S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2016 - 06:15

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఇక ప్రభుత్వోద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పని లేదు. అధికారులను కలిసి అభ్యర్థించాల్సిన అవసరం లేదు. పోలీసు వెరిఫికేషన్ కోసం ఇక లంచాలు ఇవ్వాల్సిన అక్కర లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కేటగిరీల ఉద్యోగాలు ఇక ఆన్‌లైన్ ద్వారానే భర్తీ కానున్నాయి.

05/01/2016 - 06:13

బళ్లారి, ఏప్రిల్ 30: కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థినులు సహా తొమ్మిది మంది మృతిచెందారు. చెళ్లకెర తాలూకాలో జాతీయ రహదారిపై క్రూయిజర్ వాహనాన్ని కర్నాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో క్రూయిజర్ డ్రైవర్ సహా బళ్లారికి చెందిన ఎనిమంది విద్యార్థినులు మృతి చెందారు.

05/01/2016 - 06:11

ఆక్లాండ్, ఏప్రిల్ 30: భారత్, న్యూజిలాండ్ మధ్య సంబంధాలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. భారత్ అనుసరిస్తున్న ‘లుక్ ఈస్ట్’ విధానం ఇప్పుడు ‘లుక్ యాక్ట్’గా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ప్రణబ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

05/01/2016 - 07:21

భీమవరం, ఏప్రిల్ 30: ఒకప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో హొయలొలికిన ఆంధ్రా లేసు ఉత్పత్తులు ప్రస్తుతం చైనా నుండి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక కుదేలవుతున్నాయి. చైనాలో యంత్రాలపై తయారైన లేసు ఉత్పత్తుల ముందు చేతి అల్లికలపై ఆధారపడిన ఆంధ్రా లేసు ఉత్పత్తులు వెలవెలబోతున్నాయి. ధర తక్కువగా ఉండటం, నిర్ణీత సమయంలో సరఫరా చేస్తుండటంతో చైనా లేసు ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌ను ఏలుతున్నాయి.

05/01/2016 - 05:55

ముంబయి, ఏప్రిల్ 30: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు అప్పులిచ్చిన బ్యాంకర్ల పరిస్థితి ‘మూలిగే నక్క మీద తాటిపండు’ పడ్డ చందంగా మారింది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిలు రావాల్సి ఉన్నది తెలిసిందే.

05/01/2016 - 05:54

ముంబయి, ఏప్రిల్ 30: వరుస రెండు వారాల లాభాలకు బ్రేక్ వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 231.52 పాయింట్లు కోల్పోయి 25,606.62 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 49.50 పాయింట్లు పడిపోయి 7,849.80 వద్ద నిలిచింది.

05/01/2016 - 05:52

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల వాతావరణం కల్పించడం ద్వారా పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా మంచి ర్యాంకు సాధించాలని టిఎస్ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులకు సూచించారు. గతంలో ఈ అంశంలో ప్రపంచ బ్యాంకు మంచి ర్యాంకు ఇవ్వకపోవడంతో శాఖల వారీగా అధికారులతో శనివారం ఇక్కడ కెటిఆర్ సమీక్ష జరిపారు.

05/01/2016 - 05:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: హోం గ్రౌండ్‌లో శనివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) గ్రూప్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ 27 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. కరుణ్ నాయక్, బిల్లింగ్స్ అర్ధ శతకాలతో రాణించడంతో డేర్‌డెవిల్స్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 186 పరుగులు చేయగలిగింది. అనంతరం నైట్ రైడర్స్‌ను 18.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ చేసింది.

05/01/2016 - 05:43

ఉహాన్ (చైనా), ఆగస్టు 30: భారత టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న ఈ హైదరాబాదీ తన కంటే ఒక స్థానం తక్కువగా ఉన్న వాంగ్ ఇహాన్‌ను ఢీకొని, 16-21, 14-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. భారత్ తరఫున బరిలోకి దిగిన మిగతా వారంతా ఇంతకు ముందే నిష్క్రమించారు.

05/01/2016 - 05:42

సెయింట్ జాన్స్, ఏప్రిల్ 30: పలు సమస్యలపై ఆటగాళ్లతో చర్చించి, వాటిని పరిష్కరిస్తామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) ప్రకటించింది. సెంట్రల్ కాంట్రాక్టులోని కొన్ని అంశాలు తమకు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేస్తున్న కొంత మంది వెస్టిండీస్ క్రికెటర్లు జీతభత్యాలను పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

Pages