S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/21/2018 - 00:22

విజయవాడ, జనవరి 20: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య శనివారం రాష్ట్ర ప్రణాళికా బోర్డ్ ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావును సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో కలిసి కార్పొరేషన్ అమలుచేస్తున్న పథకాల గురించి తెలియజేశారు. 2018-19కి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌లో తగిన ప్రణాళికతో నిధుల కేటాయింపు గురించి ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సిందిగా కోరుతూ ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

01/21/2018 - 00:21

విజయవాడ, జనవరి 20: కృష్ణాజిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హర్షారెడ్డి పూణెలో అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామానికి చెందిన హర్షారెడ్డి 15 నెలల నుంచి కనిపించకుండా పోయారు. పూణెలోని వొడాఫోన్ కంపెనీలో హర్షారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 15 నెలలుగా అతను ఉద్యోగానికి రాకపోయినా 10 నెలల జీతాన్ని హర్షారెడ్డి ఖాతాలో వొడాఫోన్ కంపెనీ జమ చేసినట్టు తెలుస్తోంది.

01/20/2018 - 03:58

విజయవాడ, జనవరి 19: రాష్ట్రంలో పేదలకు నిర్మించ తలపెట్టిన 18 లక్షల ఇళ్ల నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది జనవరిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కింద చేపట్టిన 5 లక్షల ఇళ్లతో సహా మొత్తం 18 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

01/20/2018 - 03:56

విజయవాడ, జనవరి 19: 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించేలా చూడాలని జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. పాఠశాలకు వెళ్లే వయస్సున్న ప్రతి చిన్నారి కచ్చితంగా చదువుకునేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని, నూతన విద్యా సంవత్సరానికి ఇంకా ఆరు నెలలే సమయం ఉందని చెప్పారు. ఈ విషయంలో నూరు శాతం నమోదయ్యేలా విద్యాశాఖ లక్ష్యం పెట్టుకోవాలని అన్నారు.

01/20/2018 - 03:54

రాజమహేంద్రవరం, జనవరి 19: వరి పొట్ట దశలో సరిపడా జలాలు అందించగలిగితే రబీ గట్టెక్కినట్టే.వరి సాగులో ఇదే కీలక దశ.ఈ దశలోనే సాగు జలాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. రబీ వరి సరిగ్గా. ఈ దశకు చేరుకునే సమయంలోనే గోదావరి నదిలో సహజ జలాలకు మరీ గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. ఈ పరిస్థితుల నుంచి సమర్ధవంతంగా గట్టెక్కడాన్ని బట్టే గోదావరి బేసిన్‌లోని రబీ ఆధారపడి ఉంటుంది.

01/20/2018 - 03:25

విజయవాడ (క్రైం), జనవరి 19: ‘రాష్ట్రంలో ఒక్క రౌడీ కనపడేందుకు వీల్లేదు.. వారికి ఈ రాష్ట్రంలో స్థానం లేదు.. నేరగాళ్లకు సింహస్వప్నం కావాలి.. మీకు సరిగ్గా ఆరునెలల సమయం ఇస్తున్నా. రాష్ట్రంలో నేరాలు తగ్గిపోవాలి.. ముఖ్యంగా మహిళలపై వేధింపులు ఉండకూడదు.. నేరాలు చేసేవారికి భయం ఏర్పడేలా మీ చర్యలుండాలి.. గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపండి.. గిరిజనులను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న ఈ అరాచకాలకు తెరదించండి..

01/20/2018 - 03:22

విజయవాడ, జనవరి 19: ప్రతి ఏటా వసంత పంచమి రోజున అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో అమ్మకు వందనం బ్రోచర్‌ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కింద తల్లులను గౌరవించాలని, ఘనంగా దీనిని నిర్వహించాలని కోరారు. ఈ ఏడాది జనవరి 22న నిర్వహించనున్నట్లు తెలిపారు.

01/20/2018 - 03:12

విశాఖపట్నం, జనవరి 19: మహిళలంతా సంఘటితంగా ఉంటూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రత్నప్రభ విజ్ఞప్తి చేశారు. విశాఖలో మూడు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు సభలో రత్నప్రభ మాట్లాడుతూ సమాజంలో మగవారు వ్యాపారం చేసి నష్టపోతే, వారిని ఎవరూ తప్పుపట్టరు.

01/20/2018 - 03:10

కడియం, జనవరి 19: తూర్పుగోదావరి జిల్లాలో కడియం నర్సరీ రైతులు ఉచిత విద్యుత్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేబట్టారు. కడియం బంద్‌కు పిలుపునిచ్చిన నర్సరీ రైతులు సుమారు వెయ్యి మంది స్థానిక విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసన తెలిపారు. తమను విద్యుత్ శాఖ అధికారులు గత రెండేళ్లుగా వేధిస్తున్నారని నర్సరీ రైతులు పేర్కొన్నారు.

01/20/2018 - 03:09

జంగారెడ్డిగూడెం, జనవరి 19: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఒక మహిళ సాధారణ కాన్పులో 4.6 కిలోల బరువుగల బిడ్డకు జన్మనిచ్చిందని పిహెచ్‌సి వైద్యాధికారిణి డాక్టర్ ఎం సౌజన్య తెలిపారు. శుక్రవారం పిహెచ్‌సిలో మూడు సాధారణ కాన్పులు జరగ్గా అందులో లక్కవరానికి చెందిన ఆరుగొల్లు అంజిబాబు భార్య అంజన 4.6 కిలోల బరువుగల మగ బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు.

Pages