S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2016 - 06:47

తెలంగాణలో మద్యం షాపుల డ్రై డేలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2వ తేదీ, గణేష్ నిమజ్జనం రోజున డ్రై డేలు ఉంటాయి. ఇటీవల కాలంలో శ్రీరామనవమి, హనుమజ్జయంతికి కూడా హైదరాబాద్‌లో డ్రై డేలు ప్రకటించారు. బోనాల ఉత్సవం, హోళీ పండగకు కూడా మద్యం షాపుల బంద్ ప్రకటించారు. ప్రభు త్వం మద్యం అమ్మకాలను నిరుత్సాహపరిచేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల మద్యం వ్యతిరేకులు స్వాగతిస్తున్నారు.

05/01/2016 - 06:45

‘‘అంత శ్రద్ధగా రాస్తున్నావు.. ఏంటి శ్రీశ్రీకి నివాళినా? ’’
‘‘తెలుగు సినిమాకు నివాళి.. ఆ ఏంటో అన్నావు. సరిగా వినలేదు’’
‘‘ ఏం రాస్తున్నావు ?’’
‘‘ మన హీరో 101వ సినిమాకు కథ రాస్తున్నాను. చదువు’’
***

05/01/2016 - 06:42

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో మిత్రునికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి చూడటానికి వెళ్లాం.

05/01/2016 - 06:39

పేదలందరికి ఆధునిక వైద్యసేవలు..2 అంటూ ఏప్రిల్ 19న తన జన్మదిన కానుకగా చంద్రబాబు 275 సంచార్ ప్రాథమిక చికిత్స కేంద్రాలను ప్రారంభిస్తూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో (ఉమ్మడి రాష్ట్రంలో) ప్రజారోగ్యం కుంటుపడిందన్నారు. కాని దశాబ్దం క్రితం వరకు రాష్ట్రం బాబు పాలన కిందనే సాగిందనేది మరచిపోయాడు.

05/01/2016 - 06:32

భీమవరం, ఏప్రిల్ 30: గోదావరి నదిపై పట్టిసం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయంగా పెనుగొండ మండలం సిద్ధాంతం సమీపంలోని దొంగరావిపాలెం వద్ద ప్రభుత్వం ఏర్పాటుచేసిన తాత్కాలిక ఎత్తిపోతల పథకం సత్ఫలితాన్నిచ్చింది. రూ.15 కోట్ల వ్యయంతో 14 భారీ పంపుల ద్వారా సుమారు 150 క్యూసెక్కుల నీటిని తోడి, ఈ దాళ్వాలో పశ్చిమ డెల్టాలోని 30 వేల ఎకరాలకు నీరందించగలిగారు.

05/01/2016 - 06:31

పీలేరు, ఏప్రిల్ 30: శేషాచల కొండల్లో మరోసారి ఎర్రచందనం కూలీలకు, టాస్క్ఫోర్సు సిబ్బందికి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కూలీల రాళ్ళదాడిలో ఓ కానిస్టేబుల్ గాయపడగా, కిందపడ్డ కూలీ సైతం గాయపడ్డారు. తిరుమల శేషాచల కొండల్లోని బోనుగుట్ట వద్ద శనివారం కూంబింగ్ చేస్తున్న టాస్క్ఫోర్సు సిబ్బందికి దాదాపు 30మంది కూలీలు తారసపడ్డారు.

05/01/2016 - 06:30

విశాఖపట్నం, ఏప్రిల్ 30: రాజకీయ స్పృహతోనే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పలువురు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తాను చేస్తున్న కృషికి మీ అందరి మద్దతు అవసరమన్నారు.

05/01/2016 - 06:24

తిరువనంతపురం, ఏప్రిల్ 30: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కుంభకోణంపై అధికార బిజెపి కాంగ్రెస్ పార్టీపై దాడిని మరింత తీవ్రం చేసింది. యుపిఏ హయాంలో ఆ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని, అయితే ఎన్డీఏ దాన్ని ఎత్తివేసిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన ‘ఊహాజనితమైన కట్టుకథ’ అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

05/01/2016 - 06:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: పార్లమెంటులో, శాసన సభల్లో చట్టాలను చేసే ప్రజాప్రతినిధులు కొత్త చట్టాలను చేసేటప్పుడు ఎలాంటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారో వాటి అమలుకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించడానికి కూడా అదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సూచించారు.

05/01/2016 - 06:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఫ్లాట్ కొనుగోలుదారులు ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్న రియల్ ఎస్టేట్ చట్టం ఆదివారం నుంచి అమలులోకి వస్తోంది. కార్యాచరణ నియమాలు, నియంత్రణ అధికార వ్యవస్థ (రెగ్యులేటరీ అథారిటీ) ఏర్పాటు, పునర్వివిచారణ న్యాయ స్థానాలు (అప్పెల్లెట్ ట్రిబ్యునల్స్) పని మే 1నుంచి ప్రారంభం అవుతాయని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ శనివారం ప్రకటించింది.

Pages