S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/23/2018 - 03:31

నందిగామ, జనవరి 22: రాష్ట్రప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సింహ భాగం నిధులు విడుదల చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధ్రీరి అన్నారు.

01/23/2018 - 03:30

అమరావతి, జనవరి 22: హోదాతో ముడిపడి ఎన్నికల పొత్తులు, రాజకీయాలు ఉండవని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తే తాను బీజేపీతో కలసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానన్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై సోము స్పందించారు. జగన్ వ్యాఖ్యలపై బీజేపీ వివరణ కోరగా, ప్రత్యేక హోదాను అనుసరించి పొత్తులుండవని వ్యాఖ్యానించారు. అయినా మేం టీడీపీతోనే ఉన్నాం. విడిపోలేదు కదా?

01/23/2018 - 03:27

సామర్లకోట, జనవరి 22: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని వీర వెంకట విఘ్నేశ్వర ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కేంద్రం ఆవరణలో సోమవారం సంభవించిన పేలుడులో ఒక యువకుడు దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పేలుడు తారాజువ్వలు తయారుచేస్తుండగా నిప్పు రవ్వలు లేచి, పేలుడు సంభవించింది.

01/22/2018 - 03:42

కడప, జనవరి 21 : ఏడాదిలోపు గండికోటకు ఊహించని పర్యాటక వైభవం తీసుకొస్తామని రాష్ట్ర మార్కెటింగ్, పశుసంవర్థకశాఖ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లాలోని గండికోట క్షేత్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో మంత్రి ఆదినారాయణరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి గండికోట ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆది మాట్లాడుతూ గండికోటను భానుకొండల్లో 900 ఏళ్ల క్రితం నిర్మించారన్నారు.

01/22/2018 - 03:40

రాజమహేంద్రవరం, జనవరి 21: ఎట్టకేలకు పోలవరం పవర్‌హౌస్ నిర్మాణ పనులకు టెండర్లు ఖరారయ్యాయి. పోలవరం పవర్‌హౌస్ నిర్మాణ పనులు ఏపీ జెన్కో ఆధ్వర్యంలో నవయుగ సంస్థకు దక్కాయి. సాంకేతిక బిడ్‌లో అన్ని అర్హతలు ఈ సంస్థకు లభించడంతో పవర్‌హౌస్ నిర్మాణ కాంట్రాక్టు నవయుగ సంస్థకు లభించింది. మార్చిలో పవర్‌హౌస్ కాంక్రీటు పనులు మొదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

01/22/2018 - 03:38

ఉక్కునగరం, జనవరి 21: ఒక సెక్షన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విశాఖ ఉక్కు కర్మాగారంలోని బ్లాస్ట్ ఫర్నేస్-3 విభాగంలో 24 గంటలు పైగా ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. సమాచారం తెలుసుకున్న వెంటనే సిఎండి మధుసూదనరావుతోపాటు ఇతర ఉన్నతాధికారులు బ్లాస్‌ఫర్నేస్-3లో ఆదివారం సమస్యను పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి పునరుద్ధరణ పనులను చేపట్టాలని విభాగాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

01/22/2018 - 03:37

నెల్లూరు, జనవరి 21: నెల్లూరుకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని ఆదివారం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బ్యాంకులకు రుణాలు ఎగవేత కేసులో వాకాటిపై కర్నాటకలో పోలీసు కేసు నమోదై ఉంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. గత ఏడాది నెల్లూరు నగరంలోని వాకాటి నారాయణరెడ్డి ఇంటిలో సీబీఐ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.

01/22/2018 - 03:36

ఆర్. కారునాయుడు

01/22/2018 - 02:08

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 21: రాష్టవ్య్రాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తున్న నేపథ్యంలో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బాధితులతో కలిసి ‘చలో అమరావతి’ ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. దీంతోపాటు రాష్టవ్య్రాప్తంగా మండలాల్లో బాధితులకు భరోసా కల్పించేందుకు యాత్రలు, ఆందోళనలు నిర్వహించనున్నారు.

01/22/2018 - 02:06

విజయవాడ, జనవరి 21: ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వీలైనంతగా కేంద్రం నుంచి వివిధ పథకాల కింద నిధులను రాబట్టే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రెండంకెల వృద్ధిరేటు సాధించినప్పటికీ ఆమేరకు ఆర్థిక కార్యకలాపాలు పెరగపోవడంతో నిధుల కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. కేంద్రం నుంచి వివిధ పథకాల కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,522 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉంది.

Pages