S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/20/2018 - 04:25

విజయవాడ, ఫిబ్రవరి 19: ఉపాధి హామీ పథకం కూలీలకు వేసవిలో వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌లో 30 శాతం అధికంగా వేతనాలు చెల్లించాలని చెప్పారు. సంఘటితంగా పనిచేసే మహిళా బృందాలకు అధికంగా వేతనాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

02/20/2018 - 04:23

విజయవాడ, ఫిబ్రవరి 19: వైకాపా అధినేత జగన్, బీజీపీల మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆరోపించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్, బీజేపీలు ఎన్నడూ విమర్శించుకోని విషయాన్ని గుర్తు చేశారు. జగన్‌ను బీజేపీ నేతలు విమర్శించరని, బీజేపీ నేతలను కూడా జగన్ పల్లెత్తు మాట అనరని ఆరోపించారు.

02/20/2018 - 04:22

విజయవాడ, ఫిబ్రవరి 19: కామవరపుకోటకు చెందిన మహబూబ్ సుభాని తలలో నరం సమస్య వల్ల కదల్లేని పరిస్థితిలో ఉండడంతో తన ఆఖరి కోరికగా సీఎం చంద్రబాబు నాయుడును చూడాలని ఉందని ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు చెప్పడంతో ఆయన కారులో పోగొండ రిజర్వాయరు ప్రాంతానికి తీసుకొచ్చారు.

02/20/2018 - 04:22

విజయవాడ, ఫిబ్రవరి 19: గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో ఆయనను గ్రామ రెవెన్యూ సహాయకులు సోమవారం కలిశారు. 4500 మంది డైరెక్టు రిక్రూట్‌మెంట్ విఆర్‌ఏలకు రికార్డు అసిస్టెంట్ స్కేల్ ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

02/20/2018 - 04:21

విజయవాడ, ఫిబ్రవరి 19: సివిల్ సర్వీస్ పరీక్ష 2016కు సంబంధించి ఐపీఎస్‌కు ఎంపికైన వారిలో ఐదుగురిని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. బిందుమాధవ్ గరికిపాటి, నితికా పంత్, తుహిన్ సిన్హా, జగదీష్.పి, జి.కృష్ణకాంత్‌లను ఏపీ క్యాడర్‌కు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

02/20/2018 - 04:21

విజయవాడ, ఫిబ్రవరి 19: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానానికి రెండు ప్రత్యామ్నాయాలు ఇచ్చామని రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడించారు. తమ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే, నిమిషంలో రాజీనామాలు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

02/20/2018 - 04:20

విజయవాడ, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులు, నిధుల విడుదలపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం, అయితే మీరు సిద్ధమేనా అంటూ తెలుగుదేశం పార్టీకి బీజేపీ సవాల్ విసిరింది.

02/20/2018 - 04:19

విజయవాడ, ఫిబ్రవరి 19: రాబోయే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు, యువతకు పెద్దపీట వేయనుంది. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. డ్రాపౌట్స్ నిరోధంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పదో తరగతి వరకూ మధ్యాహ్నం భోజన అమలు చేస్తోంది. పేద విద్యార్థులకు మరింత మేలు కలిగే విధంగా ఉదయం టిఫిన్ అందజేయాలనే ఆలోచన చేస్తోంది.

02/20/2018 - 04:09

గుంటూరు/నూజివీడు, ఫిబ్రవరి 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ సాధించే వరకు పోరాటం ఆగబోదని, కేంద్రంతో చావో..రేవో తేల్చుకుంటామని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి స్పష్టంచేశారు.

02/20/2018 - 04:07

శ్రీకాకుళం, ఫిబ్రవరి 19: బీజేపీతో లెక్కలు తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పితాని సత్యన్నారాయణ వెల్లడించారు. తానూ లెక్కలు చదువుకున్నానని..తనకూ లెక్కలు వచ్చని..మార్చి 5లోగా ఏ లెక్కలు చెబుతారో చెప్పండంటూ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. తర్వాత పొత్తులు ఉండాలో, లేదో అసలు లెక్కలు తేల్చేందుకు సంసిద్ధంగానే ఉన్నామన్నారు.

Pages