S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/23/2018 - 03:56

పెనుకొండ, ఫిబ్రవరి 22: కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించి ఉంటే మరింత అభివృద్ధి చెంది ఉండేవారమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద నిర్మితమవుతున్న కియ కార్ల ఫ్యాక్టరీ రూపకల్పన ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడారు.

02/23/2018 - 03:55

చిత్తూరు, ఫిబ్రవరి 22 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చావో రేవోలా పోరాడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంగా కేంద్రం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ చిత్తూరు కాంగ్రెస్ కమిటి ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆర్‌డిఓ కార్యాలయం ముందు ఆంధ్రుల ఆత్మ గౌరవ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.

02/23/2018 - 01:17

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 22: ఉపాధి నిధులు రావడంలో ఆలస్యమైన సందర్భంలో రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధి హామీ కూలీలకు వేతనంగా స్ర్తినిధి నిధులు సర్దుబాటు చేసేవిధంగా ఆలోచన చేస్తున్నామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో పెడతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డి రామాంజనేయులు తెలిపారు. రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

02/23/2018 - 00:18

విజయవాడ, ఫిబ్రవరి 22: హైదరాబాద్‌లో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడే ఎంపీలు ఆంధ్ర ద్రోహులని, వారికి సిగ్గుంటే ఆంధ్రప్రదేశ్‌లో నివాసం ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడాలని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

02/23/2018 - 00:20

విజయవాడ, ఫిబ్రవరి 22: ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా త్వరలో బాలింతలకు మదర్ కిట్స్‌ను అందచేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల తీరు అంతంతమాత్రంగా ఉండటంతో ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేందుకు వెనుకంజ వేసేవారు. దీంతో ఇళ్లల్లోనే ఎక్కువగా ప్రసవాలు జరిగేవి.

02/23/2018 - 00:17

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 22: విద్యేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని నరసరావుపేట టీడీపీ పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు డిమాండు చేశారు. ఈమేరకు ఆయన గురువారం రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.

02/23/2018 - 00:16

విజయవాడ, ఫిబ్రవరి 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలోని 24వేల మంది విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ప్రధాన డిమాండ్లయిన డైరెక్ట్ పేమెంట్, దశలవారీ క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, పీస్ రేటు రద్దు కోసం చేపట్టిన సమ్మె గురువారం 3వ రోజుకు చేరింది. 13 జిల్లాల్లో కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు.

02/23/2018 - 00:16

విజయవాడ, ఫిబ్రవరి 22: అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె కారణంగా రాష్ట్రంలో అత్యవసర సేవలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలన్నింటినీ తీసుకోవాలని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

02/20/2018 - 04:27

హైదరాబాద్, ఫిబ్రవరి 19: రైల్వేలో సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చేసుకుంటూ పోవడం అనేది ఓ నిరంతర ప్రక్రియ అని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. రైల్వే వినియోగదారులు సంతృప్తి చెందే వరకు, రైల్వే శాఖ లక్ష్యాలు సాధించే వరకు సాంకేతికాభివృద్ధి అనేది నిరంతరం వృద్ధి చెందే ప్రక్రియ అని పేర్కొన్నారు.

02/20/2018 - 04:26

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 19: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంపై ఎంతటి పోరాటానికైనా సిద్దమని, అవసరమైతే అన్ని పక్షాలను కలుపుకునిపోయి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికైనా వెనుకాడేది లేదని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అయితే ముందుగా పార్లమెంటులో అన్ని విధాలుగా పోరాడాలని, ఎంపీలు రాజీనామాలు చేస్తే పార్లమెంటులో నిలదీసి ఉద్యమించడానికి ఎవరుంటారని ప్రశ్నించారు.

Pages