S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2016 - 17:15

విజయవాడ:విభజన చట్టం మేరకు కేంద్రంనుంచి రావలసిన నిధులకోసం రాజీలేని పోరాటం చేస్తామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగిస్తూ కేంద్రంనుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదన్నారు. నిధుల రాబట్టే విషయంలో తగిన విధంగా స్పందించడం లేదని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, ఇది రాజకీయమని అన్నారు.

05/01/2016 - 16:31

హైదరాబాద్:మ్యాన్‌హోల్‌లో దిగి పనిచేస్తున్న ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడక మరణించారు. హైదరాబాద్‌లోని రామ్‌కోఠి తిలక్‌నగర్‌లో ఆదివారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది.

05/01/2016 - 16:30

విజయవాడ:అసంఘటిత కార్మికులకోసం ఏపీ ప్రభుత్వం చంద్రన్న భీమా పథకం పేరిట ఓ స్కీమ్‌ను ప్రకటించింది. విజయవాడ ఏ1 కనె్వన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా కొత్త భీమా పథకంగురించి వివరించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 1.5కోట్లమంది కార్మికులకు ఈ పథకం వల్ల లబ్ది చేకూరుతుందని ఆయన చెప్పారు. పనిచేస్తున్న కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.

05/01/2016 - 16:30

వారణాసి:దాదాపు 5కోట్ల మంది పేద మహిళలకు ఉపయోగపడే కొత్త పధకం ప్రధానమంత్రి ఉజ్వలయోజనను ప్రధాని నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, సిలెండర్లు పంపిణీ చేశారు. ఈ పథకం వల్ల పేదలకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయన అన్నారు.

05/01/2016 - 16:29

వారణాసి:కార్మికుల శ్రమవల్లే ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుందని, తానుకూడా ఒక కార్మికుడినేనని, దేశంలో నెంబర్ వన్ కూలీని తానేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బనాలీ గ్రామంలో జరిగిన మే డే వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

05/01/2016 - 16:28

న్యూదిల్లి:అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్ల కొనుగోలులో జరిగిన గోల్‌మాల్ వ్యవహారంపై 4న పార్లమెంటులో గుట్టు విప్పుతానని రక్షణమంత్రి మనోహర్ పారికర్ మీడియాకు చెప్పారు. ఆ ఒప్పందానికి సంబంధించిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లను సభముందుంచుతానని స్పష్టం చేశారు. యుపిఎ హయాంలో జరిగిన ఈ కుంభకోణంపై ఇప్పటికే పార్లమెంట్‌లో కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది.

05/01/2016 - 07:02

హైదరాబాద్, ఏప్రిల్ 30: అన్నమయ్య కీర్తనలకు ప్రాచుర్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ‘అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం’ పేరుతో ఒక బృహత్ ప్రణాళికను రూపొందించింది.

05/01/2016 - 07:00

హైదరాబాద్, ఏప్రిల్ 30: కార్మికుల కోసం ప్రత్యేకంగా బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ అంశంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నియమించామని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. కార్మికుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

05/01/2016 - 06:59

హైదరాబాద్, ఏప్రిల్ 30: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశానికి ఏకీకృత పరీక్ష- నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు సంబంధించి తామిచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని సుప్రీంకోర్టు శనివారం మరో మారు స్పష్టంగా చెప్పినా, రానున్న రోజుల్లో విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయాలను సుప్రీంకోర్టు తీసుకుంటుందనే ఆశాభావాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.

05/01/2016 - 06:58

హైదరాబాద్, ఏప్రిల్ 30: హైదరాబాద్‌లో ఏ రోడ్డున వెళ్లినా అడుగడుగునా ట్రాఫిక్. నిత్యం నరకాన్ని ఎదుర్కొనే మహానగరవాసుల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రోరైలు కాస్త ఆలస్యంగా పరుగులు తీయనుంది. ప్రతిపాదనల స్థాయి నుంచే అనేక రకాల అడ్డంకులెదుర్కొంటున్న మెట్రోరైలు కనీసం స్వరాష్ట్రం, స్వపరిపాలనలోనైనా కాస్త ముందుగా అందుబాటులోకి వస్తుందని భావించిన జంటనగరవాసుల అంచనాలు తారుమారయ్యాయి.

Pages