కొని వచ్చేస్తున్నాయ్.

05/02/2016 - 04:22

మన సమాజంలో సంప్రదాయక నీతి, సౌశీల్యం, నిజాయితీ, అనుబంధాలు వగైరా ఉత్తమమైన, సహజమైన సాంఘిక లక్షణాలు అడుగంటిపోవడానికి కొన్ని తమాషా కోర్టు తీర్పులు- తెలిసో తెలియకో దోహదం చేస్తున్నాయి. శని సింగణాపూర్ దేవాలయంలోకి స్ర్తిలను అనుమతించకపోతే ఆరు నెలలజైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని డిహెచ్ వాఘేలా, ఎంహెచ్ సోసక్‌లతో కూడిన బొంబాయి హైకోర్టు ధర్మాసనం గత మార్చి 30న తీర్పు ఇచ్చింది.

05/02/2016 - 04:20

అధికారం లభించే అవకాశాన్ని 2014లో కొద్దిలో కోల్పోయిన వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి, ఒకవేళ జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే 2019లో అవకాశం లభించవచ్చునని ఒక దశలో అనిపించింది. కాని ఇటీవలి పరిణామాలను గమనించిన మీదట, అటువంటి అవకాశం సందేహాస్పదమవుతున్నది. అందుకు ఆయన ప్రత్యర్థి అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేర్పరితనం కన్నా, జగన్ అపరిపక్వ ధోరణులు కారణమవుతున్నాయని చెప్పాలి.

05/02/2016 - 04:16

అవినీతికి ఆకాశమెత్తు ప్రతీక అయిన అంతస్థుల ఆదర్శ భవనాన్ని కూలగొట్టాలని కేంద్ర ప్రభుత్వానికి బొంబాయి హైకోర్టు ఉత్తరువులు జారీ చేయడం సందర్భోచిత పరిణామం. రక్షణ రంగాన్ని అగస్టా వెస్ట్‌లాండ్ గగన శకటాల అవినీతి కుదుపుతున్న సమయం లో ముంబయి ఉన్నత న్యాయస్థానం శుక్రవారం చెప్పిన తీర్పు సరికొత్త ప్రకంపనం..ఆదర్శ భవన సముదాయం రక్షణ రంగంలో పెరిగిన మరో అవినీతి పుట్ట!

05/02/2016 - 03:52

‘శరీర మాధ్యం ఖలు ధర్మసాధనమ్’ అన్న వేదోక్తి ప్రకారం మానవునికి లభించిన ఈ శరీరమనే ఉపాధి ధర్మసాధనకు మాత్రమే వినియోగించాలి. కాని నేడు కలియుగ ప్రభావం వలన ధర్మమనే మాటకు సరి అయిన నిర్వచనం తెలియక సతమతమవుతున్నారు. పూర్వజ్ఞానం విజ్ఞాన శాస్తమ్రుగా ఆవిర్భవించినప్పటినుండి మానవులలో స్థిరత్వము లోపించింది. ఉత్కృష్టమైన మానవ జన్మను స్వజాతి నాశనము కొరకు వినియోగిస్తున్నారు.

05/02/2016 - 03:51

వీడు అవధ్యుడు. దేవతాదత్తుడైన వరగర్వితుడు. వీణ్ణి జయించి చంపటం అసాధ్యం. శత శత సంవత్సరాలకైనా అది నెరవేరదు. అయితే నీకంటికింపు మంటలకు కాలిపోయినాడు. వీడి పేరు కాలయవనుడు. నీవేమో త్రేతాయుగానికి చెందినవాడవు మహానుభావా! ఇది ఇపుడు కలియుగం ప్రవేశించబోతున్న కాలం అని చెప్పాడు కృష్ణుడు.

05/02/2016 - 03:48

శ్రీకర్ తల పంకించి, ‘‘అంతా చిత్రంగా ఉందే!’’ అన్నాడు. తర్వాత నెమ్మదిగా, ‘‘ఇంతకీ మీకు పని కావాలని అడిగి నాకు పని అప్పగించారేమిటి?’’ అన్నాడు.

05/02/2016 - 03:44

క. మనమునకుఁబ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యము ను నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్

Pages